ఒక రైతుకి,పశువులకు మధ్య ఉన్న సంబంధం గురించి,ఒక తండ్రి కొడుక్కి మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాల గురించి తెలియజేస్తుంది.
పశువులను అవసరానికి వాడుకొని అవసరం తీరాక కొంతమంది కబెలాకి పంపించేస్తున్నరు.అలా పంపించకుడదు అనే అంశం మీద చలా చక్కగా ఫ్యామిలీ డ్రామా గా ఈ షార్ట్ ఫిలిం చిత్రీకరించారు.
సమాజంలో మార్పు రావాలి అంటే అది నీ నుండే మెదలు పెట్టు.ప్రకృతిలో పుట్టిన ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది. మన స్వార్థం కోసం వాటిని చంపకూడదు. బ్రతుకు బ్రతకనివ్వు అనే సిద్ధాంతంతో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలిం ఆలోచింపజేస్తుంది.
జనవరి 4న కబేళా షార్ట్ ఫిలిం ప్రసాద్ ల్యాబ్ లో రిలీజ్ అయ్యింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్.రామచంద్ర (అడిషినల్ డైరెక్టర్, వి & ఏ.హెచ్ డిపార్ట్మెంట్) శ్రీ స్వామి స్వయం భగవాన్ దాస్ (తెలంగాణ స్టేట్ ఎనిమల్ వెల్ఫెర్ బోర్డ్)
ఈ షార్ట్ ఫిలిం లో తండ్రి గా వనుకూరి నారాయణ స్వామి గారు చాలా బాగా నటించారు.కొడుకు పాత్రలో సిద్ధార్థ్ రెడ్డి, కోడలు క్యారెక్టర్ లో పార్వతి నటించారు. రామ మోహనరావు గారు తన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించాడు. యూట్యూబ్ లో ఉన్న ఈ షార్ట్ ఫిలిం కు మంచి స్పందన లభిస్తోంది.
నిర్మాతలు: గగన్,శిరీష
రైటర్:గౌరీ వందన
కెమెరా.ఐనవెళ్ళి నాని
మ్యూజిక్: శ్యాం కే ప్రసున్
ఎడిటింగ్:సత్య
స్క్రీన్ ప్లే డైరెక్షన్.సుబ్రమణ్యం ఇడగొట్టి.
This website uses cookies.