అందమైన అమ్మాయిల ప్రేమ కథ "రూపం యస్ 20 ప్లస్" నవంబర్ 28 న విడుదల...
సాయి లోకేష్ ప్రొడక్షన్ పతాకంపై సాయి తులసి సమర్పణలో చక్రవర్తి , బంగారాజు , అక్షర ,సంతోషిణి హీరో హీరోయిన్లుగా వెల్లంకి దుర్గాప్రసాద్ దర్శకత్వంలో సి.రామాంజనేయ నిర్మిస్తున్న అందమైన అమ్మాయిల ప్రేమ కథ చిత్రం "రూపం యస్ 20 ప్లస్" ఈ నవంబర్ 28 న ప్రేక్షకులముందుకు వస్తుంది.
దర్శకుడు వెల్లంకి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ... అందమైన అమ్మాయిలను చూస్తే ప్రతి మగాడికి ప్రేమ కలుగుతుంది, ఎలాగైనా ట్రాప్ లో పడేయాలని చూస్తారు, ఒప్పుకోకపోతే బలవంతంగానైనా కోరిక తీర్చుకోవాలని ప్రయత్నిస్తారు, ఇలాగే మా చిత్రంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయిని ఎలా పాడు చేసారు, ఆమె వాళ్లనుండి ఏ విధంగా తప్పించుకుంది, మంచి మనిషికి దగ్గరై అతని ప్రేమను ఎలా పొందింది అన్నది ఒక జంట కథగా , ఒక పోలీస్ ఆఫిసర్ అందమైన అమ్మాయి ప్రేమలోపడి పెళ్లిచేసుకొన్నాడు, మాఫియా వలలో చిక్కుకొన్న తన భార్యను ఎలా కాపాడుకొన్నాడన్నది రెండో జంట కథ, ఈ రెండు జంటల కథను అనేక మలుపులు తిప్పుతూ అద్భుతమైన స్కీన్ ప్లై తో రూపొందిన్చాన్నారు .
నిర్మాత సి.రామాంజనేయ మాట్లాడుతూ... ఈ చిత్రంలో నాలుగు ఫైట్లు , నాలుగు పాటలు ఉన్నాయని, అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తీర్చిదిద్ది నవంబర్ 28 న విడుదల చేస్తున్నామన్నారు. ఇంకా ఈ చిత్రంలో ఉమామహేశ్వరి , రజనీకాంత్ , అజయ్ , రజని , సరోజని నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : సాగర్ , ఆ
నంద్ , సంగీతం : మెలోడీ శ్రీనివాస్ , ఆర్ ఆర్ అర్మాన్ , పాటలు : వెల్లంకి విజయలక్ష్మి , ఫైట్స్ : లంక సాంభశివరావు ,ఎడిటింగ్ : వెంకటేశ్వర్లు , కథ , మాటలు , నిర్మాత : సి.రామాంజనేయ , స్కీన్ ప్లై , దర్శకత్వం : వెల్లంకి దుర్గాప్రసాద్