Social News XYZ     

Tolu Bommala Chitralu Banner Production No 1 Movie Shoot Completed

షూటింగ్ పూర్తిచేసుకున్న ప్రొడక్షన్ నెంబర్1 చిత్రం

‘తోలుబొమ్మల సిత్రాలు’ బ్యానర్ పై కొమారి జానకీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రొడక్షన్ నెంబర్1 చిత్రం స్పెషల్ సాంగ్ చిత్రీకరణతో షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా ఆనంద్ కృష్ణ,స్వాతిమండల్, అశోక్,యాంకర్ ఇందు,వెంకటేష్,పూజ సుహాసిని నందు,ఎంజిల్ వాణి, హాస్యనటుడు గా జూనియర్ సంపు నటిస్తున్నారు.కోమరక్క,,వేదం నాగయ్య,గోవింద్,జానపదం అశోక్,నల్లి సూదర్శనరావు తదితరులు నటిస్తున్నారు..

ఈ సందర్భంగా దర్శకుడు జానకిరామ్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ:-బాచుపల్లి దగ్గర వేసిన ప్రత్యేకమైన సెట్ లో స్పెషల్ సాంగ్ చిత్రీకరణ తో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుందని చెప్పారు..శ్రష్టి వర్మ డాన్స్ పర్ఫార్మెన్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ ముఖ్యంగా ఈ పాట మద్యానికి బానిసైన వారికి సందేశాన్ని ఇస్తూనే అన్ని వర్గాలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుందని,ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుందని అన్నారు.

 

కథ విషయానికి వస్తే కామెడీ, హర్రర్,థ్రిల్లర్ బేస్ గా తయారవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను మంచి థ్రిల్లింగ్ తోపాటు మంచి మెసేజ్ ను కూడా ఇస్తుందని అన్నారు..

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్- డి.యాదగిరి,ఎడిటింగ్- సునీల్ మహారాణా,సంగీతం-యు.వి.నిరంజన్,నిర్మాత కొమారి జానయ్య నాయుడు,కథ, మాటలు, స్క్రీన్ ప్లే,దర్శకత్వం-కొమారి జానకిరామ్.

Facebook Comments