Social News XYZ     

Gautam Setti First Look From Ksheera Sagara Madhanam Movie Released

'క్షీర సాగర మథనం'లో
గౌతమ్ శెట్టి ఫస్ట్ లుక్ విడుదల

దేవతలు-రాక్షసులు సాగరాన్ని మధించినప్పుడు అమృతంతోపాటు హాలాహలమూ వచ్చింది. మన మనసులు మధించినప్పుడు కూడా మంచి ఆలోచనల్తోపాటుపాటు, చెడు ఆలోచనలు కూడా ఉద్భవిస్తాయి. ఈ అంశాన్ని ఆధారం చేసుకొని బహుముఖ ప్రతిభాశాలి అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఆహ్లాదకర చిత్రం 'క్షీర సాగర మథనం'. మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను అత్యద్భుతంగా తెరకెక్కిస్తూ రూపొందుతున్నఈ చిత్రంలో ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్, మానస్ నాగులపల్లి హీరోలుగా నటిస్తున్నారు. ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడు. ప్రముఖ యువ కథానాయకుడు సందీప్ కిషన్ ఈ చిత్రం టైటిల్ లోగోను విడుదల చేయగా- యువ కథానాయకుడు అడివి శేష్ 'క్షీరసాగరమథనం' పోస్టర్ ను లాంచ్ చేయడం తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న గౌతమ్ శెట్టి ఫస్ట్ లుక్ చిత్ర బృందం విడుదల చేసింది.

శేఖర్ కమ్ముల మొదలుకుని గౌతమ్ తిన్ననూరి వంటి సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ టర్న్ డ్ ఫేమస్ డైరెక్టర్స్ కోవలో సినిమా రంగంలో తనదైన ముద్ర వేయాలనే వజ్ర సంకల్పం కలిగిన ఐ.టి.రంగ నిపుణులు 'అనిల్ పంగులూరి' ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గుండెల్నిమెలిపెట్టే గాఢమైన అనుభూతుల్నిపంచి.. పలు రకాల భావోద్వేగాలతో మనసుల్ని రంజింపచేసి.. చాలా రోజుల తరువాత మరో మంచి సినిమా చూశామనే సంతృప్తిని మిగిల్చే చిత్రాన్ని అందించనున్నామనే నమ్మకం, గర్వం మాకుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.

 

చరిష్మా శ్రీకర్, ప్రియాంత్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ వినూత్న కథాచిత్రానికి ప్రచార రూపకల్పన: డిజైన్ ఐ.డి, పోరాటాలు: వింగ్ చున్ అంజి, పాటలు: శ్రీమణి-వశిష్ఠ శర్మ-వి.ఎన్. వి.రమేష్ కుమార్, సంగీతం: అజయ్ అరసాడ, ఛాయాగ్రహణం: సంతోష్ షనమోని, కూర్పు: వంశీ అట్లూరి, సహ-దర్శకుడు: కిషోర్ కృష్ణ, పీఆర్వో: ధీరజ అప్పాజీ, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, నిర్మాణం: ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: అనిల్ పంగులూరి!!

Facebook Comments