Social News XYZ     

Superstar Fans Celebrate New Year At Sudharshan 35MM RTC X Roads

ఆర్ టి సి క్రాస్ రోడ్స్ సుదర్శన్ 35ఎంఎం థియేటర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన " సరిలేరు నీకెవ్వరు " చిత్రం జనవరి 11న విడుదల అవుతున్న సందర్భంగా 2020 జనవరి 1న సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన జాతీయ అధ్యక్షులు దిడ్డి రాంబాబు ఆధ్వర్యంలో థియేటర్ యజమాని బాలు గారు కేక్ కట్ చేసి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు .

ఈ సందర్భంగా దిడ్డి రాంబాబు మాట్లాడుతూ సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని మహేష్ బాబు 81 అడుగుల కటౌట్ ను విడుదలకు 50 రోజుల ముందే థియేటర్ లో నిలబెట్టడం ఇండస్ట్రీ రికార్డ్ గా నిలిచిందని , మురారి , ఒక్కడు , అతడు , పోకిరి నాలు చిత్రాలు సుదర్శన్ లో సిల్వర్ జూబిలీ జరుపుకోవడం చాల ఆనందంగా ఉందని , మహేష్ కి సుదర్శన్ థియేటర్ కలిసొచ్చిందని అన్నారు. సుదర్శన్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి , దేవి థియేటర్ మేనేజర్ కుమార్ లతో పటు అభిమానులు ప్రధాన కార్యదర్శి మల్లేష్ , యస్ రాజా రెడ్డి , వై నాగరాజు , యస్ వెంకటేష్ యాదవ్ , బ్యాంకు రాజు , రమేష్ యాదవ్ , యన్ మధు బాబు , కే సాయి కుమార్ , వెంకీ , శివ మయూరి , రాజు మయూరి , కే కిరణ్ తదితర అభిమానులు పాల్గొన్నారు

Facebook Comments
Superstar Fans Celebrate New Year At Sudharshan 35MM RTC X Roads

About Harsha