ఎన్కౌంటర్ పిక్చర్స్ పతాకంపై వెంకట్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం నీవల్లే నేనున్నా. సూర్య శ్రీనివాస్, శ్రీ పల్లవి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతొంది. గతం వదిలేసి వర్తమానంలో బ్రతకండి అంటూ చిన్న సందేశం తో రానున్న ఈ సినిమాలో కామెడీ ప్రధానంగా ఉండబోతోంది.
ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమాలోని పాటలు, టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. మంచి సినిమాను ఎప్పుడూ ఆదరించే ప్రేక్షకులు నీవల్లే నేనున్నా అంటూ వచ్చే ఈ సినిమాను తప్పకుండా ఆదరిస్తారని చిత్ర యూనిట్ భావిస్తోంది. మంచి కాన్సెప్ట్ తో వచ్చే చిన్న సినిమాలు విజయం సాధించిన సందర్భాలు చాలా ఉన్నాయి, అదే కోవలోకి నీవల్లే నేనున్నా చేరబోతోంది. ఎమ్. సాయిబాబా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు సిద్దార్థ్ సదాశివుని స్వరాలు సమకూర్చారు.
This website uses cookies.