జాను నా కెరీర్‌లోనే స్పెషల్ మూవీ.... మళ్లీ మేజిక్ రీ క్రియేట్ అయ్యింది : సమంత అక్కినేని
శర్వానంద్, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్ టచింగ్ లవ్‌స్టోరీ 'జాను'. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. ఈసందర్భంగా హీరోయిన్ సమంత అక్కినేనితో ఇంటర్వ్యూ...
శర్వానంద్, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్ టచింగ్ లవ్‌స్టోరీ 'జాను'. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. ఈసందర్భంగా హీరోయిన్ సమంత అక్కినేనితో ఇంటర్వ్యూ...
‘జాను’ ప్రయాణం ఎలా అనిపించింది?
‘జాను’ సినిమాలో సినిమా అంతా ప్రధానంగా రెండు క్యారెక్టర్స్ మధ్యనే సాగుతుంది. ఇప్పటి వరకు చాలా పెద్ద సినిమాలు చేశాను. సీన్‌లో ముప్పై, నలభై మంది ఆర్టిస్టులతో పనిచేశాను. కానీ..వాటికి ఈ సినిమా పూర్తి భిన్నమైనది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ పెర్ఫామెన్స్ మెయిన్‌గా ఉంటుంది. రిస్క్ చాలా ఎక్కువ. మొత్తంగా చెప్పాలంటే ‘జాను’ గ్రేట్ టీమ్ ఎఫర్ట్. తొలిరోజునే నాకు ఏదో మేజిక్ జరుగుతుందని అర్థమైంది. ఆ మేజిక్ ప్రతిరోజూ కంటిన్యూ అయ్యింది. ఆ విధంగా చూస్తే జాను ఆల్రెడీ పెద్ద సక్సెస్ అయినట్లే. షూటింగ్ సమయంలో ప్రతిరోజూ బాగా ఎంజాయ్ చేశాను. నేను నా వంద శాతం ఎఫర్ట్ పెట్టాననిపించింది. రేపు సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు కూడా ఆ మేజిక్‌ని ఫీల్ అవుతారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో త్రిషగారిని కలిశారా?
- లేదు... త్రిషగారిని కలవలేదు. సినిమా చూస్తున్నప్పుడు దిల్‌రాజుగారు ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ తీసుకున్నారని తెలియదు. ఓ ఆడియన్‌లా ‘96’ సినిమా చూశాను. విజయ్ సేతుపతి, త్రిష అత్యద్భుతంగా నటించారు. అందరూ విజయ్ సేతుపతిగారి గురించి ఎక్కువగా మాట్లాడారు. కానీ.. నాకైతే ఇది త్రిషగారి సినిమా అనిపించింది. అప్పుడు ట్విట్టర్‌లో ఈ సినిమాను రీమేక్ చేయకూడదని కూడా రాశాను. అందుకనే నేను చాలా రోజుల వరకు రీమేక్ గురించి దిల్‌రాజుగారిని కలవలేదు. ఏవేవో కారణాలు చెబుతూ తప్పించుకున్నాను. అందుకు కారణం, దిల్‌రాజుగారు నన్ను వచ్చి అడిగితే నేను నో చెప్పలేనని నాకు తెలుసు. ఆయన నన్ను రెండోసారి కలిసి సినిమా చేయమని అన్నప్పుడు చేస్తానని చెప్పాను. నిజంగా నేను ఓకే చెప్పకుంటే నా కెరీర్‌లో ఓ మంచి సినిమాను మిస్ చేసుకుని ఉండే దాన్నేమో. చాలా పశ్చాతాప పడేదాన్నేమో. పెర్ఫామెన్స్ పరంగానే కాదు..ఎలా చూసిన నా కెరీర్‌లో స్పెషల్ మూవీ.
త్రిష, సమంతలలో ఎవరు బాగా చేశారని భావిస్తున్నారు? ఎందుకు భయపడ్డారు?
- ఎవరు బాగా చేశారనేది ఇక్కడ ముఖ్యం కాదు. నేను త్రిషను కాపీ కొట్టాలనే ప్రయత్నించలేదు. నేను 96 సినిమాను ఒకసారి మాత్రమే చూశాను. తర్వాత చూడాలనుకోలేదు. ఆమె అద్భుతంగా నటించింది. ఆమె పెర్ఫామెన్స్‌ను కాపీ కొట్టాలని చూస్తే.. వర్కువుట్ కాదు. ‘జాను’ సినిమా కాన్సెప్ట్‌ను అర్థం చేసుకుని నా తరహాలో నటించాను. డైరెక్టర్ ప్రేమ్ నా పెర్ఫామెన్స్ త్రిషతో పోల్చితే డిఫరెంట్‌గా ఉందని అన్నారు. రేపు సినిమా చూసిన వారు కూడా నేను డిఫరెంట్ వేలో చేశానని ఒప్పుకుంటారు. ఇంతకు రీమేక్ చేసిన ఓ బేబీ కొరియన్ సినిమా. కానీ ‘96’ తమిళ సినిమా. చాలా మంది చూశారు. క్లాసిక్ లవ్ స్టోరీ. అలాంటి లవ్ స్టోరీని రీమేక్ చేయడం చాలా కష్టం. కానీ ‘జాను’ విషయానికి వస్తే, తమిళ సినిమాను డైరెక్ట్ చేసిన డైరెక్టరే పనిచేశాడు. అదే డైరెక్టర్ అనడంతో నాకు నమ్మకం కలిగింది. యూత్‌కే కాదు.. అందరూ బాగా కనెక్ట్ అవుతారు. స్క్రిప్ట్ చాలా సార్లు చదివాను. జాను బ్యాక్ స్టోరీ ఏంటో కూడా డైరెక్టర్‌ని అడిగి తెలుసుకున్నాను. దాన్ని తెరపై తేవడానికి చాలా కష్టపడ్డాను. ఎంత వరకు వర్కవుట్ అయ్యుందో తెరపై చూడాల్సిందే. ప్రతి సీన్ చేసే ముందు డైరెక్టర్‌తో డిస్కస్ చేసేదాన్ని.
శర్వానంద్ గురించి..?
- సినిమాలో మా పెర్ఫామెన్స్‌లే ప్రధానం. ఒకరి పెర్ఫామెన్స్ పై మరొకరి పెర్ఫామెన్స్ ఆధారపడి ఉంటుంది. బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వడానికి ఒకరినొకరు ప్రొత్సహించుకున్నాం. రామ్ పాత్రలో శర్వా తప్ప మరొకరిని ఊహించుకోలేను. మరొకరు ఉండుంటే ఈ మేజిక్ రీ క్రియేట్ అయ్యేది కాదేమో.
వరుసగా పెర్ఫామ్నెన్స్ ఓరియెంటెడ్ పాత్రలే చేస్తున్నారు? మీ పైన మీరే భారం పెంచుకుంటున్నట్టు అనిపిస్తోందా?
- సవాళ్ళను ఎదుర్కొని పాత్రలు చేసినప్పుడే అవి ఆడియన్స్ హృదయాల్లో నిలిచిపోతాయి. అలాగే నేను ఈ రంగం లోకి వచ్చి దాదాపు పది సంవత్సరాలు అవుతుంది. ఇంకా రెండు మూడు సంవత్సరాలు మాత్రమే నటిస్తానేమో...కానీ దాని తర్వాత కూడా నా గురించి మాట్లాడాలి కదా. దాని కోసమే అలాంటి పాత్రలే చేస్తూ వస్తున్నాను. నా కెరీర్ స్టార్టింగ్ నుండి చూసుకుంటే ఇప్పటివరకు నేను ఏ పాత్ర కూడా డబ్బు కోసం చేయలేదు. కేవలం పేరు కోసమే పని చేశాను. ఏ స్క్రిప్ట్ ఎంచుకున్న నా పాత్ర ఆడియన్స్ కి ఎలా కనెక్ట్ అవుతుంది అనేది మాత్రమే పరిగణలోకి తీసుకున్నాను. ఆతర్వాత డబ్బు ఆటోమాటిక్ గా వచ్చేసింది(నవ్వుతూ).
ఇటీవల ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ సమంత నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పింది. మీరు యంగ్ హీరోయిన్ గా ఉన్నప్పుడే ఈ జనరేషన్ హీరోయిన్స్ కి కూడా స్ఫూర్తి గా ఉండడం ఎలా అనిపిస్తోంది?
- చాలా సంతోషంగా ఉంది. మాములుగా హీరోయిన్ స్పాన్ చాలా తక్కువ అయినప్పటికీ కొంత మంది హీరోయిన్స్ ఎప్పటికి గుర్తుంటారు. అలాంటి వారిలో నేను ఒకరు అయినందుకు హ్యాపీ. కేవలం నటన అన్నదే కాదు ఇప్పటివరకు నేను చేసిన అన్ని సినిమాలలో నా ప్రవర్తన ద్వారా ఎవరైనా ఇబ్బంది పడ్డారా లేదా అన్నది కూడా నాకు ఇంపార్టెంట్. రివ్యూస్ ఏ కాదు నాతో పాటు ఉన్న టీమ్ మెంబర్స్ కూడా పాజిటివ్ గా ఉండాలి.
మంచి పెర్ఫార్మర్ అని పేరు వచ్చాక మంచి పాత్రలు వాటంతట అవే వస్తాయి అనుకోవచ్చా?
- తప్పకుండా.. ఎలాగంటే 'రంగస్థలం' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మీకు తెలుసు. కానీ నేను ఆ సినిమా ఒప్పుకున్నప్పుడు ఆ కథేంటి అన్నది నాకు పూర్తిగా తెలీదు. కేవలం నా పాత్ర గురించి మాత్రమే తెలుసుకున్నాను. అలాగే కమర్షియల్ సినిమాలకి విభిన్నంగా 'ఈగ' లాంటి సినిమాలు చేశాను. అది అప్పుడు నేను పెట్టిన ఇన్వెస్టిమెంట్ దాని ఫలితమే ఇలాంటి రోల్స్ అంటే సమంత చేస్తుంది అని నాకొస్తున్న మంచి పాత్రలు. అందుకే ప్రతి పాత్రకి నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడుతున్నాను.
ఇంతకు ముందు మీరు మాట్లాడుతూ ఇంకా రెండు మూడు సంవత్సరాలు అన్నారు..రిటైర్మెంట్ తీసుకోవాలి అనుకుంటున్నారా?
- రిటైర్మెంట్ అని కాదు కానీ చాలా పాత్రలు చేశాను. ఇప్పుడు పెళ్లి కూడా చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఒక ఫ్యామిలీ కావాలి.
ఈ విషయంలో చైతన్య సపోర్ట్ ఎంత వరకు ఉంటుంది?
- చైతన్య నాకు పది సంవత్సరాలుగా తెలుసు. మేము ఇద్దరం ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటూ అన్ని విషయాలలో సపోర్టింగ్ గా ఉంటాం.
ఈ సినిమా రీమేక్ చేస్తున్నారన్నప్పుడు చైతన్య ఏమన్నారు?
- మేము ఇద్దరం కలిసే ఈ సినిమా చూశాం. అప్పుడే ఈ సినిమాను రీమేక్ చేయకూడదు అనుకున్నాం. కానీ ఇప్పుడు టీజర్. ట్రైలర్ చూసి మా అభిప్రాయం కొంత మారింది. కానీ సినిమా విడుదలైన తర్వాత పూర్తిగా నమ్ముతారు. ఆ మ్యాజిక్ మళ్ళీ రీ క్రియేట్ అయింది.
మీ పెర్ఫామెన్స్ పరంగా అప్రిషియేషన్స్ రాకపోతే ఫీల్ అవుతుంటారా?
- 100 శాతం ఫీలవుతాను. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో వంశీ పైడిపల్లిగారు చెప్పినట్లు ప్రతి సినిమాను నా తొలి సినిమాగా భావిస్తాను. ఆసినిమా పోతే.. నా కెరీర్ అయిపోతుందని భావిస్తుంటాను. ఉదాహరణకు ఓబేబీ రిలీజ్ అప్పుడు కూడా చాలా టెన్షన్ పడ్డాను. సినిమా టాక్ వచ్చిన తర్వాత నేను డిస్ కనెక్ట్ అయిపోతాను.
హీరోయిన్‌గా యాక్షన్ ఓరియెంటెడ్ రోల్ చేసే అవకాశమేమైనా ఉందా?
- ఇప్పుడు ఫ్యామిలీ మేన్ సీజన్ 2 వెబ్ సిరీస్‌లో నటించాను. దాంట్లో కొత్త సమంతను చూస్తారు. బాగా ట్రైనింగ్ తీసుకున్నాను. చాలా కష్టపడ్డాను. యాక్షన్ సీక్వెన్స్‌లో నటించాను. అది చేసేటప్పుడు హీరోలు ఇంత కష్టపడి ఫైట్స్ చేస్తున్నారా? అనిపించింది. ఒక సీన్‌లో కూడా డూప్‌ను పెట్టుకోలేదు. నేనే స్వయంగా చేశాను. క్రమాగా అనే ఫైట్ మాస్టర్ దగ్గర యాక్షన్ సన్నివేశాలను శిక్షణ తీసుకున్నాను.
వెబ్‌సిరీస్‌లో ఏదైనా సర్‌ప్రైజ్ ఉంటుందా?
- ఉండొచ్చు. ఇప్పటి వరకు చేయని యాక్షన్, నెగటివ్ రోల్‌లో నన్ను చూస్తారు.
బాగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారుగా?
- నేను ప్రమోషన్స్ చేస్తే పది మంది టికెట్స్ కొంటారంటే.. నేను టూర్స్‌కెళ్లైనా ప్రమోషన్స్ చేస్తాను. ఎందుకంటే నా నిర్మాత నాపై నమ్మకంతో సినిమా చేస్తున్నాడు. సినిమా సక్సెస్ మీట్‌కైనా రాకపోవచ్చునేమో కానీ.. సినిమా రిలీజ్ ముందు ప్రమోషన్స్‌లో బ్యాక్‌స్టెప్ తీసుకోను.
మీరు..మీతో చదువుకున్న స్నేహితులతో ఇప్పటికీ మాట్లాడుతుంటారా?
- స్కూల్ డేస్, కాలేజ్ డేస్‌లో నా స్నేహితులతో ఇప్పటికీ మాట్లాడుతుంటాను. నా సినిమాలు చూసి ఫోన్ చేస్తుంటారు.