నాణ్యతతోనే విజయ తీరాలకు
యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి
ఉప సభాపతి పద్మా రావు
హోటల్ రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉందని నాణ్యతతోనే విజయ తీరాలకు చేరుకోవచ్చని ఉప సభాపతి పద్మా రావు గౌడ్ తెలిపారు. ఆదివారం ఆయన పటాన్‌చెరు మండలం ముత్తంగిలో వరల్డ్ ఫేమస్ పిస్తా హౌస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని పలితంగా పది మందికి ఉపాది అవకాశాలు కూడా కల్పించవచ్చన్నారు. భోజన ప్రియుల కు ఎప్పటికప్పుడు టెస్ట్ టెస్ట్ ఫుడ్ అందిస్తున్న పిస్తా హౌస్ పటాన్‌చెరు వాసులకు పసందైన బిర్యాని రుచి చూపించేందుకు గాను ఇక్కడ ప్రారంభించామని,
పిస్తా హౌస్ ఫౌండర్ మొహమ్మద్ అబ్దుల్ మజీద్ తెలిపారు. పిస్తా హౌస్ లో టెస్ట్ బిర్యానీ తో పాటు బేకరీ కబాబ్స్ మరియు హైదరాబాది అని రకాల ఫుడ్ ఇక్కడ లభిస్తాయన్నారు. పిస్తా హౌస్ ప్రపంచంలోనే హలీం కి ఫేమస్ అని, ఇక్కడ ఫుల్ ఫ్యామిలీ కి నచ్చేలా ఫుడ్డు ఉంటుందని తెలిపారు. నిర్వహకులు వి. క్రాంతి కుమార్, రఘు మాట్లాడుతూ ఈ రెస్టారెంట్ ని ఒక యూనిక్ కాన్సెప్ట్ తో డిజైన చేశామని, మా రెస్టారెంట్‌కి వచ్చిన కస్టమర్లు అందరికీ ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు, సంగారెడ్డి ఎమ్మెల్యేలు మహిపాల్ రెడ్డి, జయప్రకాష్ రెడ్డి, టి ఎస్ డిడి ఎఫ్ సి ఎల్ చైర్మన్ లోకా భూమా రెడ్డి, ముత్తంగి సర్పంచ్ ఉపేందర్, పటాన్‌చెరు కార్పొరేటర్ శంకర్ యాదవ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు
This website uses cookies.