నవంబర్ రెండో వారంలో విడుదలకు సిద్ధమవుతున్న `ఇద్దరి లోకం ఒకటే`
యంగ్ హీరో రాజ్‌తరుణ్, షాలిని పాండే జంటగా రూపొందుతోన్న చిత్రం ఇద్దరి లోకం ఒకటే
. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ఇద్దరి లోకం ఒకటే
. జీఆర్.కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పటికే 90 శాతం సినిమా పూర్తయ్యింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను నవంబర్ రెండో వారంలో విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నటీనటులు: రాజ్ తరుణ్, షాలిని పాండే, నాజర్, పృథ్వీ, రోహిణి, భరత్, సిజ్జు, అంబరీష్, కల్పలత తదితరులు
సాంకేతిక వర్గం: స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జీఆర్.కృష్ణ సమర్పణ: దిల్‌రాజు నిర్మాత: శిరీష్ కెమెరా: సమీర్ రెడ్డి మ్యూజిక్: మిక్కీ జె.మేయర్ ఎడిటింగ్: తమ్మి రాజు డైలాగ్స్: అబ్బూరి రవి పాటలు: శ్రీమణి, కిట్టు, బాలాజీ స్టంట్స్: స‌్టంట్ శివ కొరియోగ్రఫీ: భాను, విజయ్