ఈ ఇయర్ ఎండింగ్‌లో ఆడియన్స్ నవ్వుతూ ఎంజాయ్ చేసే చిత్రం 'సాఫ్ట్‌వేర్ సుధీర్` - నిర్మాత, నటుడు కె.శేఖర్ రాజు
'జబర్దస్త్, ఢీ, పోవే పోరా' వంటి సూపర్‌హిట్ టెలివిజన్ షోస్ ద్వారా ఎంతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ హీరోగా, 'రాజుగారి గది' ఫేమ్ ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్స్ క్రియేషన్స్ బేనర్‌పై ప్రొడక్షన్ నెం:1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్ రాజు నిర్మిస్తున్న చిత్రం 'సాఫ్ట్‌వేర్ సుధీర్'. ఈ సినిమా ద్వారా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. డిసెంబర్ 28న గ్రాండ్‌గా విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత, నటుడు కె.శేఖర్ రాజు, దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, నటుడు కె.శేఖర్ రాజు మాట్లాడుతూ...
అంచెలంచెలుగా ఎదిగాను!!
మాది భీమవరం దగ్గర ఒక పల్లెటూరు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి హైదరాబాద్‌లో ఓ మామూలు వ్యక్తిగా అడుగుపెట్టాను. 2500 నెలసరి జీతానికి ఓ గ్లాస్ స్మార్ట్‌లో కుదిరి రోజు సైకిల్‌మీద వెళ్తూ 2005 నుండి 2008 వరకు అక్కడే పని చేశాను. ఆ పనిలోని మెళకువలు నేర్చుకుని 2008లో గీతం కాలేజీకి సంబంధించిన విండోస్ గ్లాసింగ్ కాంట్రాక్ట్ ప్రారంభించాను. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ శేఖర గ్లాస్ వర్క్స్‌ను స్థాపించి ప్రస్తుతం మూడు చోట్ల దాదాపు 90 మంది స్టాఫ్‌తో కంపెనీ రన్ చేస్తున్నాను. భీమవరం అంటేనే కళాకారులకు పుట్టినిల్లు అంటారు. ఈ నేపథ్యంలో అనుకోకుండానే నా దృష్టి సినిమాలపై మళ్లింది.
అలా ప్రారంభమైంది!!
ఈ క్రమంలో రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చెప్పిన కథ నచ్చి 'శేఖర్ ఆర్ట్ క్రియేషన్స్' అనే నిర్మాణ సంస్థని ప్రారంభించాను. కథ ప్రకారం హీరోగా సుడిగాలి సుధీర్ అయితే బాగుంటుందని సుడిగాలి సుధీర్‌ని హీరోగా పరిచయం చేస్తూ 'సాఫ్ట్‌వేర్ సుధీర్' చిత్రాన్ని నిర్మించాను. ధన్య బాలకృష్ణ కథానాయికగా నటించింది. మేం అనుకున్నట్లుగానే సుధీర్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. హీరోగా సుధీర్‌కు డెఫినెట్‌గా ఇది ఒక మంచి సినిమా అవుతుంది. హైదరాబాద్‌తో పాటు మలేషియాలోని రిచ్ లొకేషన్స్‌లో షూటింగ్ జరిపాం. అనుకున్న సమయానికి చిత్రీకరణ పూర్తి అయ్యిందంటే అందుకు కారణం మా చిత్ర యూనిట్ సహకారం. ఈ మధ్యే సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది. ఈ ఇయర్ ఎండింగ్‌లో ఆడియన్స్ నవ్వుతూ ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. ఇందులో ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేశాను. రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వ శాఖలో ఎంతో కాలం పని చేశారు. ఆ అనుభవంతో ఒక మంచి కథ రాశారు. కథ ఎంత బాగా రాసుకున్నారో అంత బాగా తెరకెక్కించారు. ఈ సినిమాతో తనకు దర్శకుడిగా మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను. ఈ నెల 28న గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.
అంతర్లీనంగా మంచి సందేశం ఉంది!!
సాఫ్ట్ వేర్ బ్యాక్ డ్రాప్‌లో కథ నడుస్తుంది. ఫుల్ లెంగ్త్ కామెడీతో పాటు ఎమోషన్స్‌తో సినిమా ఆద్యంతం అలరించే విధంగా ఉంటుంది. అంతర్లీనంగా మంచి సందేశం ఉంది. రైతులకు, సాప్ట్‌వేర్ సుధీర్‌కు ఉన్న లింక్ ఏంటీ? అనేది వెండితెరపై చూడాలి.
ఈ సినిమాలో గద్దర్‌గారి పాత్ర ప్రేక్షకులకు నచ్చేవిధంగా ఉంటూ ఆసక్తికరంగా ఉంటుంది. శివప్రసాద్‌గారు ముఖ్య పాత్రలో నటించారు. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, రామ్ ప్రసాద్, గౌతం రాజు, భీమ్స్ ఇలా ప్రతి ఒక్కరూ పూర్తి సహకారం అందించారు. వారందరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ లో మాకు పూర్తి సహకారం అందించిన బి.ఎ రాజు గారికి ప్రత్యేక దన్యవాదాలు``అన్నారు.
కామెడీతో పాటు ఎమోషన్స్‌ని క్యారీ చేస్తూ ఆద్యంతం అలరించే చిత్రం "సాఫ్ట్ వేర్ సుధీర్"
చిత్ర దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ...
దర్శకత్వ శాఖలో అనుభవం ఉంది!!
నేను రైటర్‌గా కెరీర్ స్టార్ట్ చేశాను. నేను కూడా అందరిలాగే 10 సంవత్సరాల క్రితం స్క్రిప్ట్స్ పట్టుకొని అన్నీ ఆఫీస్‌లకి తిరిగాను. ఫైనల్‌గా మా గురువుగారు సంపత్ నందిగారు ఆయన దగ్గర చాలా సినిమాలకి అసిస్టెంట్ రైటర్, కో డైరెక్టర్‌గా పని చేశాను. అలాగే పోసానిగారి దగ్గర కొన్ని మూవీస్‌కి వర్క్ చేశాను. కోన వెంకట్‌గారి దగ్గర రైటర్‌గా వర్క్ చేశాను. రైటర్‌గా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' చిత్రానికి పని చేశాను. అలా దర్శకత్వం చేయాలని మా నిర్మాత శేఖర్ రాజుగారికి ఈ కథ చెప్పాను. ఆయన సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చేశారు.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్!!
ఈ సినిమా సుధీర్ ఫ్యాన్స్‌నీ, కామన్ ఆడియన్స్‌ని పక్కాగా ఎంటర్‌టైన్ చేస్తుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా. ఒక కామన్ ఆడియన్ ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకుంటారో అది ఈ సినిమాలో ఉంటుంది. కరెంట్ బర్నింగ్ ఇష్యూ మీద చేసిన పాయింట్. డెఫినెట్‌గా అందర్నీ ఆలోచింపజేస్తుంది. రెగ్యులర్ సినిమాల్లా కాకుండా కమర్షియల్‌లోనే మంచి పాయింట్‌ని టచ్ చేస్తూ సినిమా చేశాం. సుడిగాలి సుధీర్ నుండి ఏదైతే కామెడీ ఎక్స్‌పెక్ట్ చేస్తారో, దాంతో పాటు సస్పెన్స్‌తో కూడిన థ్రిల్లింగ్ అంశాలు ఇందులో ఉంటాయి. ఆడియన్స్‌లో ఆయన క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని 'సాఫ్ట్‌వేర్ సుధీర్' అని టైటిల్ పెట్టాం.
గద్దర్ పాత్ర గుర్తుండిపోతుంది!!
ఈ సినిమాలో ఒక పాట పాడి నటించి సినిమా చూసి ఆడియన్ బయటికి వచ్చాక కూడా గుర్తుండిపోయే క్యారెక్టర్ చేసిన గద్దర్‌గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇటీవల మనకు దూరమైన డా. ఎన్. శివప్రసాద్‌గారు ఈ సినిమాలో కథ నచ్చి మంచి క్యారెక్టర్ చేశారు. నాజర్, పోసాని కృష్ణమురళి, ఇంద్రజ, పృధ్వీ, షాయాజీ షిండే ముఖ్య పాత్రలు పోషించారు. డిసెంబర్ 28న సినిమా గ్రాండ్‌గా విడుదలవుంది. ప్రేక్షకులు తప్పకుండా మా చిత్రాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నాను``అన్నారు.