Shukra Movie Glimpse Is Appreciated By Kalyaan Dhev

మెగా అల్లుడు అప్రిషియేట్ చేసిన" శుక్ర ' గ్లిమ్స్

రుజల ఎంటర్టైన్మెంట్స్,వైజగ్ ఫిలిం ఫ్యాక్టరీ ,వేదాస్ స్టూడియోస్ ,ఈస్ట్ వెస్ట్ ఎంటెర్టైనెర్స్ ,సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "శుక్ర".ఈ చిత్ర ఫస్ట్ గ్లిమ్స్ ను మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ విడుదల చేసి మెచ్చుకున్నారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సుకు పూర్వజ్ మాట్లాడుతూ సినిమా అంతా 35 రోజుల్లో పూర్తి చేసుకున్నాం.థ్రిల్లర్ ప్రధానాంశంగా సాగుతుంది.కథ తో పాటు కధనం ముఖ్యమైన భూమికను పోషిస్తుంది.నటీనటులు అందరూ బాగా సహకరించడం వల్ల అనుకున్న సమయానికి సినిమాని పూర్తి చేయగలిగాము.అన్నారు.హీరో అరవింద్ కృష్ణ మాట్లాడతా మళ్ళి రి ఎంట్రీ ఇవ్వటం చాల ఆనందంగా ఉంది.దర్శకుడు సుకు పూర్వజ్ నేను నాలుగు సంవత్సరాలుగా కలసి ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలి అని ఆలోచనలో ఉన్నాం.దర్శకుడు,కెమెరామెన్,మ్యూజిక్ వీళ్ళ ముగ్గురు బలం మీరు త్వరలోనే వెండితెర మీద చూడబోతున్నారు.కధనం,కధ,ఆకట్టుకుంటాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు.ప్రి టీజర్ రెస్పాన్స్ మాకు ఆనందాన్ని ఇస్తుంది.త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం.ఆశీర్వదించండి.అన్నారు.

కో ప్రొడ్యూసర్స్ తేజ పల్లె,వరప్రసాద్ బొడ్డు మాట్లాడుతూ త్వరలోనే సినిమా టీజర్,ట్రైలర్స్,పాటలు ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నాము.ఇటీవల విడుదల చేసిన ప్రీ టీజర్ కి ప్రేక్షకులు నుండి మంచి స్పందన లభిస్తోంది.5 లక్షల మందికి పైగా రెండు రోజుల్లోనే చూడటం జరిగింది.సినిమా ని మార్చ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకరావటానికి ప్రయత్నిస్తున్నాం.అన్నారు.నిర్మాత ఏ.పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ షూటింగ్ మొత్తం వైజాగ్,అరకు,హైదరాబాద్ పరిసర ప్రదేశాల్లో చిత్రీకరించాం.దర్శకుడు అనుకున్న బడ్జెట్ లోనే సినిమాని పూర్తి చేసారు.కెమెరా,మ్యూజిక్,కథ,కధనం ప్రధాన బలాలుగా ఈ చిత్రం ఆధ్యంతం సాగుతుంది.పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి.అన్నారు.

అరవింద్ కృష్ణ,శ్రీజితా ఘోష్,విశాల్,సంజయ్,పూజ,ఈషా,జస్ప్రీత్,సుదీక్ష,మిలన్ రాటి,మితిలేష్ తివారి,రజన్ తివారి,తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్:ఆశీర్వాద్,కెమెరామెన్:జగదీష్ బొమ్మిశెట్టి,పి.ఆర్.ఓ:బి.వీరబాబు,కాస్ట్యూమ్స్:రియా పూర్వజ్,నిర్మాతలు: ఏ.పద్మనాభ రెడ్డి,కో ప్రొడ్యూసర్స్: తేజ పల్లె,వరప్రసాద్ బొడ్డు,దర్శకుడు సుకు పూర్వజ్.

Shukra Movie Glimpse Is Appreciated By Kalyaan Dhev (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%