నటీ నటులు – కృష్ణ, ఎల్సా ఘోష్, గౌతమ్ రాజు,తణికెళ్లభరణి, బెనర్జీ, రవి ప్రకాష్, సూర్య, సనా తదితరులు
దర్శకత్వం : శ్రీనాథ్ పులకురం
నిర్మాతలు : బిజెఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్
సంగీతం : బోలె షావలి
సినిమాటోగ్రఫర్ : ఏ.విజయ్ కుమార్
ప్రముఖ కమెడియన్ గౌతంరాజు తనయుడు కృష్ణ హీరోగా శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కృష్ణరావు సూపర్ మార్కెట్’. బిజేఆర్ సమర్పణలో బిజిఆర్ ఫిలిం అండ్ టీవీ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎంత వరకూ నచ్చిందో తెలియాలనే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.
కథ:
అర్జున్ (కృష్ణ) ఒక ఒక కిక్-బాక్సింగ్ ట్రైనీ. ఆడుతూ పాడుతూ తిరిగే అర్జున్ తొలిచూపులోనే సంజన (ఎల్సా ఘోష్)తో ప్రేమలో పడతాడు. ఇక అర్జున్ ప్రేమను చూసిన సంజన కూడా అతని ప్రేమలో పడుతుంది. అలా సాగిపోతున్న వారి ప్రేమ ప్రయాణంలో సడన్ గా ఒక చెడు పరిణామం సంభవిస్తుంది. ఒక వ్యక్తి సంజనను చంపుతాడు. అతను ఎవరు? అతను సంజనను ఎందుకు చంపాడు ? అతన్ని అర్జున్ ఎలా కనిపెట్టాడు..? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
వెండితెరపై నవ్వులు పూయించిన కమెడియన్ లు తమ వారసులను హీరోలుగా సినీ ప్రపంచంలోకి తీసుకురావడం ఇదేం ఫస్ట్ టైం కాదు. ఇప్పటికే ఎంతో మంది స్టార్ కమెడియన్ల కొడుకులు సిల్వర్ స్క్రీన్ పై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు గౌతమ్ రాజు కొడుకు కృష్ణ వంతు వచ్చింది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన కృష్ణ చక్కగా నటించాడు. మొదటి సినిమా అయినా కూడా అలాంటి భావన మనకు ఎక్కడా కనిపించదు. కిక్-బాక్సింగ్ చేసేప్పుడు వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి.
అలాగే సినిమాలో హీరోయిన్ గా ఎల్సా ఘోష్ అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి.
ఇక హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించిన సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి ఎప్పటి లాగే తన నటనతో సూపర్ అనిపించారు.
ముఖ్యంగా ఈ సినిమాలో సైకో కిల్లర్ పాత్రలో నటించిన నటుడు సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు. ఆ పాత్రకు కరెక్ట్ గా సరిపోయాడు. చాలా బాగా నటించారు. ఇతర కీలక పాత్రల్లో నటించిన రవిప్రకాష్, గౌతమ్ రాజు, బెనర్జీ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.
ఇక డైరెక్టర్ గురించి చెప్పాలంటే శ్రీనాథ్ పులకురమ్ మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నాడు. దర్శకుడిగా తనకు వచ్చిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకున్నాడు. సంగీత దర్శకుడు బోలె షావలి అందించిన నేపధ్య సంగీతం పర్వాలేదు. తను అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా ప్లస్ అయింది. ఏ.విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది. కీలక సన్నివేశాల్లోని విజువల్స్ ను ఆయన చాలా సహజంగా చూపించారు. ఇక నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లే ఉన్నాయి.
ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా కృష్ణారావు సూయర్ మార్కెట్. గౌతమ్ రాజు తనయుడు కృష్ణ ఈ చిత్రంతో మంచి మార్కులు కొట్టేసాడు. భవిషత్తులో అతనికి మరిన్ని మంచి సినిమాల్లో అవకాశం వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ వీక్ ఎండ్ ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ చిత్రం కృష్ణారావు సూపర్ మార్కెట్.
ప్లస్ పాయింట్స్:
యాక్షన్ సన్నివేశాలు
హీరో కృష్ణ నటన
విలన్ సస్పెన్స్
గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే
దర్శకత్వం
రేటింగ్: 3.5/5