'సరిలేరు నీకెవ్వరు' సక్సెస్‌పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను.. బొమ్మ దద్దరిల్లిపోద్ది.- సూపర్‌స్టార్ మహేష్
'భరత్ అనే నేను', 'మహర్షి'లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్ 'సరిలేరు నీకెవ్వరు'. ఈ చిత్రం జనవరి 11న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భాంగా సూపర్‌స్టార్ మహేశ్ ఇంటర్వ్యూ.
'సరిలేరు నీకెవ్వరు' ఎలాంటి ఎక్స్‌పీరియన్స్‌నిచ్చింది?
- అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్‌నిచ్చింది. 'ఎఫ్2' జరిగేటప్పుడు అనిల్ రావిపూడి నాకు 40 మినిట్స్ కథ చెప్పారు. చాలా బాగుంది. ప్రస్తుతం ఒక సినిమా కమిట్‌మెంట్ ఉంది. దాని తర్వాత చేస్తాను అని చెప్పాను. కానీ 'ఎఫ్2' చూడగానే ఇమ్మీడియెట్‌గా ఈ సినిమా చేద్దాం అనిపించింది. ఎందుకంటే ఈ స్టోరిలైన్ నాకు ఎగ్జయిటింగ్‌గా అన్పించింది. 'శ్రీమంతుడు' నుంచి సెపరేట్ జోనర్‌లో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నాను. 'దూకుడు'లాంటి ఒక కమర్షియల్ ఫిల్మ్ నా నుండి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలాగే నేనూ అనుకుంటున్నాను. 'ఎఫ్2' చూడగానే ఈ కథకి రిలేట్ అయి 'మహర్షి' సినిమా తర్వాత ఈ కథ చేస్తే బాగుంటుంది అనుకున్నాను. అలా జూలైలో సినిమా స్టార్ట్ చేశాం. డిసెంబర్‌లో షూటింగ్ పూర్తయింది. నా కెరీర్‌లో తీసుకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ డెసిషన్ ఈ టైమ్‌లో ఈ సినిమా చేయడం.
సినిమా మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నారా?
- బొమ్మ దద్దరిల్లిపోద్ది. చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నాను. సినిమా మొదలైన తొలి రోజు నుంచి ఇప్పటిదాకా అదే వైబ్‌ని ఫీల్ అవుతున్నాను. నిర్మాతలు ఫస్ట్ కాపీ చూసినప్పుడు కూడా అదే ఫీలయ్యారు. బ్లాక్ బస్టర్ రాబోతుందని ముందుగా తెలిసినప్పుడే అలా జరుగుతుంది.
ఈ సినిమాని తొందరగా పూర్తి చేశారు కదా! భవిష్యత్తులో కూడా ఇదే కంటిన్యూ చేస్తారా?
- 'బిజినెస్‌మేన్' తర్వాత తొందరగా పూర్తి చేసిన సినిమా ఇది. ఈ కథ అనుకున్నప్పుడే జూన్‌లో స్టార్ట్ చేసి సంక్రాంతికి వద్దామనుకున్నాం. ఎందుకంటే సంక్రాంతికి పర్‌ఫెక్ట్ స్క్రిప్ట్. ఆర్మీ మేజర్ రోల్ చేస్తున్నాం కాబట్టి ఫిట్‌గా కనబడాలని కొంచెం టైమ్ తీసుకొని రెడీ అయ్యాను. అలా జూలైలో షూటింగ్ స్టార్ట్ చేశాం. అప్పటి నుండి 125 రోజుల్లో మా యూనిట్ రెస్ట్ లేకుండా కంటిన్యూగా వర్క్ చేశారు.
టీమ్ ఎఫర్ట్ వల్లే అనుకున్న సమయానికి సినిమా రెడీ అయ్యింది.
ఎంటర్‌టైన్‌మెంట్‌ని, దేశ భక్తిని బ్లెండ్ చేసి సినిమా చేయడం ఎలా అన్పించింది?
- అదే మా దర్శకుడు అనిల్ రావిపూడి బలం. ఆర్మీ ఆఫీసర్ సబ్జెక్ట్ తీసుకొచ్చి దానికి ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్ చేసి దానికి హీరోయిజం జత చేసి సినిమా చేయడం జోక్ కాదు. సేమ్ టైమ్ రెస్పాన్సిబుల్ క్యారెక్టర్‌ని ఇష్టంవచ్చినట్లు తెరపై చూపించలేం. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు రావిపూడి. ఇప్పటివరకూ ఆయన తీసిన సినిమాలతో పోలిస్తే ఇది డిఫరెంట్ మూవీ.
కథ వినేటపుడు ఏయే విషయాలు పరిగణనలోకి తీసుకుంటారు?
- సాధారణంగా నేను కథ వినేటప్పుడే డైరెక్టర్‌ని బాగా నమ్ముతాను. ఏ డైరెక్టర్‌తోనైనా ట్యూన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఒకసారి కథ నచ్చితే డైరెక్టర్ చెప్పినట్లు వింటాను. అనిల్‌కి చాలా క్లారిటీ ఉండటం వల్ల నా క్యారెక్టర్‌ని చేయడం నాకు చాలా ఈజీ అయ్యింది. 'దూకుడు' తర్వాత ఒక కంఫర్టబుల్ జోనర్ నుండి బయటికి వచ్చి ఇలాంటి సినిమా చేయడం నాకు కొత్తగా అన్పించింది. అలాగని దూకుడులాగా చేయలేను. కమర్షియల్ ఫార్మెట్‌లో ఫ్రెష్‌గా పెర్‌ఫార్మెన్స్ చూపించాలి.
కామెడీ పరంగా, డ్యాన్స్ పరంగా ఈ సినిమాకి ఎక్కువ శ్రమపడ్డారా?
- అనిల్ రావిపూడి సినిమా అనగానే ఎంటర్‌టైన్‌మెంట్ పీక్‌లో ఉంటుంది. నేను కొత్త టైమింగ్ పట్టుకోవాలి. అనిల్ కూడా నా 'దూకుడు', 'ఖలేజా' వంటి సినిమాలన్నీ చూసి, నా బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లు వేరే మీటర్‌లో ఉండేలా ఈ క్యారెక్టర్‌ని డిజైన్ చేశారు. అలాగే ఈ సినిమాలో మాస్ సాంగ్‌కి స్కోప్ ఉంది. శేఖర్ మాస్టర్‌కి ఆ క్రెడిట్
ఇవ్వాలి.
ఇప్పటివరకూ మీరు చేసిన సినిమాల్లో ఇదెలా డిఫరెంట్‌గా ఉండబోతోంది?
- నేను చేసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే, ఈ సినిమా మరో డైమెన్షన్‌లో ఉంటుంది. ముఖ్యంగా నా ఫ్యాన్స్ కంప్లీట్‌గా కొత్త మహేశ్‌ని చూస్తారు. అలాగే కొత్త టైమింగ్, చాలా సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి.
పర్టిక్యులర్‌గా ఈ స్క్రిప్ట్‌ని సెలెక్ట్ చేసుకోడానికి రీజన్ ఏంటి?
- ఓపెన్‌గా, ఫ్రీగా ఉండే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలనుకున్నాను. కథకి ప్రాముఖ్యతనిచ్చి యాక్ట్ చేసిన 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను', 'మహర్షి' సినిమాలకి భిన్నంగా కమర్షియల్ ఫార్మెట్‌లో ఉండి పెర్‌ఫార్మెన్స్ చేస్తూ 'దూకుడు' తరహాలో ఉండే స్క్రిప్ట్ కోసం చూసే సమయంలో ఈ స్క్రిప్ట్ దొరికింది. సాధారణంగా కథకి ఇంపార్టెన్స్ ఇస్తాను. కథ విన్నప్పుడు నాకు ఎగ్జయిటింగ్‌గా అన్పించాలి. ఈ కథ విషయంలో కూడా నాకు ఎగ్జయిటింగ్ అన్పించింది. అందుకే ఈ సినిమా చేశాను.
కొండారెడ్డి బురుజు సెట్ దగ్గర చేయడం సెంటిమెంట్‌గా అన్పించిందా?
- అనిల్ కథ చెప్పేటప్పుడు కర్నూలు బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది అని చెప్పారు. కర్నూలులో కొండారెడ్డి బురుజు ఫేమస్ ప్లేస్. ఈ సినిమాలో అది ఒక పాత్ర పోషించింది. 'ఒక్కడు' సినిమాలో నేను చేసిన కొండారెడ్డి బురుజు సీన్ ఒక ఐకాన్ అయింది. మళ్ళీ ఈ సినిమాలో భాగంగా కొండారెడ్డి బురుజు సెట్ వేయడం చాలా హ్యాపీగా అన్పించింది. ఆ క్రెడిట్ మొత్తం ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్‌కే దక్కుతుంది. కొండారెడ్డి బురుజు సెట్‌ని యాజిటీజ్‌గా రామోజీ ఫిల్మ్‌సిటీలో దింపేశాడు. ఫస్ట్‌రోజు ఆ సెట్ చూడగానే 'ఒక్కడు' రోజులు గుర్తుకొచ్చాయి.
కథా పరంగా కొత్తగా ఉంటుందా? లేక ట్రీట్‌మెంట్ పరంగా కొత్తగా ఉంటుందా?
- కమర్షియల్ సినిమాల్లో ఫ్రెష్‌గా ఉంటుంది. ప్రేక్షకులు చాలా థ్రిల్‌గా, ఎగ్జయిట్‌గా ఫీలవుతారు.
ఆర్మీ మేజర్ పాత్ర కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు?
- ప్రత్యేకమైన ఎక్సర్‌సైజ్‌లు ఏమీ చేయలేదు కానీ డైట్ విషయంలో కేర్ తీసుకొని 6 కిలోల బరువు తగ్గాను. ఆర్మీ మేజర్ అనగానే చూసే ప్రేక్షకులకి కన్విన్సింగ్‌గా ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరింత ఫిట్‌గా తయారయ్యాను.
చాలాకాలం తర్వాత విజయశాంతితో మళ్లీ వర్క్ చేయడం ఎలా అన్పించింది?
- అమేజింగ్ ఫీలింగ్. ఆమెతో 'కొడుకు దిద్దిన కాపురం' సినిమా చేశాను. ఆ తర్వాత అప్పుడప్పుడు ఫ్లైట్‌లో కలిశాం తప్ప టచ్‌లో లేను. మా ఇద్దరి కాంబినేషన్‌లో ఫస్ట్‌డే షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలాకాలం తర్వాత మళ్లీ చేస్తున్నాను అనే ఫీల్ ఉంది. కానీ ఒక షాట్ చేయగానే 'కొడుకు దిద్దిన కాపురం' షూటింగ్ నిన్ననే జరిగినట్లు అన్పించింది. ఆవిడ తప్ప ఈ క్యారెక్టర్‌ని అంత బాగా ఎవరూ చేయలేరు. ఆమె ఈ క్యారెక్టర్ చేయడం ఈ సినిమాకి, మా టీమ్‌కి పెద్ద అడ్వాంటేజ్ అయ్యింది. ఆమెకి ఈ సందర్భంగా థాంక్స్ తెలియజేస్తున్నా.
ఈ సినిమాలో కృష్ణగారు కనిపిస్తారు అని దర్శకుడు అనిల్ చెప్పారు?
- అది సినిమాలో ఒక సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్. మా అందరికి చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది.
సినిమాలో మీకు బాగా నచ్చిన పాట?
- ఫస్ట్ వచ్చే థీమ్ సాంగ్. ఆ పాటని దేవీ అద్భుతంగా రాశారు. తర్వాత 'సూర్యుడివో చంద్రుడివో' సాంగ్.
ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉంది కదా? అది ఎవరి ఛాయిస్?
- అనిల్ రావిపూడిగారిదే. స్టోరి నేరేషన్ చేసేటప్పుడే ఈ క్యారెక్టర్‌కి వీళ్ళు కావాలి అని చెప్పారు. వాళ్లు నటిస్తానంటే నాకూ ఓకే అన్నాను. ఈ సినిమాకి అలా మంచి క్యాస్టింగ్ కుదిరింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవిగారు మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం ఎలా అన్పించింది?
- చిరంజీవిగారు నన్నెప్పటి నుండో సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. 'ఒక్కడు' సినిమా ఆయనకు విపరీతంగా నచ్చి నాతో ఫోన్‌లో మాట్లాడారు. ఆ తర్వాత 'అర్జున్' సినిమా కోసం మధురమీనాక్షి టెంపుల్ సెట్ వేశాం. ఆయన స్వయంగా ఆ సెట్‌కి వచ్చి చాలాసేపు గడిపారు. మీలాంటి వాళ్లు ఇలాంటి సినిమాలు చేస్తే ఇండస్ట్రీ చాలా బాగుంటుంది అన్నారు. ఆయన నాకెప్పటికీ ఇన్‌స్పిరేషనే. అలాగే 'పోకిరి' సినిమా చూసి జగన్‌గారి ఆఫీస్ నుండి నాకు కాల్ చేసి రమ్మని, దాదాపు మూడు గంటల సేపు ఆ సినిమా గురించి మాట్లాడారు. అప్పటి నుండి ఏ సినిమా రిలీజై హిట్టయినా ఆయన్నుండే ఫస్ట్ ఫోన్ కాల్ వస్తుంది. అందుకే ఫంక్షన్‌లో జనవరి 11న ఫస్ట్ ఫోన్ కాల్ ఆయన నుండే రావాలని కోరుకుంటున్నానని చెప్పాను. చిరంజీవిగారిని ఆహ్వానించడం అనేది నా ఐడియానే. ఇలా ఫంక్షన్ అనుకుంటున్నాం. మీరు రావాలి అనగానే, వెంటనే తప్పకుండా వస్తాను అని మెసేజ్ పెట్టారు.
అదే వేదికపై నాన్నగారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని కోరారు కదా?
- నాన్నగారిని కలిసినప్పుడు ఈ టాపిక్ వచ్చింది. నాన్న గారు.. చిరంజీవి చాలా బాగా మాట్లాడారు థాంక్స్ చెప్పానని చెప్పు అన్నారు. నిజంగా నాన్నగారి ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీ.
కృష్ణగారు సినిమా చూశారా?
- లేదండి. ఆయన జనవరి 11న చూస్తారు.
1000 మంది పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించారు కదా?
- రెండు మూడు సంస్థలతో కలిపి ఆపరేషన్స్ చేయించాం. ఆంధ్రా హాస్పిటల్స్, హీల్ ఎ ఛైల్డ్ లాంటి సంస్థలతో కలిసి పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. భవిష్యత్తులో ఇంకా పెద్ద స్థాయిలో కార్యక్రమాలు చేస్తాం.
ఫ్యాన్స్‌కి పాజిటివ్ సంకేతాలు ఇవ్వడంలో మీరెప్పుడూ ముందుంటారు?
- అది చాలా మంచి ట్రెండ్. అలాగే పాజిటివ్ సైన్. దాని వల్ల అందరిలోనూ గుడ్ వైబ్స్ ఏర్పడతాయి. ఆరోజు ఫంక్షన్‌లో కూడా చిరంజీవిగారు, విజయశాంతిగారు మాట్లాడేటప్పుడు మా యూనిట్‌కి చాలా హ్యాపీగా అన్పించింది.
రష్మిక మందన్నాతో వర్క్ ఎక్స్‌పీరియన్స్?
- ఆ క్యారెక్టర్‌కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒక ఫ్రెష్ ఫేస్ మాకు కావాలనుకొని ఆమెను సెలెక్ట్ చేసుకున్నాం. బ్రిలియంట్ ఛాయిస్. ఈ సినిమాలో ఆమె పాత్ర ఒక సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్. షి ఈజ్ వెరీ టాలెంటెడ్.
పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది కదా! బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతోంది?
- దేవి నా పర్సనల్ ఫేవరేట్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ దేవి చేస్తున్నాడంటే నాకు చాలా హ్యాపీగా అన్పిస్తుంది. ఎందుకంటే అంత రెస్పాన్స్‌బుల్‌గా ఉంటారు. అందులోనూ చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్. ఏ సీన్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి అనేది పర్‌ఫెక్ట్‌గా చేస్తారు. ఈ సినిమాకి తన బెస్ట్ ఇచ్చారు.
మీకు నచ్చిన డైరెక్టర్లని రిపీట్ చేస్తారు కదా! అనిల్ రావిపూడితో మళ్లీ చేస్తారా?
- డెఫినెట్‌గా చేస్తాను. ఈ సినిమా చేసిన తర్వాత అనిల్ రావిపూడి అంటే నాకు విపరీతమైన ఇష్టం ఏర్పడింది. దర్శకుల్లో అలాంటి ఎనర్జీ నేను చూడలేదు. ఎంత టెన్షన్ ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా సెట్‌లో నవ్వుతూ ఉంటారు. నేనింతవరకూ అలా ఎవర్నీ చూడలేదు. మా టీమ్ అంతా టెన్షన్‌గా ఉన్నప్పుడు అనిల్ మాత్రం చిన్న డ్యాన్స్ వేస్తూ నవ్విస్తూ ఉంటారు. ఇలాంటి ప్రాజెక్ట్ అయిదు నెలల్లో పూర్తి చేశాడంటే నాకే సర్‌ప్రైజింగ్‌గా ఉంది.
రత్నవేలు ఫొటోగ్రఫీ గురించి చెప్పండి?
- 15 రోజులు కాశ్మీర్‌లో రెక్కీ చేసి షూటింగ్ స్టార్ట్ చేశారు. సినిమా ఇంత ఫాస్ట్‌గా కంప్లీట్ అయ్యిందంటే రత్నవేలుగారు కూడా ఒక కారణం. సినిమా క్వాలిటీ విషయంలో కానీ, విజువల్స్ విషయంలో కానీ ఆయన వర్క్ అమేజింగ్.
నిర్మాత అనిల్ సుంకర గురించి ?
- ఈ సినిమాని అనిల్ గారితో దిల్ రాజు గారి సమర్పణలో జి.ఎం.బి నిర్మించడం హ్యాపీ.
అనిల్ సుంకరగారు ఒక ఫ్యామిలీ మెంబర్‌లాంటివారు. 'దూకుడు' దగ్గర్నుంచి నేను చూస్తున్నాను. నాన్నగారంటే ఆయనకి విపరీతమైన ఇష్టం. అలాగే మా ఫ్యామిలీ అన్నా ప్రత్యేక గౌరవం. ఒక హీరోలా కాకుండా ఫ్యామిలీ మెంబర్‌లా ట్రీట్ చేస్తారు. ఆయన ఫస్ట్‌కాపీ చూసి ఎగ్జయిట్ అయి మెసేజ్ పెట్టారు. చాలా హ్యాపీగా అన్పించింది.
ఫైట్స్ గురించి?
- నా ఫేవరేట్ ఫైట్ మాస్టర్స్. ఇందులో రెండు మూడు యాక్షన్ ఎపిసోడ్స్ ఇరగ్గొట్టేశారు. అన్ని ఫైట్స్ దేనికదే కొత్తగా ఉండేలా డిజైన్ చేశారు. మా కాంబినేషన్‌లో ఇవి బెస్ట్.
మీ నెక్స్‌ట్ సినిమా?
- వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు గారితో సినిమా ఉంటుంది. వంశీ చెప్పిన స్క్రిప్ట్ చాలా ఎగ్జయిటింగ్‌గా అన్పించింది. టోటల్ కమర్షియల్ ఫార్మెట్‌లో ఉంటుంది.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు సూపర్‌స్టార్ మహేశ్.
This website uses cookies.