Social News XYZ     

Naga Shaurya proved himself as an action star with Aswathama: Producer Sharath Marar

'అశ్వథ్థామ'తో టాలీవుడ్ కు నాగశౌర్య రూపంలో మరో యాక్షన్ స్టార్ లభించాడు - నిర్మాత శరత్ మరార్

Naga Shaurya proved himself as an action star with Aswathama: Producer Sharath Marar

Naga Shaurya proved himself as an action star with Aswathama: Producer Sharath Marar (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

నాగశౌర్య, మెహ్రీన్ పిర్జాడ జంటగా ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉష ముల్పూరి నిర్మించిన 'అశ్వథ్థామ' చిత్రం జనవరి 31న విడుదలై థియేటర్లలో దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంది. రమణతేజ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ సమర్పించారు. శుక్రవారం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటరులో చిత్ర బృందం గ్రాండ్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది.

 

లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి మాట్లాడుతూ, "మా 'అశ్వథ్థామ'ను గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. సినిమా చాలా బాగుందనీ, నాగశౌర్య చాలా బాగా చేశాడనీ అంటుంటే సంతోషంగా ఉంది. ఐరా క్రియేషన్‌కు ఇంత మంచి సక్సెస్ రావడానికి కారకులైన అందరికీ థాంక్స్" అన్నారు.

నిర్మాత ఉష ముల్పూరి మాట్లాడుతూ, "శౌర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన సినిమాగా 'అశ్వథ్థామ' నిలిచినందుకు హ్యాపీ. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్లకు నమస్కారాలు. ఐరా క్రియేషన్స్‌లో ఇది బిగ్గెస్ట్ హిట్. శౌర్య నటన, అతను చేసిన ఫైట్లు చాలా బాగున్నాయని చెబుతున్నారు. మునుముందు ఐరా క్రియేషన్స్‌లో మరింత మంచి సినిమాలు అందిస్తాం" అని చెప్పారు.

దర్శకుడు రమణతేజ మాట్లాడుతూ, "ఈ సినిమాకు ఇంత ట్రెమండస్ రిజల్ట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. ఈ సినిమాలో శౌర్య నటించిన విధానానికి హ్యాట్సాఫ్. ఇంత మంచి సినిమాలో నన్ను భాగం చేసినందుకు ఆయనకు రుణపడి ఉంటా. దర్శకుడిగా నా మొదటి సినిమాకే ఇంత మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీ" అన్నారు.

నటుడు ప్రిన్స్ మాట్లాడుతూ, "యాక్టర్ గానే కాకుండా రైటర్ గానూ శౌర్యకు కంగ్రాట్స్. నిర్మాతలు నన్ను సొంత కొడుకులా చూసుకున్నారు. శౌర్యకు ఇంత మంచి సక్సెస్ వచ్చినందుకు హ్యాపీ. 'అశ్వథ్థామ' ఒక విజువల్ ట్రీట్. దీన్ని మిస్ చేయవద్దు. నేను పనిచేసిన బెస్ట్ మూవీస్ లో ఇదొకటి' అని చెప్పారు.

నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్ అధినేత, నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ, "ఈ సినిమా సక్సెస్ కు చాలా సంతోషంగా ఉంది. శౌర్య కథ రాసిన విధానం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది సెన్సిటివ్ సబ్జెక్ట్, అమేజింగ్ స్క్రీన్ ప్లే. డైరెక్టర్ రమణతేజ సినిమాని బాగా తీశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నత స్థాయిలో ఉన్నాయి. 'అశ్వథ్థామ' మూవీతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నాగశౌర్య రూపంలో మరో యాక్షన్ స్టార్ లభించాడు" అన్నారు.

రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి మాట్లాడుతూ, "తాను రొమాంటిక్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాననీ, ఈ సినిమాతో యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు శౌర్య చెప్పినప్పుడు ఆశ్చర్యపోయా. ఇందులో శౌర్య ఎవర్ని కొడుతున్నా, వాళ్లని అలాగే కొట్టాలనిపించింది. తను కథను బాగా రాసుకున్నాడు. కొడుకుతో హిట్ కొడితే వచ్చే ఆనందం ఎలా ఉంటుందో నిర్మాతల ముఖాల్లో తెలుస్తోంది" అని చెప్పారు.

డైరెక్టర్ నందినీరెడ్డి మాట్లాడుతూ, "ఈ సినిమా జర్నీ, ఐరా క్రియేషన్స్ జర్నీ దగ్గర్నుండి చూస్తూ వస్తున్నా. ఏ సినిమా చేసినా, ఏ టెక్నీషియన్లు, యాక్టర్లు పనిచేసినా ఒక ఫ్యామిలీలా చేస్తారు. అది ఐరా క్రియేషన్స్ బలం. సంపాదించిన డబ్బుతో సినిమా తియ్యడం పెద్ద రెస్పాన్సిబిలిటీ. 'అశ్వథ్థామ' సక్సెస్ అవడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ఎవరేమనుకున్నా శౌర్య ఇంకా కథలు రాయాలి. నేను డైరెక్ట్ చేసిన నాలుగు సినిమాల్లో రెండు శౌర్యతో పనిచేయడం సంతోషంగా ఉంది" అన్నారు.

హీరో నాగశౌర్య మాట్లాడుతూ, "సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని మౌత్ టాక్ వ్యాప్తి చెయ్యడం వల్లే సినిమా ఇంత పెద్ద హిట్టయింది. ఇలాంటి సినిమా నాతో తీసినందుకు అమ్మకు చాలా థాంక్స్. మరోసారి 'నర్తనశాల' లాంటి సినిమా చెయ్యాను. డైరెక్టర్ రమణతేజకు ఫుడ్, సినిమా.. ఈ రెండే ప్రాణం. అతడిని నమ్మినందుకు చాలా బాగా ఈ సినిమా తీశాడు. సినిమాటోగ్రాఫర్ మనోజ్ వేరే లెవల్లో కెమెరా పనితనం చూపించాడు. ఈ సినిమా పూర్తయ్యాక 7 రోజుల్లో రీరికార్డింగ్ పూర్తిచేసి ఇచ్చిన జిబ్రాన్ కు థాంక్స్. స్టోరీలోని ఇంటెన్సిటీకి తగ్గట్లు అన్బరివు బ్రదర్స్ యాక్షన్ ఎపిసోడ్స్ చేశారు. ఈ సినిమాలో విలన్ గా చేసిన బెంగాలీ నటుడు జిషుసేన్ గుప్తా టాలీవుడ్ లో సెటిలవుతారని ఆశిస్తున్నా" అని చెప్పారు.

చిత్ర సమర్పకులు శంకర్ ప్రసాద్ పాల్గొన్న ఈ సక్సెస్ మీట్ లో సినిమాటోగ్రాఫర్ మనోజ్ రెడ్డి, ఎడిటర్ గ్యారీ బీహెచ్ కూడా మాట్లాడారు.

 

Facebook Comments