ఘనంగా ప్రతిరోజు పండగే సంబరాలు
ప్రతిరోజూ పండగే చిత్రం విడుదలై ప్రతి చోటా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రతిరోజు పండగే సంబరాలు ఘనంగా జరిపారు. చిత్ర యూనిట్ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ....
అల్లు అరవింద్ గారు, బన్నీ వాసు గారు, ఒక సక్సెస్ ఫుల్ సినిమాను నిర్మించారు. మారుతి కష్టమైన సబ్జెక్ట్ ను కూడా ఈజీగా డీల్ చేశాడు, సాయి తేజ్ కు హిట్ వచ్చింది అంటే నా ఫ్యామిలీకి వచ్చినట్లే, యూవీ వంశీకి అలాగే అందరూ టెక్నీషియన్స్ కు విషెస్ తెలుపుతున్నాను. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన అరవింద్, వాసు గారికి థాంక్స్. సత్యరాజ్ గారు, రావు రమేష్ గారు ఈ సినిమాకు పిల్లర్స్ గా నిలిచారు వారికి ప్రేత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.
అల్లు అరవింద్మాట్లాడుతూ....
ఈ సినిమాను పెద్ద హిట్ చేసిన అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. మారుతి నాకు ఈ కథ చెప్పినప్పుడు నాకు కొంత సందేశం ఉంది, యూత్ ఫుల్ ఎలిమెంట్స్ లేవు కదా అన్నాను, కానీ మారుతి కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు. సినిమా స్టార్త్ చేశాం. సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక సినిమా చూస్తున్నంత సేపు నవ్వుకుంటూ ఉన్నాం. థియేటర్స్ లో ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో సాయి తేజ్ సక్సెస్ కొట్టాడు.ఈ విజయం అందరి విజయం అన్నారు.
సిరివెన్నెల సీతారామ శాస్త్రి మాట్లాడుతూ...
వరుస విజయాలు సంస్థగా పేరు తెచ్చుకుంటున్న యూవీ క్రియేషన్స్ కు, గీతా ఆర్ట్స్ సంస్థలో వచ్చిన మరో మాంచి విజయం ఇది. మారుతి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా విజయం సాధించడంలో అల్లు అరవింద్ గారి ప్రాధాన్యత ఉంది, అందుకు ఆయనకు ఈ క్రెడిట్ ఇవ్వాలి. మారుతి చాలా సంస్కారం ఉన్న దర్శకుడు, తాను నమ్మిన సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటించే దర్శకుడు. ఈ సినిమా కథ విన్నపుడే నేను ఈ సినిమా విజయాన్ని ఉహించాను. విదేశాలకు వెళ్లిన తరువాత మనుషుల మధ్య ప్రేమ అభిమానులు తగ్గాయి, ఈ పాయింట్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ విషయాన్ని అందంగా ఆవిష్కరించారు మారుతి అన్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ...
ఈ సినిమా కథ రాసుకున్నపుడే రాజమండ్రిలో షూట్ చేయాలని అనుకున్నాను. అప్పుడే సక్సెస్ మీట్ ని కూడా ఇక్కడే చేయాలనీ అనుకున్నాను. పేరెంట్స్ ని మిస్ అవుతున్న ప్రతి ఒక్కరికి కాన్సెక్ట్ అయ్యేలా సినిమా చేయాలనే ఆలోచన మొదట సాయి తేజ్ లో పుట్టింది. కథను డెవలప్ చేయగానే అల్లు అరవింద్ గారు కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒక తండ్రి కొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని చూపించాలని అనుకున్నా. ఎవరు మిస్ అవ్వకుండా ఈ సినిమాను చూస్తారని భావించాను. ఇలాంటి సక్సెస్ లతో ఇంకా మరిన్ని మంచి సినిమాలు తీసేలా బలాన్ని చేకూరుస్తాయి. ఈవెంట్ కి వచ్చిన నటీనటులకు అలాగే ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు' అని మారుతి వివరణ ఇచ్చారు.
హీరో సాయి తేజ్ మాట్లాడుతూ...
ప్రతిరోజు పండగే సినిమా నా కెరీర్ లొనే ఇంపార్టెంట్, ఇలాంటి సమయంలో నా దగ్గరికి ఒక మంచి కథను తీసుకొని వచ్చిన మారుతి గారికి థాంక్స్. మా సినిమాకు చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. థియేటర్ లో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సత్యరాజ్ గారు చేసిన రోల్ మర్చిపోలేను. రావు రమేష్ గారితో నేను చేసిన అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. తమన్ నా కాంబినేషన్ లో వచ్చిన మంచి సినిమా ఇది. మా సినిమాను సపోర్ట్ చేసున్న అందరికి ధన్యవాదాలు, ఈ సక్సెస్ ను మెగా అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు అంకితం చేస్తున్న అన్నారు.