Vijay Sethupathi’s Pizza 2 To Be Released In The First Week Of December

డిసెంబర్ మొదటి వారంలో విడుదలవుతున్న విజయ్ సేతుపతి 'పిజ్జా 2 '

విజయ్ సేతుపతి, గాయత్రి హీరోహీరోయిన్లుగా తమిళంలో తెరకెక్కిన చిత్రం 'పురియత్ పుధీర్'. తమిళంలో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని 'పిజ్జా-2' పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. గతంలో విజయ్ సేతుపతి నటించించిన 'పిజ్జా' చిత్రం తెలుగులో మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు తెలుగులో 'పిజ్జా 2' గా టైటిల్ ఖరారు చేశారు. డి.వి.సినీ క్రియేష‌న్స్ మరియు లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్ బ్యాన‌ర్‌పై ఉదయ్ హర్ష వడ్డేల్ల, డి.వి.వెంక‌టేష్, సంయుక్తంగా డిసెంబర్ మొదటి వారంలో ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కులకు అందిస్తున్నారు.

ఆధునిక టెక్నాలజీ పేరుతో కొందరు యువకులు అమాయక మహిళలను ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారో తెలిపే ఒక సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసుకుని థ్రిల్లర్ జోనర్‌లో ఈ సినిమా రూపొందించబడింది. ఆద్యంతం ఉత్కంఠతో నడుస్తూ ఆసక్తిని కలిగించే స్క్రీన్‌ప్లేతో సాగే ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ని దర్శకుడు రంజిత్ జయకోడి తెరకెక్కించారు. ఈ చిత్రంలో నేరం ఫేమ్ రమేష్ తిలక్, సోనియా దీప్తి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

Vijay Sethupathi’s Pizza 2 To Be Released In The First Week Of December (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%