Ammayante Alusa Is Dedicated To Disha: Hero, Producer & Director Nene Sekhar

“అమ్మాయంటే అలుసా” చిత్రాన్ని దిశ కు అంకిత మిస్తున్నాను....హీరో, నిర్మాత,దర్శకుడు నేనే శేఖర్ ..

నవులూరి భాస్కర్ రెడ్డి సమర్పణలో గీతాశ్రీ అర్ట్స్ పతాకంపై నేనే శేఖర్, కార్తీక్ రెడ్డి,స్వాతి,శ్వేత, ఆర్తి హీరో,హీరోయిన్ లుగా నేనే శేఖర్ దర్సకత్వంలో యలమంచిలి బ్రహ్మ శేఖర్,నవులూరి మాధవరెడ్డి, సరిపూడి హరికృష్ణ లు సంయుక్తంగా నిర్మిస్తున్న "అమ్మాయంటే అలుసా" చిత్రానికి వినీష్ సంగీతం అందిస్తున్నాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా వచ్చిన ప్రతాని రామకృష్ణ గౌడ్,తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, సుచిరిండియా జియం యండి కాసిమ్,సురేష్ కొండేటి,జివి చౌదరి,డాక్టర్ యండి కాసిమ్ మొదలగు సినీ ప్రముఖులు చేతుల మీదుగా పాటలను,టీజర్,ట్రైలర్ ను విడుదల చేసారు..*

అనంతరం ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ:-శేఖర్ చాలా మంది హీరోలు,డైరెక్టర్లు దగ్గర ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశాడు.ప్రస్తుతం సమాజానికి ఎలాంటి కథ అయితే బాగుంటుందో తెలుసినవాడు శేఖర్.మంచి కథలున్న సినిమాకీ ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు.ఇలాంటి చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తే శేఖర్ లాంటి వారు మరిన్ని చిత్రాలు తీస్తారని అన్నారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ:-శేఖర్ కు ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా సినిమా మధ్యలో ఆగిపోతే తను ఇల్లు అమ్మి సినిమా కంప్లీట్ చేసాడు అని తెలిసి చాలా బాధపడ్డాను,శేఖర్ పడిన కష్టానికైనా ఈ మూవీ పెద్ద విజయం సాధించి తను అమ్ముకున్న ఇంటిని తిరిగి దక్కించుకోవాలని అన్నారు.

సంగీత దర్శకుడు వినీష్ మాట్లాడుతూ:-ఇందులో పాటలు చాలా బాగా వచ్చాయి.ఇందులో నము అవజాశమిచ్చిన శేఖర్ కు ధన్యవాదాలు.

సెకండ్ హీరో కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ:-ఈ సినిమా కోసం చాలా లొకేషన్స్ తిరిగి సెలెక్ట్ చేసి సినిమా చేసాము,ఈ సినిమా టైటిల్ సెలెక్ట్ చేయడానికే నెల రోజులు పట్టింది. ఇంత కష్టపడి అమ్మాయిలపై మెసేజ్ ఉన్నా మూవీ చేసిన శేఖర్ అన్నకు మంచి పేరు తీసుకు రావాలని అన్నారు.

సహ నిర్మాత హరికృష్ణ మాట్లాడుతూ:-సమాజం లో ఆడపిల్లలకు ఎం జరుగుతుందనేది ఈ మూవీ చూస్తే తెలుస్తుంది, శేఖర్ చాలా కష్టపడి ఈ సినిమా తీసాడు.ఈ సినిమా మా అందరికి మంచి పేరు తీసుకు రావాలని అన్నారు..

హీరో, నిర్మాత,దర్శకుడు నేనే శేఖర్ మాట్లాడుతూ:-నేను అందరి పెద్ద హీరోల దగ్గర,డైరెక్టర్ల దగ్గర ప్రొడక్షన్ మేనేజరు గా పనిచేస్తూ ఎక్స్గూటివ్ ప్రొడ్యూసర్ గా చేసాను.ఇప్పుడు నిర్మాతగా మారి ఈ సినిమా తీస్తున్నాను.సగం సినిమా అయిపోగానే కొన్ని ఇబ్బందులు వలన సినిమా ఆగిపోయింది..అమ్మాయిల పై జరుగుతున్న అఘాయిత్యాలు చూడలేక నా భార్యకు తెలియకుండా నా ఇల్లు అమ్మి ఈ సినిమాను కంప్లీట్ చేసాను.అందుకే నేను తీసిన ఈ సినిమాను దిశ కు అంకిత మిస్తున్నాను. ఇంట్లో మా అమ్మాయి టీవీ లో దిశ సంఘటన చూసి కళ్ళు తిరిగి పడిపోయింది.చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అడవారిపై అరాచకాలు చేస్తూనే ఉన్నారు.తరాలు మారినా మగవారిలో మార్పు రావడం లేదు.ప్రతి ఒక్కరూ అడవారిపై సోదరభావం తో మెలగాలి అని కోరుకుంటున్నాను.ఈ సినిమాకు అన్ని నేనే అయి తీస్తున్నాను.సహనిర్మాతలు,కార్తీక్ రెడ్డి ఇలా అందరూ నాకు సపోర్ట్ చేశారు.ఈ కార్యక్రమానికి ఇంత మంది సినీ పెద్దలు వచ్చి నన్ను,మా సినిమాను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యెక్క ధన్యవాదాలు అని అన్నారు..

Ammayante Alusa Is Dedicated To Disha: Hero, Producer & Director Nene Sekhar (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Ammayante Alusa Is Dedicated To Disha: Hero, Producer & Director Nene Sekhar (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Ammayante Alusa Is Dedicated To Disha: Hero, Producer & Director Nene Sekhar (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%