ఖోఖో నేపద్యంలో వస్తోన్న రదేరా చిత్ర టీజర్ కు మంచి స్పందన 2020 జనవరి మొదటివారంలో సినిమా విడుదల
పులా సిద్దేశ్వర్ రావ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం రదేరా, జుకెట్ రమేష్ ఈ సినిమాకు దర్శకుడు. పూల సిద్దేశ్వర్ రావ్, నరేష్ యాదవ్, వై.ఎస్.కృష్ణమూర్తి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ఈ సందర్బంగా డైరెక్టర్ జుకేట్ రమేష్ మాట్లాడుతూ....
ఖోఖో నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా కొత్తగా ఉంటుంది. మా సినిమా టీజర్ ను విడుదల చేసిన వి.వి.వినాయక్ గారికి ప్రేత్యేక ధన్యవాదాలు. టీజర్ చూసిన అందరూ బాగుంది అంటున్నారు. జనవరి 2020 మోదటివారంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్రం చేస్తున్నాము, ఈ సినిమాలో నటించిన నటీనటులు అందరూ బాగా చేశారు. త్వరలో ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలువుతాము అన్నారు.
హీరో మరియు నిర్మాత పూల సిద్దేశ్వరరావు మాట్లాడుతూ....
మా రదేరా సినిమాను కొందరు సినీ ప్రముఖులు చూసి బాగుంది అన్నారు. రేవు సినిమా విడుదల తరువాత ఆడియన్స్ నుండి అదే ఫీడ్ బ్యాక్ వస్తుందని నమ్ముతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత సిద్దేశ్వర్ రావ్ గారికి ధన్యవాదాలు, క్రీడా నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా తప్పకుండా సక్సెస్ సాధిస్తుంది, నూతన నటీనటులు అయినప్పటికీ అందరూ బాగా చేశారు, స్పోర్ట్స్ నేపధ్యంలో వస్తోన్న సినిమాలు సక్సెస్ అవుతాయి, అదే తరహాలోనే మా సినిమా సక్సెస్ అవుతుందని నమ్మకం ఉందని తెలిపారు.
నటీనటులు:
సిద్దేశ్వరరావు, మానస,వై. ఎస్.కృష్ణమూర్తి, నరేష్ యాదవ్, మారుతి సకరం, రమాదేవి, మంజు, నాని, రాజేష్,సాయి, జానీ, కార్తీక్
సాంకేతిక నిపుణులు:
డబ్బింగ్ : డీజీకీస్ట్
పి.ఆర్. ఓ: మధు విఆర్
డి.టి.ఎస్: పద్మారావ్
మ్యూజిక్: సిద్ధార్థ్
కెమెరా - ఎడిటర్ - కథ - స్క్రీన్ ప్లే - మాటలు -దర్శకత్వం: రమేష్ జకట
నిర్మాతలు: సిద్దేశ్వరరావ్ , నరేష్ యాదవ్, వై.ఎస్.కృష్ణమూర్తి