Social News XYZ     

Heena Shaikh Is Moving To Bollywood From Dollywood Via Tollywood

డాలీవుడ్ టు బాలీవుడ్
వయా టాలీవుడ్ !!

ది అంగ్రేజ్, హైదరాబాద్ నవాబ్స్ చిత్రాల కోవలో డాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన 'సలాం జిందగీ'లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీనా షేక్.. ఆ గుర్తింపుతో తెలుగులో కొన్ని చిత్రాల్లో అవకాశం సొంతం చేసుకుని ఇప్పుడు బాలీవుడ్ లో పాగా వేసేందుకు సన్నాహాలు చేసుకుంటోంది.

అంటే డాలీవుడ్ (హైదరాబాదీ సినిమా) నుంచి టాలీవుడ్ మీదుగా బాలీవుడ్ లో జెండా ఎగురవేయనుందన్నమాట. తెలుగులో అలీతో 'రంగు పడుద్ది, 127బి చిత్రాల్లో నటించిన హీనా.. ప్రస్తుతం కలర్ ఫోటో అనే సినిమాలోనూ నటిస్తోంది. కాగా ఈ అమ్మడిని బాలీవుడ్ లోనూ అవకాశాలు ఏరి కోరి వరిస్తున్నాయి. ఇప్పటికే హిందీలో రెండు సినిమాలకు సైన్ చేసిన ఈ చిన్నది.. వీటిలో ఒక చిత్రం షూటింగ్ నిమిత్తం ఈవారం అమెరికా వెళుతోంది. కళకు భాషాభేదాలు లేవని తాను నమ్ముతానని, అన్ని భారతీయ భాషా చిత్రాల్లోనూ నటించి మెప్పింఛాలన్నదే తన అభిమతమని ఈ చిన్నది చెబుతోంది!!

 

Facebook Comments