Hulchul Review: A interesting thriller (Rating: 3.0)

సినిమా: హల్ చల్
నటీనటులు: రుద్రాక్ష్ , ధన్యా బాలకృష్ణ, కృష్ణుడు తదితరులు
దర్శకత్వం: శ్రీపతి కర్రి
నిర్మాత‌లు: గణేష్ కొల్లూరి
సంగీతం: భరత్ మధుసూదనన్
సినిమాటోగ్రఫర్: రాజ్ తోట
స్క్రీన్ ప్లే: శ్రీపతి కర్రి
రేటింగ్: 3/5

రుద్రాక్ష్ , ధన్యా బాలకృష్ణ హీరో హీరోయిన్లుగా ఎమ్.ఎస్.కె డిజిటల్ బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ సమర్పణలో శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై గణేష్ కొల్లూరి నిర్మించిన చిత్రం హల్ చల్. ఈ చిత్రం జనవరి 3న విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

రుద్రాక్ష (రుద్రాక్ష్) దుబాయ్ లో నాలుగు సంవత్సరాలు కష్టపడి సంపాదించి ఇక నుండైనా తన తల్లిని బాగా చూసుకోవాలనే ఆశతో ఇండియాకి వస్తాడు. అయితే దుబాయ్ లో తన ఫ్రెండ్ (కృష్ణుడు) ఒక పర్సు అండ్ ఒక మందు బాటిల్ (హల్ చల్) ఇచ్చి ఇండియాలో నరసింహా (విలన్) అనే రౌడీ బ్యాచ్ కి ఇవ్వమని చెబుతాడు. కానీ అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనల కారణంగా రుద్రాక్ష డ్రగ్ లాంటి ఆ హల్ చల్ మందును తాగేస్తాడు. దాంతో అతను నిజానికి భ్రమకు మధ్య తేడా తెలియకుండా పోతాడు. ఎప్పుడో తానూ కాలేజీలో ప్రేమించిన స్వాతి (ధన్యా బాలకృష్ణ) మళ్ళీ తన జీవితంలోకి వచ్చినట్లు ఉహించుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్న క్రమంలో.. ఫ్రెండ్ తనకు ఇచ్చిన పర్సులో వంద కోట్లు విలువ చేసే నోటు ఉందని తెలుస్తోంది. కానీ అప్పటికే ఆ పర్సు ఎక్కడో మిస్ అవుతుంది. దాంతో విలన్ బ్యాచ్ రుద్రాక్ష వెంట పడతారు. రుద్రాక్ష వాళ్ళ నుండి తప్పించుకోవటానికి ఏం చేశాడు? ఇంతకీ రుద్రాక్ష మీద ఆ హల్ చల్ డ్రగ్ ప్రభావం ఏ రేంజ్ లో పని చేసింది? చివరికి అతను తన సమస్యల నుండి బయట పడ్డాడా? లేదా? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ సినిమాని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

వినూత్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోగా నటించిన రుద్రాక్ష్ చక్కగా నటించాడు. ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీ మరియు తన బాడీ లాంగ్వేజ్ అలాగే కొన్నికన్ ఫ్యూజ్డ్ అండ్ కామెడీ సీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించాడు. ఇక రుద్రాక్ష్ సరసన హీరోయిన్ గా నటించిన ధన్యా బాలకృష్ణ తన క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకుంది. విలన్ నరసింహాగా నటించిన నటుడు కూడా చాల బాగా నటించాడు. నటుడు రవి ప్రకాష్ మంచి పాత్ర లో కనిపిస్తాడు.

అలాగే కమెడియన్ కృష్ణుడు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడు శ్రీపతి కర్రి తీసుకున్న స్టోరీ లైన్ బాగుంది. సెకెండ్ హాఫ్ లో హీరో – కృష్ణుడు మధ్య ఆయన రాసుకున్న కొన్ని కామెడీ సీన్స్ మరియు హీరోయిన్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ట్విస్ట్ కూడా పర్వాలేదనిపిసోంది.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా అంతా ఆద్యంతం ఉత్కంటాం గా ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా బాగా తెరకేకించారు దర్శకుడు శ్రీపతి కర్రి. కామెడీ సీన్స్ చాలా బాగా చిత్రీకరించాడు. సెకండ్ హాఫ్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉన్నాయ్.

మొత్తంగా సినిమాను చాలా ఆసక్తికరంగా సాగుతుంది. కథ కథనం రెండు ఎంతో ఇంటరెస్టింగ్ గా మనసుకి హద్దుకుంటాయి.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు భరత్ మధుసూదనన్ అందించిన సంగీతం చాలా బాగుంది. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ట్రీమ్ చేసి చేయాల్సింది. రాజ్ తోట సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్లుగానే సాగింది. అయితే కొన్ని విజువల్స్ ను ఆయన చాలా సహజంగా అలాగే చాలా అందంగా చూపించారు.

దర్శకుడు సరైన స్క్రిప్ట్ ను రాసుకోవటం తో సినిమా చూడటానికి నిండుగా ఉంటుంది. కొత్త కథ, అద్భుతమైన కథనం, మంచి కామెడీ, మంచి సంగీతం మరియు నటి నటుల సహజ నటనా అని కలిపి దర్శకుడు మంచి హిట్ సినిమా అందించాడు అనే చెప్పాలి. ఇక నిర్మాత గణేష్ కొల్లూరి పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి . కథకు అవసరమైనంత ఖర్చు పెట్టారు.

తీర్పు :

‘హల్ చల్’ అంటూ వినూత్నమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం.. అద్భుతమైన ట్రీట్మెంట్ తో ఆసక్తికరమైన కథాకథనాలతో ఆకట్టుకుంటుంది . కామెడీ సీన్స్, దర్శకుడు తీసుకున్న కథాంశం అంశాలు బాగున్నాయి. సినిమాలో ఇంట్రస్ట్ తో పాటు క్లారిటీ కూడా స్వష్టంగా ఉంటుంది. కుటుంబం అందరు చూడదగ్గ సినిమా హల్ చల్.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%