Super Response To O Pittha Katha Teaser Released By Superstar Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసిన "ఓ పిట్ట కథ" టీజర్ కు సూపర్ రెస్పాన్స్

అగ్ర నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న క్యూట్ ఫిల్మ్ "ఓ పిట్ట కథ" . చెందు ముద్దు దర్శకత్వంలో వి.ఆనందప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు. , కేరింత, మనమంతా తదితర చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న విశ్వంత్ దుద్దుంపూడి ఈ చిత్రంలో మరో హీరో. నిత్యాశెట్టి కథానాయిక .

ఈ సినిమా టీజ‌ర్‌ను సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ శుక్ర‌వారం ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. ఓ పాప‌కు తండ్రి క‌థ చెప్పాల‌నుకుంటే.. ఆ పాపే తండ్రి క‌థ చెప్ప‌డంతో టీజ‌ర్ స్టార్ట్ అయ్యింది.అంద‌మైన ప‌ల్లెటూళ్లో అంద‌మైన వెంక‌ట ల‌క్ష్మి ఉండేది. అదే ఊళ్లో ఉంటున్న ప్ర‌భుకి వెంక‌ట ల‌క్ష్మి అంటే చిన్న‌ప్ప‌ట్నుంచి చాలా ఇష్టం. అదే స‌మయంలో వెంక‌ట‌ల‌క్ష్మి వాళ్లింటికి క్రిష్ అనే మ‌రో యువ‌కుడు వ‌స్తాడు. అత‌ను కూడా వెంకట ల‌క్ష్మిని ఇష్ట‌ప‌డ‌తాడు. అదే స‌మ‌యంలో క‌థ‌లో అనుకోని మ‌లుపు తిరుగుతుంది. వెంక‌ట‌ల‌క్ష్మిని ఎవ‌రో కిడ్నాప్ చేస్తారు. మ‌రి ఆమెను ఎవ‌రు కిడ్నాప్ చేశారు? అని తెలుసుకోవాలంటే మార్చి 6న విడుదలైయ్యే సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శ‌క నిర్మాత‌లు.

ఇటీవల ఈ చిత్ర టైటిల్‌ పోస్టర్‌ని మాటలమాంత్రికుడు ,దర్శకుడు త్రివిక్రమ్‌ విడుదల చేయగా, కాన్సెప్ట్ పోస్టర్‌ ని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ , కారక్టర్స్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించారు.రానా దగ్గుబాటి ప్రీ టీజర్ విడుదల చేసారు. అందరూ ఈ సినిమా కాన్సెప్ట్ విభిన్నంగా ఉందని అభినందిస్తున్నారు. చిత్ర టైటిల్ పిట్ట కథే అయినా ఇది చాలా పెద్ద కథే. కథనం పరంగాను విజువల్స్ పరంగాను సమ్మర్లో రిలీజ్ అయ్యే ఏ పెద్ద సినిమాకైనా పోటీనిచ్చేలా ఉందని కొరటాల శివ చెప్పగా, వైవిధ్యమైన కథ కథనంతో తెరకెక్కుతున్న ఈచిత్రం ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని త్రివిక్రమ్‌, హరీష్ శంకర్ లు అభిప్రాయపడ్డారు.

మంచి సినిమా విజయానికి సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుండే తెలుగు సినీదర్శకులు, హీరోలు, ఇతర ప్రముఖుల మద్దతు తో సరికొత్త ప్రమోషన్ ఆలోచనలతో వస్తున్న ఈ చిత్ర బృందానికి ప్రశంసలు లభిస్తు 0డగా, సోషల్ మాధ్యమాల్లో అద్భుత స్పందన లభిస్తోంది .

ఈ సందర్భంగా నిర్మాత వి.ఆనంద ప్రసాద్‌ మాట్లాడుతూ ''మా టీజర్ ని విడుదల చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు . ఈ టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మా 'ఓపిట్ట కథ' పేరుకి తగ్గట్టుగానే చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. కామెడీ మరియు థ్రిల్లింగ్‌ అంశాలతో, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో అందరిని ఖచ్చితంగా ఆకట్టు కుంటుందన్ననమ్మకం మా అందరికి ఉంది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయి , నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతుండగా, మార్చి 6 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం '' అని తెలిపారు .

దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ ''ఒక విలేజ్‌ బ్యాక్ డ్రాప్ తో నడిచే స్టోరీఇది. ప్రతి సన్నివేశం స్వచ్ఛంగాను విజువల్స్ పరంగా గొప్పగా తెరకెక్కించాం. ఓ వైపుకడుపుబ్బ నవ్విస్తూ మరోవైపు ఏం జరుగుతోందనే ఉత్కంఠను రేకెత్తిస్తుంది. పతాకసన్నివేశాల్లో వచ్చే ట్విస్టులు మరింత థ్రిల్‌ కలిగిస్తుంటాయి" అని అన్నారు.

నటీనటులు:

విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్‌ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు

సాంకేతిక నిపుణులు:

పాటలు: శ్రీజో

ఆర్ట్: వివేక్‌ అన్నామలై

ఎడిటర్‌: డి.వెంకటప్రభు

కెమెరా: సునీల్‌ కుమార్‌ యన్‌

సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజ

ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అన్నే రవి

నిర్మాత: వి.ఆనంద ప్రసాద్‌

కథ, స్క్రీన్‌ప్లే , మాటలు, దర్శకత్వం : చెందుముద్దు.

Super Response To O Pittha Katha Teaser Released By Superstar Mahesh Babu (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Super Response To O Pittha Katha Teaser Released By Superstar Mahesh Babu (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Super Response To O Pittha Katha Teaser Released By Superstar Mahesh Babu (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Super Response To O Pittha Katha Teaser Released By Superstar Mahesh Babu (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Super Response To O Pittha Katha Teaser Released By Superstar Mahesh Babu (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Super Response To O Pittha Katha Teaser Released By Superstar Mahesh Babu (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%