ఆట కదరా శివ" ఒక devotional symphony సంగీత కార్యక్రమం
ఇవామ్ (IWAM) సాంస్కృతిక సంస్థ అద్వర్యం లో , తెలంగాణ సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ సమర్పిస్తుండగా ప్రముఖ కవి, నటులు, రచయిత, దర్శకులు, శ్రీ తనికెళ్ళ భరణి గారి సారథ్యం లో
ప్రముఖ వేణు వాద్య కళాకారుడు శ్రీ తాళ్లూరి నాగరాజు సంగీతం దర్శకత్వంలో శ్రీమతి మణి నాగరాజ్ చేపట్టిన కార్యక్రమం "ఆటగదరా శివా"
ప్రముఖ నటులు, రచయిత తనికెళ్ళ భరణి గారు 'ఆటగదరా శివ' అనే పేరుతో ఒక పుస్తకాన్ని పాఠకలోకానికి అందించిన విషయం తెలిసిందే. ఈ పుస్తకం ప్రేక్షకాదరణకు నోచుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ పుస్తకంలోని అంశాలను ఒక కార్యక్రమం రూపంలో కూర్పు చేసి దేశవిదేశాలలో ఎన్నో ప్రదర్శనలిచ్చారు. అమెరికా, దుబాయి లాంటి పలు దేశాలలో భారతీయ వాయిద్యాలతో ఆటగదరా శివను కచేరి తరహాలో ప్రదర్శించారు.
ఆటగదరా శివ ప్రదర్శనలకు దక్కుతున్న ఆదరణను గమనించి, ఈ కార్యక్రమాన్ని మరోస్థాయికి తీసుకెళ్ళే ఆలోచనతో ప్రఖ్యాత వేణు గాన విద్వంసుడు శ్రీ తాళ్లూరి నాగరాజు అద్వర్యం లో ఒక అంతర్జాతీయ స్థాయి సంగీత, కళాకారుల బృందంతో సింఫనీ తరహలో ప్రదర్శించేందుకు ఇప్పుడు రంగం సిద్ధమయింది. ఫ్లూట్ నాగరాజు, డ్రంస్ శివమణి తదితర ప్రసిద్ధ కళాకారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. పలు విదేశీ పరికరాలను ఉపయోగించి ఈ కార్యక్రమానన్ని అజరామరంగా మార్చడానికి ప్రయత్నం జరుగుతోంది.
ఈ కార్యక్రమం ఫిబ్రవరి 20 వ తారీఖున సాయంత్రం 6.30 గంటల నుంచి హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరగనుంది. ఈ కార్యక్రమం డిపార్ట్ మెంట్ అఫ్ తెలంగాణా టూరిజం వారి సౌజన్యంతో జరుగుతుండడం ప్రస్తావనార్హం. ఈ కార్యక్రమానికి భారతి సిమెంట్స్, అలేఖ్య హోమ్స్, కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, ట్వ్5 లాంటి పలు సంస్థలు వెన్నుదన్నుగా నిలుస్తూ తమ కళాభిరుచిని చాటుకుంటున్నాయి.