Happy To Produce A Great Film Like Sarileru Neekevvaru With Mahesh Babu Producer Anil Sunkara

సూపర్‌స్టార్‌ మహేష్‌ 'సరిలేరు నీకెవ్వరు' వంటి గొప్ప చిత్రాన్ని నిర్మించడం నాకెంతో గర్వంగా ఉంది - నిర్మాత అనిల్‌ సుంకర

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ 'సరిలేరు నీకెవ్వరు'. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతున్న సందర్భంగా...ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..

నిర్మాత అనిల్‌ సుంకర మాట్లాడుతూ - ''140 రోజులు ఎలాంటి అవాంతర పరిస్థితులు ఎదురవకుండా 'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్ స‌జావుగా పూర్తి అయ్యింది. ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్‌కి సిద్ధమైంది. ఈ సినిమాలో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్‌ గర్వపడేలా సినిమా వచ్చింది. ఆడియన్స్‌తో పాటు మేం కూడా ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఎదురు చూస్తున్నాం. మహేష్‌బాబుగారిని ఫ్యాన్స్‌ ఎలా చూద్దాం అనుకుంటున్నారో అలా ఉంటుంది. యూత్‌, అలాగే ఫ్యామిలీ ఆడియన్స్‌ ఎలా చూడాలనుకుంటున్నారో సినిమా అలా ఉంటుంది. మహేష్‌బాబుగారి కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మూవీ అవుతుంది. 13 సంవత్సరాల తర్వాత విజయశాంతిగారు ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. అవార్డు విన్నింగ్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చారు. మహేష్‌, విజయశాంతి మధ్య వచ్చే సన్నివేశాలు ఎవరూ ఊహించనివిధంగా ఉంటాయి. అనీల్‌ రావిపూడి అనగానే ఎంటర్‌టైన్‌మెంట్‌ గుర్తుకొస్తుంది. అనుకున్నదానికంటే ఎక్కువ ఫన్‌ ఉంటుంది. ఫస్ట్‌డే ఏదైతే సంక్రాంతికి రిలీజ్‌ అనుకున్నామో ఆ దిశగా సంక్రాంతి విడుదలకు పూర్తి సన్నద్ధమైనందుకు సంతోషంగా ఉంది. ఓవర్సీస్‌లో బుకింగ్స్‌ ఓపెన్‌ అయ్యాయి. ఇక్కడ కూడా త్వరలో బుకింగ్స్‌ ఓపెన్‌ చేస్తాం. ఈ సంక్రాంతికి పెద్ద పండగలాంటి సినిమా. మా హీరో నుండి ఇంతవరకు ఇలాంటి ఫ్యామిలీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ వచ్చి ఉండదు.
అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు

మహేష్‌, విజయశాంతి కాంబినేషన్‌ అనగానే పాజిటివ్‌ వైబ్స్‌ క్రియేట్‌ అయ్యాయి? ఎలా అన్పిస్తోంది?
- ఆ కాంబినేషనే పెద్ద సెల్లింగ్‌ ఫ్యాక్టర్‌. వాళ్ళిద్దరి మధ్య వచ్చే ప్రతి సీన్‌కి ప్రేక్షకుల నుండి విజిల్స్‌, క్లాప్స్‌ పడుతూనే ఉంటాయి. అవి లేనిచోట కన్నీళ్ళు పెడతారు. సినిమా అంతా కూడా నవ్వుతూ, క్లాప్స్‌ కొడుతూ ఉంటారు. ఒక సందర్భంలో ఎమోషనల్‌ అవుతారు.

టైటిల్‌ జస్టిఫికేషన్‌?
- 'సరిలేరు నీకెవ్వరు' అనేది ట్రిబ్యూట్‌ ఇండియన్‌ సోల్జర్స్‌. అందుకే ఈ సినిమాలో హీరో కూడా సోల్జర్‌. 'సరిలేరు నీకెవ్వరు' అనేది ఏ వ్యక్తి గురించి కాదు. ఇండియన్‌ ఆర్మీ గురించి. సోల్జర్స్‌, తమ కుటుంబ సభ్యుడ్ని దేశానికి కాపలా పెట్టే వారి పేరెంట్స్‌కి 'సరిలేరు మీకెవ్వరు' అని చెప్పే సినిమా. ఈ సినిమాతో సోల్జర్స్‌కి మరింత గౌరవం పెరుగుతుంది. ఆర్మీ మేజర్‌ రాయలసీమకి వస్తాడనేది అందరికీ తెల్సిందే. వచ్చి ఏం చేశాడనేది ఇండియన్‌ ఫిల్మ్‌ హిస్టరీలో ఇంతవరకూ రాని యూనిక్‌ పాయింట్‌.

ఈ సినిమాలో ఆర్మీ ఎపిసోడ్‌ ఎంతసేపు ఉంటుంది?
- ఈ సినిమాలో మహేష్‌ ఆర్మీ మేజర్‌గా చేస్తున్న విషయం తెల్సిందే. ఫస్ట్‌ ఫ్రేమ్‌ నుండి లాస్ట్‌ ఫ్రేమ్‌ వరకు ఆర్మీ మేజర్‌ అనేది అందరికీ గుర్తుండిపోతుంది.

ట్రెయిన్‌ ఎపిసోడ్‌ గురించి?
- సినిమాలో అది బెస్ట్‌ ఎంటర్‌టైనింగ్‌ ఎపిసోడ్‌. ఫస్టాఫ్‌లో దాదాపు 30 నిమిషాలు ఉంటుంది. రేపు థియేటర్‌లో ఆ ఎపిసోడ్‌కి ఆడియన్స్‌ థ్రిల్‌ అవుతారు.

కర్నూలు కొండారెడ్డి బురుజు సెట్‌ వెయ్యడానికి రీజన్‌ ఏంటి?
- కథలో భాగంగానే ఆ సెట్‌ వేశాం. ఆర్మీ నుండి రాయలసీమకు వస్తారు. రాయలసీమలో కర్నూల్‌ కంటే బెటర్‌ బ్యాక్‌డ్రాప్‌ రాదని కొండారెడ్డి బురుజు సెట్‌ వేయడం జరిగింది.

దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌ గురించి?
- దేవి మ్యూజిక్‌ కస్టమ్‌ టైలర్‌మేడ్‌ ఫర్‌ ది హీరో. వినేటప్పుడు కన్నా విజువల్‌గా చూస్తున్నప్పుడు ఇంకా బాగుంటుంది. ఏ సాంగ్‌ చూసినా వేరెవరికీ సెట్‌ అవ్వదు అనేవిధంగా మ్యూజిక్‌ ఉంది. రీరికార్డింగ్‌ కూడా టాప్‌లో ఉంటుంది.

ఎన్ని థియేటర్స్‌లో రిలీజ్‌ చేస్తున్నారు?
- మహేష్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ రిలీజ్‌ ఫరెవర్‌.

మిగతా క్యారెక్టర్స్‌ గురించి?
- రాజేంద్రప్రసాద్‌గారు సినిమా అంతా హీరోతోనే ఉంటారు. అలాగే బండ్ల గణేష్‌ క్యారెక్టర్‌ చాలా బాగుంటుంది.

మీరు సినిమా చూశాక ఒక ఆడియన్‌గా మీకు ఎలా అన్పించింది?
- నేను నిన్ననే సినిమా చూశాను. బయటికి వచ్చాక చాలా గర్వంగా అన్పించింది. ఇంతవరకూ అనీల్‌ రావిపూడిని ఒక యాంగిల్‌లో చూశారు. ఈ సినిమా విడుదలయ్యాక కంప్లీట్‌గా వేరే లీగ్‌లోకి వెళతారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ వదలకుండా మహేష్‌లాంటి హీరో ఉన్నప్పుడు ఏమేం చేయగలడో అన్నీ చేశారు.

ప్రీ రిలీజ్‌కి మెగాస్టార్‌ ముఖ్య అతిథిగా రాబోతున్నారు కదా! ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?
- వాళ్ళిద్దరి రేంజ్‌కి తగ్గట్లుగానే సెక్యూరిటీ ఉంటుంది. మెగాస్టార్‌ మా అతిథిగా రాబోతున్నారు. అలాగే సూపర్‌స్టార్‌ మహేష్‌ ఆ ఈవెంట్‌ని హోస్ట్‌ చేస్తున్నారు. ఇంతకు ముందెప్పుడూ ఇది జరగలేదు. అందుకే జ‌న‌వ‌రి 5న జ‌రిగే ఈవెంట్‌కి మెగా సూపర్‌ ఈవెంట్‌ అని పేరు పెట్టాం. అంటూ ఇంట‌ర్వ్యూ ముగించారు నిర్మాత అనిల్ సుంక‌ర‌.

Happy To Produce A Great Film Like Sarileru Neekevvaru With Mahesh Babu Producer Anil Sunkara (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Happy To Produce A Great Film Like Sarileru Neekevvaru With Mahesh Babu Producer Anil Sunkara (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Happy To Produce A Great Film Like Sarileru Neekevvaru With Mahesh Babu Producer Anil Sunkara (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Happy To Produce A Great Film Like Sarileru Neekevvaru With Mahesh Babu Producer Anil Sunkara (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Happy To Produce A Great Film Like Sarileru Neekevvaru With Mahesh Babu Producer Anil Sunkara (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Happy To Produce A Great Film Like Sarileru Neekevvaru With Mahesh Babu Producer Anil Sunkara (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%