Happy that the movie received a positive response from the 1st show: Gaddalakonda Ganesh Movie Team

'గద్దలకొండగణేష్‌' సినిమాకి మొదటి షో నుండే ఇంతమంచి అప్రిసియేషన్‌ రావడం హ్యాపీగా ఉంది - చిత్ర యూనిట్

Happy that the movie received a positive response from the 1st show: Gaddalakonda Ganesh Movie Team (Photo:SocialNews.XYZ)

మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం 'గద్దలకొండగణేష్‌'. పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రంలో తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలయ్యి మొదటి షో నుండే పాజిటివ్‌ టాక్‌తో సూపర్‌హిట్‌ కలెక్షన్స్‌ సాధిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ అన్నపూర్ణ సెవెన్‌ ఎకర్స్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మెగా బ్రదర్‌నాగబాబు, 14 రీల్స్‌ ప్లస్‌ అధినేతలు రామ్‌ఆచంట, గోపిఆచంట, హీరోవరుణ్‌ తేజ్‌, డైరెక్టర్‌హరీష్‌ శంకర్‌, సత్య, రవి, సినిమాటోగ్రాఫర్‌ అయనాంకబోస్‌ తదితరులు పాల్గొని కేక్‌కట్‌ చేసి సక్సెస్‌ను సెలెబ్రేట్‌ చేసుకున్నారు.

పవర్‌ ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ - ''మా 'గద్దల కొండ గణేష్‌' సినిమా విడుదలయినప్పటి నుండి అందరి నోటా ఒకటే మాట సూపర్‌హిట్‌ అని. వరుణ్‌తేజ్‌ వన్‌మాన్‌షో అని హై ఎనర్జీతో మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీ నుండి కూడా మంచి అప్రిసియేషన్‌ వస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవిగారు ఫోన్‌ చేయడంతో మాకు ఇంకాఎనర్జీ వచ్చింది. తరువాత అల్లుఅర్జున్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. కొంతమంది అయితే హరీష్‌.. నీకెరీర్‌ బెస్ట్‌వర్క్‌ అన్నారు. బహుశా ఫస్ట్‌ టైం నాసినిమాలో ఎంటర్టైన్మెంట్‌తో పాటు ఎమోషన్‌ కూడా బాగా పండింది. అలాగే ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎపిసోడ్‌కి కూడా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. వరుణ్‌ రెండు షేడ్స్‌లో అద్భుతంగా నటించారు. 'ఎల్లువొచ్చి గోదారమ్మ' సాంగ్‌కి భీమవరంలో ఆడియన్స్‌ స్టేజిఎక్కిడాన్స్‌ వేస్తున్నారు. వరుణ్‌ కెరీర్‌ బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ చేశారు కాబట్టే ఆయన కెరీర్‌ బెస్ట్‌ మూవీ అవబోతుంది. వరుణ్‌ కెరీర్‌ బెస్ట్‌ ఓపెనింగ్స్‌ తీసుకుంది. తప్పకుండా హైయెస్ట్‌ గ్రాసర్‌ కూడా అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో విజువల్స్‌ ఇంత బాగా రావడానికి మా సినిమాటోగ్రాఫర్‌ అయనాంక బోస్‌ కారణం. అలాగే మిక్కీ పాటలతో పాటు బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా అదరగొట్టాడు. మా సినిమాలో ఎక్కడా ఖర్చుకి వెనకాడని ప్రొడ్యూసర్స్‌ రామ్‌ ఆచంట, గోపి ఆచంట గారికి క తజ్ఞతలు. సినిమాలో వరుణ్‌ కనిపించే హీరో అయితే కనపడని హీరో సినిమా. సినిమానే అతన్ని మార్చింది. నిన్న ఈవినింగ్‌కి నా సినిమా ఏంటో ఈ ప్రపంచానికి తెలీదు. ఇవ్వాల సినిమా చూసిన వారు నా సినిమానే ప్రపంచం అంటున్నారు. నిన్న నెక్స్ట్‌ ఏంటి అని ఆలోచించలేని పరిస్థితి. నిన్నటి మీద కోలుకుంటున్నాను. నిన్న మాకు జరిగిన ఇబ్బంది కలగకపోయి ఉంటే ఇంకా ఎక్కువ ఎంజాయ్‌ చేసేవాళ్ళం. మా సినిమాకి ఇంత ప్రేమ వస్తుంది అని మేము అనుకోలేదు. ఎవరు ఓడిపోయారో నాకు తెలీదు కానీ సినిమా మాత్రం గెలిచింది'' అన్నారు.

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ - ''నిన్న రాత్రి మా ఎవ్వరికి నిదరపట్టలేదు. ఎప్పుడైతే ప్రీమియర్‌ షోస్‌ పడ్డాయో అప్పటినుండి పాజిటివ్‌టాక్‌తో మాకు నిద్రపట్టకుండా చేశారు. మార్నింగ్‌ చిరంజీవి గారు, అల్లు అరవింద్‌ గారు ఫోన్‌ చేసి అభినందించారు. అప్పటి నుండి కంటిన్యూయస్‌గా కాల్స్‌ వస్తూనే ఉన్నాయి. ఇది నా ఒక్కడి విజయం కాదు మా టీం అందరి విజయం. సినిమా స్టార్టింగ్‌ నుండి సపోర్ట్‌ చేసి, ఇప్పుడు పాజిటివ్‌ రివ్యూస్‌ ఇచ్చిన మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు'' అన్నారు.

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, అధర్వ మురళి, పూజ హెగ్డే, మృణాళిని రవి, డింపుల్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్‌, సినిమాటోగ్రఫీ: ఐనాంక బోస్‌, ఎడిటింగ్‌: ఛోటా కె.ప్రసాద్‌, ఫైట్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: అవినాష్‌ కొల్ల, స్క్రీన్‌ ప్లే: మధు శ్రీనివాస్‌, మిథున్‌ చైతన్య, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ : గౌరీ, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా,నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపి ఆచంట,దర్శకత్వం: హరీష్‌ శంకర్‌.ఎస్‌*

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%