Sudheer Babu Releases Hemant Arts Pichodu Movie Trailer

హేమంత్ ఆర్ట్స్ పిచ్చోడు మూవీ ట్రైలర్ విడుదల చేసిన హీరో సుధీర్ బాబు !!!

హేమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై హేమంత్ శ్రీనివాస్ నిర్మిస్తోన్న సినిమా పిచ్చోడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలయ్యింది. ఫస్ట్ లుక్ కు సోషల్ మీడియాలో మరియు బయట మంచి రెస్పాన్స్ లభిస్తోంది. క్రాంతి, కె.సీమర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, సమీర్, సత్యకృష్ణ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్ర ట్రైలర్ ను హీరో సుధీర్ బాబు విడుదల చేశారు.

ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ...

ట్రైలర్ చాలా బాగుంది, కొత్త నటి నటులు చేస్తున్న ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. టైటిల్ క్యాచీగా ఉంది, అదే సినిమాకు సగం సక్సెస్. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో నటించిన అందరు నటీనటులకు, టెక్నీషియన్స్ కు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.

నిర్మాత హేమంత్ శ్రీనివాస్ మాట్లాడుతూ...

మా పిచ్చోడు సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన సుధీర్ బాబు గారికి ప్రేత్యేక ధన్యవాదాలు. మా సినిమా యూత్ ఫుల్ సబ్జెక్ట్ తో తెరకెక్కించము. తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాము అన్నారు.

నటీనటులు: క్రాంతి, కె.సీమర్, పోసాని కృష్ణమురళి, సమీర్, సత్య కృష్ణ, అభయ్, అప్పారావు, మహేష్, దుర్గ.
బ్యానర్: హేమంత్ ఆర్ట్స్
కథ - స్క్రీన్ ప్లే - నిర్మాత - దర్శకత్వం: హేమంత్ శ్రీనివాస్
సంగీతం: బంటి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: శ్రీ వెంకట్, శివ
ఎడిటర్: సంతోష్ గడ్డం
కెమెరామెన్: గోపి అమితాబ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: గురు, మౌర్య తేజ

Sudheer Babu Releases Hemant Arts Pichodu Movie Trailer (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%