క్షణికావేశలో విద్యార్థులు తీసుకునే నిర్ణయాలు సరైనవి కావు....
మంచి సందేశంతో వస్తున్న స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రాన్ని ఆదరించండి...
స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట ఎల్ ఏ మేడా మల్లికార్జున రెడ్డిలు.
ఈ నెల 27 న రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై విడుదల కానున్న స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమా ప్రమోషన్స్ ను చిత్ర నిర్మాత ఓబుల్ సుబ్బారెడ్డి రాయచోటి లోని సాయి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు.చిత్రబృందం పాల్గోన్న ఈ ప్రమోషన్స్ కు ఎపి ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే, టిటిడి సభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి లు ముఖ్యఅతిధులుగా హజరై ఏ వి ని లాంచ్ చేశారు. క్షణికావేశంలో విద్యార్థులు తీసుకోనే నిర్ణయాలు సరైనవి కావని ఓ చక్కటి సందేశంతో వస్తున్న ఇలాంటి చిత్రాలను ప్రతి ఒక్కరు ఆదరించాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డిలు కోరారు. పరీక్షల్లో ఫైయిల్ అయినంత మాత్రాన చావే శరణ్యం కాదని, విజయం ఓ అథిదిలాంటదని అలావచ్చి ఇలా వేళ్ళిపోతుందని. కానీ ఒటమి నిత్యం ప్రక్కనే వుండి ఓ పాఠాన్ని నేర్పుతుందనే సందేశం ఈ సినిమా ద్వారా ఇవ్వడం విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపుతుందని వారు చెప్పారు .రాయచోటి ప్రాంత వాసి నిర్మాత ఓబుల్ సుబ్బారెడ్డి మంచి చిత్రాలను నిర్మిస్తున్నారన్నారని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎం ఎల్ ఏ మోహన్ రెడ్డి, మాజీ జెడ్ పి టి సి సుదర్శన్ రెడ్డి, వై ఎస్ ఆర్ సి పి నాయకులు పోలు రెడ్డి సుబ్బారెడ్డి, దశరథ రామిరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు
మాస్టర్ ప్రీతం రెడ్డి సమర్పించు
రాహుల్ మూవీ మేకర్స్
ఆర్టిస్ట్స్...
సంజయ్ అదామా ...
శ్రీనాథ్ మగంతి
అహల్య సురేష్
ప్రియా (జ్ఞానేశ్వరి)
సంజయ్ అదామా ...
శ్రీనాథ్ మగంతి
అహల్య సురేష్
ప్రియా (జ్ఞానేశ్వరి)
దర్శకుడు .. .జ.కరుణ కుమార్
నిర్మాత...ఓబుల్ సుబ్బ రెడ్డి
సహ నిర్మాత కిషోర్
D.o.p .... సునీల్ కుమార్. N
సంగీతం : యాజమాన్య
లిరిక్స్ రాంబాబు గోసాల
ఎడిటర్ : రవి మండల
స్టొరీ స్క్రీన్ప్లే డైలాగ్స్ : హరి ప్రసాద్ జక్కా
ప్రొడక్షన్ డిసైనేర్ :శ్రీనాద్ రాచూరి
ఎక్స్ ప్రొడ్యూసర్ :M.కిషోర్
కోరియోగ్రఫీ:జానీ పృద్విరాజ్
పి.ఆర్ ఓ : మధు వి.ఆర్