చదువు ధ్యాసలో పడి పిల్లలు తిండీ తిప్పలు మరిచిపోతున్నారు..! వేళకింత తినక చిక్కి పోతున్నారు..! పిల్లల గురించి తల్లిదండ్రులు ఇలా బాధపడడం సహజమే. వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా పోషక విలువలున్న ఆహారం అందించాలనీ ఆరాటపడుతుంటారు. ఇలా తపన పడటంలో తప్పేమీ లేదు. కానీ...ఆహారం ఇవ్వటంలో ఉన్న ఇదే శ్రద్ధ మంచినీళ్ల విషయంలో చూపిస్తున్నారా..? పిల్లలకు సరైన మోతాదులో నీళ్లు అందుతున్నాయా లేదా అని ఆరా తీస్తున్నారా..? ఈ ప్రశ్నలు అంత సులువుగా తీసుకోకండి..! నీళ్లు తాగకపోతే వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు..! ఆ నిర్లక్ష్యం చిన్నారుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో నెట్టేస్తుంది. పాఠశాలల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వరుస తరగతులతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తారు వారంతా. ఈ హడావుడిలో నీళ్లు తాగటం మానేస్తున్నారు. ఫలితంగా...జీర్ణకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇందుకు పరిష్కారంగానే ఇటీవల తెలుగురాష్ట్రాల్లోని పాఠశాలల్లో "నీటి గంట" కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోజుకు 2, 3 సార్లు తప్పనిసరిగా నీళ్లు తాగేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.
Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.
He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.
When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.
He can be reached at gopi@socialnews.xyz
చదువు ధ్యాసలో పడి పిల్లలు తిండీ తిప్పలు మరిచిపోతున్నారు..! వేళకింత తినక చిక్కి పోతున్నారు..! పిల్లల గురించి తల్లిదండ్రులు ఇలా బాధపడడం సహజమే. వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా పోషక విలువలున్న ఆహారం అందించాలనీ ఆరాటపడుతుంటారు. ఇలా తపన పడటంలో తప్పేమీ లేదు. కానీ...ఆహారం ఇవ్వటంలో ఉన్న ఇదే శ్రద్ధ మంచినీళ్ల విషయంలో చూపిస్తున్నారా..? పిల్లలకు సరైన మోతాదులో నీళ్లు అందుతున్నాయా లేదా అని ఆరా తీస్తున్నారా..? ఈ ప్రశ్నలు అంత సులువుగా తీసుకోకండి..! నీళ్లు తాగకపోతే వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు..! ఆ నిర్లక్ష్యం చిన్నారుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో నెట్టేస్తుంది. పాఠశాలల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వరుస తరగతులతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తారు వారంతా. ఈ హడావుడిలో నీళ్లు తాగటం మానేస్తున్నారు. ఫలితంగా...జీర్ణకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇందుకు పరిష్కారంగానే ఇటీవల తెలుగురాష్ట్రాల్లోని పాఠశాలల్లో "నీటి గంట" కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోజుకు 2, 3 సార్లు తప్పనిసరిగా నీళ్లు తాగేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.
This website uses cookies.