తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుక ఇచ్చిన జీ 5
జనవరి 13,2020 హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వివిధ భాషలలో అధిక వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్న జీ5 . సంక్రాంతి పండుగ సందర్భంగా త్వరలో తెలుగు ప్రజల ముందుకు తీసుకురానున్న నాలుగు వెబ్ సిరీస్ వివరాలను మీడియా మిత్రులతో పంచుకున్నారు.
జీ5 గతంలో విడుదల చేసిన గాడ్,హై ప్రిస్టిస్, కైలాసపురం,Mrs.సుబ్బలక్ష్మి,నర్డ్,హవాలా, బీటెక్,ఎక్కడికి ఈ పరుగు, వాట్సాప్ పనిమనిషి , చిత్ర విచిత్రం ,నాన్న కూచి వంటి వినూత్నమైన వెబ్ సిరీస్ లను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు జీ5 ప్రోగ్రామింగ్ హెడ్ అపర్ణ అచరేకర్ కృతజ్ఞతలు తెలిపారు. తమ వద్దకు ఎవరైనా మంచి కథతో వస్తే తమను తప్పక ఎంకరేజ్ చేస్తామని అన్నారు.2020 ప్రథమ భాగంలో రానున్న తమ వెబ్ సిరీస్ ల గురించి తెలిపారు.
చదరంగం : ఒక పొలిటికల్ డ్రామా. తన ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల లోకి వచ్చిన ఒక నటుడు.తన లక్ష్యం కోసం ఏం చేశాడు అన్నది ఈ చదరంగం కథ. ఈ సిరీస్ కు రాజ్ అనంత దర్శకత్వం వహించారు.ఇందులో శ్రీకాంత్, సునైన,నాగినీడు ముఖ్య పాత్రలలో నటించారు.మంచు విష్ణు 24 ఫ్రేమ్స్ బ్యానర్ పై దీన్ని నిర్మించారు.చదరంగం ఫిబ్రవరి 20వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానున్నది.
లూసర్ : ఒక స్పోర్ట్స్ డ్రామా.ఇందులో క్రికెటర్,బ్యాడ్మింటన్ ప్లేయర్,రైఫిల్ షూటర్ అవ్వాలి అనుకునే ముగ్గురు వ్యక్తులు ఆటలలో ఉండే రాజకీయాల వల్ల ఎలా ఇబ్బందులు పడ్డారో ఎన్ని కష్టాలను ఎదురుకున్నారో అన్నది ఈ లూసర్ కథ.ఇందులో ప్రియదర్శి, కల్పిక, షియాజి షిండే, శశాంక్ ముఖ్య పాత్రలలో నటించారు. లూసర్ కు అభిలాష్ రెడీ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ వారు దీన్ని నిర్మించారు.లూసర్ మార్చి లో ప్రేక్షకుల ముందుకి రానున్నది.
ఎక్స్పైరీ డేట్ : ఇది తెలుగు,హిందీ బైలింగ్వల్ క్రైమ్ థ్రిల్లర్.తనను మోసం చేసినందుకు భర్త భార్యను ఏం చేశాడో అన్నది ఎక్స్పైరీ డేట్ కథ. స్నేహ ఉల్లాల్, మధు శాలిని, టోనీ లుక్, అలీ రెజ్జ ముఖ్య పాత్రలలో నటించారు.ఎక్స్పైరీ డేట్ కు శంకర్ మార్తాండ దర్శకత్వం వహించారు. శరత్ మరార్ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు.ఎక్స్పైరీ డేట్ జూన్ లో ప్రేక్షకుల ముందుకి రానున్నది.
అమృతం ద్వితీయం : నవ్వుల ఆణిముత్యం మైన అమృతం మరోసారి సీక్వెల్ తో మన ముందుకు వస్తున్నది. గత అమృతం లో భాగమైన హర్షవర్ధన్, శివ నారాయణ ,వాసు ఇంటూరి లతో ఎల్బీ శ్రీరామ్, సత్య కృష్ణ మనల్ని నవ్వించడానికి చేతులు కలిపారు. ఈ ద్వితీయ భాగం కి గంగరాజు కలం పట్టగా, సందీప్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. గంగరాజు , సందీప్ సంయుక్తంగా లైట్ బాక్స్ మీడియా బ్యానర్ లో ఈ ఉగాదికి అంటే 25 మార్చి న నవ్వించడానికి జీ5 ఉన్న వారి ఇంటికి వస్తున్నారు.