`తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్` ప్రీ రిలీజ్ ఫంక్షన్
యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్న చిత్రంతెనాలి రామకృష్ణ
బీఏబీఎల్.
కేసులు ఇవ్వండి ప్లీజ్` ట్యాగ్ లైన్. జవ్వాజి రామాంజనయులు సమర్పణలో ఎస్.ఎన్.ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్, ఇందుమూరి శ్రీనివాసులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం కర్నూలులో జరిగింది. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, హీరో సందీప్‌కిషన్, డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డి, నిర్మాతలు అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్, ఇందుమూరి శ్రీనివాసులు, సప్తగిరి, గౌతంరాజు, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. టీజీ వెంకటేశ్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా...
రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ - తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ చిత్రాన్ని మన కర్నూలు జిల్లాకు చెందిన నిర్మాతలు, దర్శకుడు కలిసి రూపొందించారు. నన్ను ఈ సినిమా మేకింగ్ విషయంలో సంప్రదిస్తే నా వంతుగా చేదోడు వాదోడుగా నిలిచాను. సందీప్ చక్కగా నటించాడు. తనకు, దర్శకుడు నాగేశ్వరరెడ్డిగారికి, నిర్మాతలకు అభినందనలు
అన్నారు.
కర్నూలు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ మాట్లాడుతూ - కర్నూలులో `తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్` సినిమాను షూటింగ్ చేశారు. ఇక్కడ షూటింగ్ చేసిన సినిమాలన్నీ పెద్ద హిట్టయ్యాయి. ఈసినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఇకపై తెలుగు సినిమాలను ఇక్కడ కూడా డైరెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను
అన్నారు.
ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ - ```తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్` దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి, నలుగురు నిర్మాతలు మన కర్నూలు జిల్లావారు కావడం ఎంతో ఆనందించాల్సిన విషయం. ఇక్కడ షూటింగ్ జరుపుకున్న సినిమాలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. ఇప్పుడు అలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ - దర్శక నిర్మాతలు పాతికేళ్లుగా నాకు తెలుసు. మన ప్రాంతవాసులైన దర్శక నిర్మాతలు చేసిన ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను కూడా ఇక్కడే నిర్వహించాలని కోరుకుంటున్నాను
అన్నారు.
డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ - సందీప్ కెరీర్‌లోనే ఈసినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. కర్నూలు ప్రజలు నిర్మాతలు ఎంతగానో సపోర్ట్ చేశారు. సందీప్ ఈ కథను వినమని పంపాడు. నచ్చంది, సినిమా స్టార్ట్ చేశాం. రాజసింహ, విక్రమ్ రాజ్, నివాస్, ప్రసాద్ సహకారంతో సినిమాను డెవలప్ చేశాం. సాయికార్తీక్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. సాయిశ్రీరాం సినిమాను అద్భుతంగా చూపించారు. మా యూనిట్ ఎంతగానో కష్టపడింది. మంచి సినిమాను తీశాం. ప్రేక్షకులు, దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను
అన్నారు.
హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ - మా యూనిట్‌లో తెనాలి రామకృష్ణుడు ఎవరంటే మా డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిగారే. నా కెరీర్‌లో ఈ టైమ్‌లో నాగేశ్వరరెడ్డిలాంటి డైరెక్టర్ నాకు దొరకడం నా అదృష్టం. ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్‌తోనే మా సినిమాను బాగా తీయగలిగాం. నవంబర్ 15న ఈ సినిమాను చూసి కడుపుబ్బా నవ్వుకుంటారు. ఈ సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్స్ సహా అందరం అండర్ డాగ్స్‌లా ఈ సినిమాను చేశాం. అందరూ సినిమాను నవంబర్ 15న చూస్తే కర్నూలు, తెనాలి ప్రజలు మాత్రం నవంబర్ 14నే సినిమా చూస్తారు. ఈ షోను ఫ్రీగా నేను అందరికీ కోసం ముందుగానే వేస్తున్నాను
అన్నారు.
నిర్మాతలు అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్, ఇందుమూరి శ్రీనివాసులు మాట్లాడుతూ - సినిమాను కర్నూలులో 18 రోజుల పాటు షూట్ చేశాం. ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుంది సినిమా కూడా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ప్రేక్షకులు పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. నవంబర్ 15న సినిమాను విడుదల చేస్తున్నాం
అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తీక్ మాట్లాడుతూ - దర్శక నిర్మాతలకు ముందుగా థ్యాంక్స్. సినిమా అందరికీ నచ్చుతుంది
అన్నారు.
నటీనటులు:
సందీప్ కిషన్
హన్సిక
వరలక్ష్మి శరత్‌కుమార్
మురళీ శర్మ
బ్రహ్మానందం
వెన్నెలకిశోర్
ప్రభాస్ శ్రీను
పృథ్వి
రఘుబాబు
సప్తగిరి
రజిత
కిన్నెర
అన్నపూర్ణమ్మ
వై.విజయ
సత్యకృష్ణ తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: జి.నాగేశ్వర రెడ్డి
నిర్మాతలు: అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్ , ఇందుమూరి శ్రీనివాసులు
సమర్పణ: జువ్వాజి రామాంజనేయులు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల
కథ: టి.రాజసిహ
మ్యూజిక్: రాజసింహ
సంగీతం: సాయికార్తీక్
సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరాం
ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్
డైలాగ్స్: నివాస్, భవానీ ప్రసాద్
స్క్రీన్‌ప్లే: రాజు, గోపాల కృష్ణ
ఆర్ట్: కిరణ్
యాక్షన్: వెంకట్
పి.ఆర్.ఒ: వంశీ శేఖర్