సినీ రాజకీయ ప్రముఖులు సమక్షంలో ఘనంగా బతుకమ్మ లఘుచిత్రం ప్రదర్శన
వివేక్ దర్శకత్వంలో లత నిర్మించిన బతుకమ్మ లఘుచిత్ర ప్రదర్శన ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో రసమయి బాలకృష్ణ, నిర్మాత రామసత్యనారాయణ, నిర్మాత మల్కాపురం శివకుమార్, ప్రకాష్ గౌడ్, సుధాకర్ రెడ్డి, రాజేశం గౌడ్, ఉమామహేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా నటి & నిర్మాత లత మాట్లాడుతూ...
బతుకమ్మ షార్ట్ ఫిలిం ను వీక్షించేందుకు వచ్చిన ప్రతివక్కరికి ధన్యవాదాలు. నన్ను నటిగా రాణించారు, ఇప్పుడు నిర్మాతగా మీ ముందుకు వచ్చాను. ఈ షాట్ ఫిలిం తీసేందుకు సహకరించిన అందరికి థాంక్స్, మా షార్ట్ ఫిలిం మెహుబూబ్ నగర్, కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం అక్కడ మాకు సహకరించిన అందరికి నమస్కారాలు. మీ అందరి సహకారం ఉంటే భవిషత్తులో మరిన్ని మంచి చిత్రాలతో మీ ముందుకు వస్తాను. డైరెక్టర్ వివేక్ ఈ చిత్రాన్ని బాగా తీసాడు, నటీనటులు అందరూ చక్కగా నటించారు అన్నారు.
డైరెక్టర్ వివేక్ కైపా పట్టాభిరం మాట్లాడుతూ...
నేను గతంలో శంకర్ మహదేవన్ తో కలిసి ఉమెన్ ఆంత: అనే వీడియో ఆల్బమ్ చేశాను. ఆ తరువాత కొన్ని చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేయడం జరిగింది. ఒక మంచి టీమ్ దొరకడంతో బతుకమ్మ షార్ట్ ఫిలిం అందంగా వచ్చింది. బతుకమ్మ మీద షార్ట్ ఫిలిం చేస్తే ఇంత ఆధర అభిమానులు వస్తాయని గెస్ చెయ్యలేదు, అందరూ బాగుందని చెప్తుండడంతో సంతోషంగా ఉంది. నాకు సపోర్ట్ చేసిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కమర్షియల్ సినిమాలు చెయ్యడం చెయ్యడంతో పాటు సామాజిక సృహ ఉన్న షార్ట్ ఫిలిమ్స్ చెయ్యడం నా హాబీ. చెన్నైలో కొన్ని చిత్రాలకు, యాడ్ ఫిలిమ్స్ కు వర్క్ చెయ్యడంతో టెక్నీకల్ గా చాలా విషయాలు నేర్చుకున్నాను. బతుకమ్మ టెక్నీకల్ గా బాగుందని ఫ్రెండ్స్, చూసినవారు చెప్పడం సంతోషం. సైరా సినిమాకు అసోసియేట్ కెమెరామెన్ గా చేసిన సాంబ మా బతుకమ్మను బాగా తీసాడు. నిర్మాత లత గారికి ప్రేత్యేక కృతజ్ఞతలు. భవిషత్తులో నాకు మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్న అన్నారు.
నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ...
లత గారు ఎప్పటి నుండో తెలుసు. ఆమె ఈ చేసిన ఈ ప్రయత్నం బాగుంది. తెలంగాణ ప్రభుత్వం ఎలా ఉంది ? బంగారు తెలంగాణగా ఎలా తయారయ్యింది అనేది ఈ షార్ట్ ఫిలిం లో బాగా చూపించడం జరిగింది. లత మంచి నటి, ఆమె భవిషత్తులో మరింత ఎదగాలని కోరుకుంటున్న అన్నారు
నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ...
లత మంచి నటి, ఆమె సొంతంగా పాట రాసి నిర్మించిన బతుకమ్మ షార్ట్ ఫిలిం ను బాగా తీసింది. ఇలాంటి షార్ట్ ఫిలిం ను మనం ఎంకరేజ్ చేస్తే మరింతమంది ఇలాంటి వారు మనకు వస్తారు.
ప్రకాష్ గౌట్ మాట్లాడుతూ...
తెలంగాణ వచ్చాక బతుకమ్మను ఇంకా బాగా జరుపుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎన్నో పథకాలను ఈ షార్ట్ ఫిలిం లో చక్కగా చూపించారు అన్నారు.
రసమయి బాలకృష్ణ మాట్లాడుతూ...
అందరికి నమస్కారం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి ధన్యవాదాలు. లత తీసుకున్న ఈ నిర్ణయం బాగుంది. తెలంగాణ అభివృద్ధిని లత గారు షార్ట్ ఫిలిం లో చక్కగా చూపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం రావాలని బతుకమ్మ ను మనం ఆడాం. తెలంగాణ వచ్చిన తరువాత బతుకమ్మను మనం మరింత అందంగా జరుపుకుంటున్నాం. కేసీఆర్ గారు ప్రవేశ పెట్టిన అనేక పథకాలు ఈ షార్ట్ ఫిలిం లో అందంగా చూపించడం జరిగింది. బతుకమ్మ పండుగ గురించి తీసిన ఈ షార్ట్ ఫిలిం ను ప్రజలకు మరింత చేరువ అయ్యేలా చెయ్యాలని కోరుకుంటున్న అన్నారు.
సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ...
ఆనాటి తెలంగాణ ఎలా ఉంది ? ఈనాటి తెలంగాణ ఎలా ఉంది అనేది ఈ లఘు చిత్రంలో చక్కగా చూపించడం జరిగింది. బతుకమ్మ పండగను గౌరవంగా జరుపుకొనే ఈ తెలంగాణలో కేసీఆర్ ప్రవేశ పెట్టిన అనేక పథకాలను పొందుపరిచి తీసిన బతుకమ్మ లఘుచిత్రం చూసి కళ్ళలో నీళ్ళు వచ్చాయి. లత గారు దీన్ని తెరకెక్కించిన విధానం అద్భుతం అన్నారు.
రాజేశం గౌడ్ మాట్లాడుతూ...
నేను ఈ బతుకమ్మ లఘు చిత్రం చూస్తున్నప్పుడు నా చిన్ననాటి సంగతులు గుర్తు వచ్చాయి. లతగారికి మంచి టాలెంట్ ఉంది. ఆమె భవిషత్తులో మరిన్ని మంచి చిత్రాలు తీయ్యలని కోరుకుంటున్న అన్నారు.
This website uses cookies.