హలో మేడమ్ షూటింగ్ పూర్తి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ సంఘటనలు ఇంకా దేశంలో జరుగుతూనే ఉన్నాయి. మానవ రూపంలో ఉన్న మృగాలు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నాయి. ఒక ఉన్మాది (సైకో) చేతిలో విధి వంచితులైన అమ్మాయిల కథతో 'హలో మేడమ్' సినిమా రూపొందుతోంది. అమ్మాయిలను ట్రాప్ చేసి, వారి శీలాన్ని దోచుకుంటున్న మృగాడి కథ ఇది.
ఇలాంటి దారుణాలు చేసిన అతడికి ఎలాంటి శిక్ష పడింది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. కార్తీక్ మూవీ మేకర్స్ పతాకంపై వడ్ల జనార్ధన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఘటికాచలం కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, సంగీతం అందిస్తున్నారు. వడ్ల గురురాజ్, వడ్ల కార్తీక్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వడ్ల నాగ శారద సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
హీరోగా సైకో పాత్రలో నవీన్ కె. చారి నటిస్తున్న ఈ చిత్రంలో సుమాయ, ప్రియాన్సి, మేఘన నాయుడు, కావ్య, కవిత గౌడ్, దేవి, శీలం శ్రీను, సాయి, వెంకటేష్ టాతి రాజు, కల్యాణ్ పళ్ళం, శీలం రాహుల్, మల్లాది శాస్త్రి, నూతన్ బాబు, కాకినాడ గుప్తతో పాటుగా మాస్టర్ తీగుల్ల తన్వీత్ రెడ్డి నటిస్తున్నారు.
''హలో మేడమ్ చిత్రీకరణ పూర్తయిందని, హైదరాబాద్, వరంగల్, జగిత్యాల ప్రాంతాల్లో, అడవుల్లో షూటింగ్ జరిపినట్టు'' చిత్ర నిర్మాతలు వెల్లడించారు.
''ప్రేమ, యాక్షన్, వినోదం, హారర్, రొమాన్స్, మిళితమైన చిత్ర కథలో కమర్షియల్ అంశాలు కూడా చేర్చడం జరిగిందని'' దర్శకుడు వడ్ల జనార్ధన్ చెప్పారు.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్రీనివాస రెడ్డి, ఎడిటర్: వాసు వర్మ, సిఈఓ: కాసు హరిప్రసాద్, కో డైరెక్టర్: మర్రి కోటేశ్వరరావు. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: తలపనేని నరేంద్రబాబు.
This website uses cookies.