Social News XYZ     

Software Sudheer Review: A socio-fantasy crime story (Rating: 3.5)

Software Sudheer Review: A socio-fantasy crime story (Rating: 3.5)

Software Sudheer Review: A socio-fantasy crime story (Rating: 3.5) (Photo:SocialNews.XYZ)

చిత్రం: సాఫ్ట్ వేర్ సుధీర్
నటీనటులు : సుడిగాలి సుధీర్, ధన్యా బాలకృష్ణ, ఇంద్రజ, పోసాని, నాజర్, షాయాజీ షిండే, పృథ్వి, శివ ప్రసాద్, గద్దర్ తదితరులు..
దర్శకత్వం : పి. రాజశేఖర్ రెడ్డి
నిర్మాత‌ : శేఖర్ రాజు
సంగీతం : భీమ్స్
సినిమాటోగ్రఫర్ : సి. రామ్ ప్రసాద్
ఎడిటర్: గౌతమ్ రాజ
రేటింగ్: 3.5/5

కమెడియన్స్ హీరోలుగా మారడం అనేది బ్లాక్ అండ్ వైట్ కాలం నుండి కొనసాగుతున్న సంప్రదాయమే. కానీ అలా హీరోలుగా మారి అలరించి కంటిన్యూ అయినవాళ్లు మాత్రం ఎవ్వరూ లేరు. రాజబాబు నుండి రీసెంట్‌గా సునీల్ వరకు అంతా కూడా నాలుక కరుచుకుని మళ్ళీ కమెడియన్ అంటూ కంటిన్యూ అయ్యారు. అయితే ఈ మధ్య కాలంలో అత్యధిక ప్రజాదరణ పొందిన 'జబర్దస్త్' కామెడీ షో లో సుడిగాలి సుధీర్ అంటూ ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత మరికొన్ని షోస్ చేస్తూ బుల్లితెరపై మంచి ఇమేజ్, అలానే ఫాలోయింగ్ కూడా సంపాందించుకున్న సుధీర్ ఇప్పుడు హీరోగా మారాడు. అది కూడా తనపేరు కూడా కలసి వచ్చేలా సాఫ్ట్‌వేర్ సుధీర్ అంటూ టైటిల్ కూడా పెట్టుకుని హీరోగా తన తొలి ప్రయత్నంతో ప్రేక్షకులని పలరించాడు.మరి ఆ ప్రయత్నం ఫలించిందా? లేక వికటించిందా? అనేది ఇప్పుడు చూద్దాం.

 

కథ:

చందు(సుధీర్) ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తుంటాడు. అయితే అక్కడే కొలీగ్‌ (ధన్య బాలకృష్ణ) తో ప్రేమలో పడతాడు. వాళ్ళిద్దరి పెళ్లికి ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవడంతో ఇద్దరికీ నిశ్చితార్ధం కూడా అవుతుంది. కానీ ఆ వెంటనే చందు వాళ్ళ అమ్మకి, అలానే ధన్య వాళ్ళ అమ్మకి కూడా చిన్న చిన్న ప్రమాదాలు జరగడంతో జాతకాలు చూపించుకుందాం అని చందు,ధన్య కలిసి ఒక ఆశ్రమానికి వెళతారు. అయితే అక్కడ ఉన్న స్వామి చందుకి ఒక దోషం ఉంది అని చెబుతాడు. కానీ చందు తనని నమ్మకపోవడం వల్ల ముందు అతనికి నమ్మకం కలిగించడానికి ఒక పుస్తకం ఇచ్చి 30 రోజులు కూడా ఆ పుస్తకంలో ఉన్నట్టే అతనికి జరుగుతుంది అని చెబుతాడు. 29 రోజులు ఆ పుస్తకంలో ఉన్నట్టే జరుగుతుంది. కానీ 30 వ రోజు మాత్రం చందు చనిపోతాడు అని రాసి ఉంటుంది. అప్పుడు చందు, ధన్య ఏం చేశారు?, ఆ స్వామీజీ వాళ్ళను కాపాడాడా?, మరి ఈ కథకు రైతులకు సంబందించిన ప్రాజెక్ట్‌కి సంబంధం ఏంటి?...ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే మాత్రం సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

జబర్దస్త్ వంటి పాపులర్ కామెడీ షోలో నవ్వులకు కేరాఫ్ అడ్రెస్ అయిన సుడిగాలి సుధీర్ హీరోగా తెరపై తన ఎనర్జీతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా డాన్స్ లలో ఆయన మాస్ హీరో రేంజ్ లో ఇరగదీశాడు. అమాయకుడైన సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా సుధీర్ నటన పాత్రకు తగ్గట్టుగా ఉంది. అక్కడక్కడా ఆయన కామెడీ టైమింగ్ కూడా బాగుంది.

హీరోయిన్ ధన్యా బాలకృష్ణ రెండు భిన్న షేడ్స్ కలిగిన పాత్రను చక్కగా పోషించింది. పాటలలో ఆమె గ్లామర్ యూత్ కి కిక్కెక్కించేదిలా ఉంది. అలాగే పతాక సన్నివేశాలలో కూడా ఆమె చక్కగా నటించారు.

సెకండ్ హాఫ్ లో కథలో వచ్చే రెండు ట్విస్ట్స్ బాగున్నాయి. ఇక భీమ్స్ అందించిన సాంగ్స్ చాలా బాగున్నాయి. హీరో తల్లి దండ్రులుగా చేసిన సాయాజీ షిండే, ఇంద్రజ తమ పరిధిలో చక్కగా నటించారు. మంత్రి పాత్రలో శివ ప్రసాద్, హీరో మావయ్యగా పోసాని నటన ఆకట్టుకుంటుంది.

మొత్తంగా చెప్పాలంటే సాఫ్ట్ వేర్ సుధీర్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఫ్లో మరియు లాజిక్ సన్నివేశాలు ప్రేక్షకుడిని రంజింపజేస్తాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ రసవత్తరంగా ఉంది. ఒక సోసియో ఫాంటసీ చిత్రం చూస్తున్నాం అని ఫీలైన ప్రేక్షకుడికి విరామం తరువాత దర్శకుడు ఓ క్రైమ్ స్టోరీని పరిచయం చేశాడు. ఈ పాయింట్ సినిమాకే హైలెట్. ఐతే సుడిగాలి సుధీర్ కామెడీ టైమింగ్ అలాగే అతని ఎనర్జిటిక్ డాన్సులు అలరిస్తాయి. ధన్యా బాలకృష్ణ గ్లామర్ కూడా ఈ మూవీలో ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేస్తుంది.

 

Facebook Comments

Summary
Review Date
Reviewed Item
Software Sudheer
Author Rating
3Software Sudheer Review: A socio-fantasy crime story (Rating: 3.5)Software Sudheer Review: A socio-fantasy crime story (Rating: 3.5)Software Sudheer Review: A socio-fantasy crime story (Rating: 3.5)Software Sudheer Review: A socio-fantasy crime story (Rating: 3.5)Software Sudheer Review: A socio-fantasy crime story (Rating: 3.5)