నా స్నేహితుడు పవన్‌కళ్యాణ్‌కి 'గబ్బర్‌సింగ్'తో సూపర్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ 'వాల్మీకి' తో వరుణ్‌తేజ్ కి మరో సూపర్ హిట్ ఇస్తారు - లో విక్టరి వెంకటేష్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజ హెగ్డే హీరోహీరోయిన్లుగా మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం 'వాల్మీకి'. తమిళ హీరో అధర్వ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. సెప్టెంబర్ 20న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతున్న సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదిక లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విక్టరి వెంకటేష్ హాజరయ్యి ఆడియో బిగ్ సిడిని విడుదలచేశారు. ఈ సందర్భంగా...
లిరిసిస్ట్ చంద్రబోస్ మాట్లాడుతూ - ''మెగా ఫ్యాన్స్ అందరికి శుభాకాంక్షలు. 'గబ్బర్‌సింగ్' సినిమాలో ఆకాశంఅమ్మాయైతే పాట, 'సుబ్రహ్మణ్యంఫర్‌సేల్' సినిమాలో తెలుగంటే గొంగూర పాట, వరుణ్ తేజ్ కి మొదటిసారి వక్క వక్క అనే పాట రాసే అవకాశం ఇచ్చిన దర్శకుడు హరీష్‌శంకర్ గారికి ధన్యవాదాలు. మన తెలంగాణా మాండలీకం ఉండే మంచి పాట. మిక్కీ జె మేయర్ గారు శృతి మెత్తని పాటలకు ప్రసిద్ధి. ఆయన మొదటిసారి మాస్ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్'' అన్నారు.
లిరిసిస్ట్ వనమాలి మాట్లాడుతూ - '' ఈ చిత్రంలో గగన వీధిలో అనే పాట రాశాను. ఈ కాలంలో అటువంటి పరిస్థితులకి పాట రాపించే ధమ్ము, ధైర్యం ఒక్క హరీష్ శంకర్ గారికే ఉంటాయి. వరుణ్ గారికి 'ఫిదా' సినిమాలో పాట రాశాను, మిక్కీ జె మేయర్ గారితో 13 సంవత్సరాలుగా నా అనుబంధం కొనసాగుతుంది'' అన్నారు.
హీరోయిన్ మృణాళిని మాట్లాడుతూ - '' డబ్‌స్మాష్ వీడియోలతో కెరీర్ స్టార్ట్ చేసి ఈరోజు ఇంతమంది తెలుగు సూపర్ స్టార్స్ ముందు మాట్లాడడం నాకు ఒక డ్రీమ్‌లా ఉంది. 'వాల్మీకి' టీమ్‌లో పార్ట్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను'' అన్నారు.
నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ - ''వాల్మీకి సినిమాలో గ్యాంగ్ స్టర్స్ అందరికీ బాడీ లాంగ్వేజ్ నేర్పించే చిత్ర విచిత్రమైన క్యారెక్టర్ నాది. ఇంతవరకూ ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. మా నిర్మాతలు గోపి ఆచంట, రామ్ ఆచంట గారికి మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. వరుణ్ తేజ్‌తో మొదటి సారిగా నటించాను. డిఫరెంట్ క్యారెక్టర్‌లో వరుణ్ ఇరగొట్టాడు. హరీష్ అద్భుతమైన మార్పులు చేసి సినిమాను తెరకెక్కించారు'' అన్నారు.
నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ - ''వాల్మీకి టైటిల్ పెట్టడానికి కొంత గుండెధైర్యం కావలి, అలాగే సాహిత్యం మీద పట్టు ఉండాలి. అందుకే హరీష్ శంకర్ గారు ఈ టైటిల్‌ని ఎంచుకున్నారు అనిపిస్తుంది. ఈ సినిమాతో వరుణ్ అసాధారమైన నటుడు అని తెలుస్తుంది. ఈ సినిమాలో 'ఎల్లువచ్చి గోదారమ్మ' పాటలో వరుణ్ పూజ పోటీపడి మరీ డాన్స్ చేశారు. హరీష్ శంకర్ డిసిప్లేన్డ్ డైరెక్టర్. నిర్మాతలు చాలా మంచి వారు వారికి అంతా మంచే జరగాలి 'అన్నారు.
యువ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ మాట్లాడుతూ - '' నాకు ఈ అవకాశం ఇచ్చిన హరీష్ శంకర్ గారికి, నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట గారికి థాంక్స్. అలాగే ఇక్కడికి వచ్చిన వెంకటేష్ గారికి స్పెషల్ థాంక్స్. వరుణ్ ప్రతి సన్నివేశంలో బాగా నటించారు. అలాగే సింగర్ అనురాగ్ కులకర్ణి ఒక పాటను మూడు వెర్షన్స్‌లో పాడడం అమేజింగ్ టాలెంట్. రీమిక్స్ పాట పాడిన రమ్య బెహరా, జరా..జరా పాట పాడిన ఉమగారికి థాంక్స్''అన్నారు.
లిరిసిస్ట్ భాస్కరభట్ల మాట్లాడుతూ - ''అక్షరాల్ని కళ్లకు అద్దుకొని కవుల్ని గుండెలకు హత్తుకునే దర్శకుడు హరీష్ శంకర్. కవుల్ని పిల్లల కోడిలా వెంట పెట్టుకొని తిరుగుతాడు. 'మిరపకాయ్' సినిమా నుండి ఆయనతో నా అనుబంధం కొనసాగుతుంది. మంచి పాటలు రాయడానికి కావాల్సిన సమయం ఇచ్చే దర్శకుడు. ఈ సినిమాలో జర్ర జర్రా.. సాంగ్ రాశాను''అన్నారు.
నటి డింపుల్ మాట్లాడుతూ - ''ఇక్కడ నించొని మీ ముందు మాట్లాడడానికి 5 ఇయర్స్ పట్టింది. స్పెషల్ సాంగ్‌లో తెలుగు అమ్మాయిని నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ 'అన్నారు.
హీరోయిన్ పూజ హెగ్డే మాట్లాడుతూ - ''ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ చేసే అవకాశం ఇచ్చిన హరీష్ గారికి థాంక్స్. శ్రీదేవి గారి ఐకానిక్ సాంగ్ 'ఎల్లువొచ్చి గోదారమ్మ'ని రీమిక్స్ చేయడం హరీష్ సర్ డ్రీమ్. ఆయన మంచి యాక్టర్ కూడా.. నన్ను ఇంత బ్యూటిఫుల్ గాచూపించిన బోస్ గారికి థాంక్స్. వరుణ్ అన్ని అమేజింగ్ స్క్రిప్ట్ లనే ఎంచుకుంటున్నారు. 'వాల్మీకి' సినిమాతో ఆయన నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తారు. ఇంత ప్రేమ ఇచ్చిన ఫ్యాన్స్ అందరికీ థాంక్స్ ''అన్నారు.
నిర్మాత గోపి ఆచంట మాట్లాడుతూ - '' మెగాస్టార్, పవర్‌స్టార్ ఫ్యాన్స్ అందరికీ వెల్కమ్..అలాగే ఈ ఫంక్షన్‌కి చీఫ్‌గెస్ట్‌గా వచ్చిన మా ఫస్ట్ హీరో విక్టరీ వెంకటేష్ గారికి థాంక్స్. వరుణ్‌తేజ్‌తో ఎప్పటినుండో రెండు మూడు సబ్జెక్ట్స్ చేద్దాం అనుకున్నాం. కానీ కుదరలేదు. ఇప్పుడు బ్రహ్మాండమైన కథ, మంచి కమర్షియల్ వాల్యూస్ ఉన్న 'వాల్మీకి' చిత్రం ఆయనతో చేయడం హ్యాపీగా ఉంది. అలాగే పూజ, మృణాళిని, అధర్వకి అభినందనలు. మిక్కీ ఆడియో ఆసమ్. మా డి.ఓ.పి ఐనాంకబోస్ గారి విజువల్స్ చాలా బాగున్నాయి. ఇక మా దర్శకుడు పవర్ స్టార్‌తో 'గబ్బర్‌సింగ్' తీసి ఎలా మిమ్మల్ని అలరించారో వరుణ్‌తేజ్‌తో 'వాల్మీకి' తీసి అంతకంటే ఎక్కువ అలరిస్తాడు'' అన్నారు.
దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ - ''ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పటినుండి నాతో ట్రావెల్ చేసిన మధు శ్రీనివాస్, మిధుల్ చైతన్య గారికి థాంక్స్. నాతో పాటు ఒక సంవత్సరం ట్రావెల్ అయ్యి స్క్రిప్ట్‌లో నాతో పాటు కూర్చున్నారు. వీరివర్క్‌కి ఇంప్రెస్ అయ్యి అడిషనల్ డైలాగ్స్ అని వీరి పేరు కూడా మీతో షేర్ చేసుకున్నా. మనకు నచ్చిన పాటల్ని షేర్ చేసుకోవడం ద్వారా మన కవిత్వాన్ని, మనసాహిత్యాన్ని కాపాడుకున్నవారం అవుతాము. ఐనాంక బోస్, మిక్కీ ఈ సినిమాకి రెండు పిల్లర్స్ లాంటి వారు. మిక్కీతో చేసిన 'తెలుగంటే' నా ఫేవరెట్ సాంగ్. మిక్కీ చేసిన 'మహానటి' నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఆల్బమ్. మిక్కీ పాటలు ఎంత హిట్ అయ్యాయో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతకన్నా హైలెట్ అవుతుంది. మృణాళిని ఫైనెస్ట్ యాక్ట్రెస్. స్పెషల్ సాంగ్ చేసిన డింపుల్‌కి థాంక్స్. అధర్వ మురళి డైరెక్టర్ అవ్వాలనుకే పాత్రలో బాగా చేశాడు. అలాగే శ్రీదేవి క్యారెక్టర్ చేసిన పూజకి థాంక్స్. ఈ సినిమాలో ఆమె పెర్ఫామెన్స్‌కి మంచి పేరు వస్తుంది. వెంకటేష్ గారిని 'ఎఫ్2' షూటింగ్ టైమ్‌లో బ్యాంకాక్‌లో కలవడం జరిగింది. ఆయన సినిమాలు చూస్తూ ఇండస్ట్రీకి వచ్చినవాల్లం. ఆయన 'ఎఫ్2' ర్యాపప్ పార్టీలో మా అందరి కోరిక మేరకు బలపంపట్టి.. పాటకు రెండు నిముషాలు డాన్స్ వేశారు. అది నా జీవితంలో గుర్తుంచుకునే ఎక్స్ట్రాడినరీ మూమెంట్. ఆయన అంత క్లోజ్‌గా ఉంటారని ఆయన్ని కలిసే వరకు తెలీదు. వరుణ్ డెడికేషన్, కమిట్ మెంట్ షూటింగ్ టైమ్‌లో చూశా. 85 రోజులు షూట్ చేస్తే 85 రోజులు నవ్వుతూ చేసిన నా మొదటి హీరో వరుణ్. వరుణ్ ఒక కేక్ వాక్ లా చాలా ఈజీగా గద్దల కొండ గణేష్ క్యారెక్టర్ చేశాడు. వరుణ్‌తో లైఫ్‌లాంగ్ సినిమాలు తీయాలి అనే స్టేజ్‌కి తీసుకువచ్చారు. రామ్ ఆచంట, గోపి ఆచంట చాలా ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్స్. ఏ రోజు ప్రొడక్షన్ నుండి ఇది లేదు అనే మాట రాలేదు. అలాగే మా డైరెక్టర్ కంట్రోలర్ హరీష్ కట్టా గారికి థాంక్స్. 14 రీల్స్ ప్లస్ బేనర్ నా సినిమాతో స్టార్ట్ అవడం సంతోషంగా ఉంది. ఒక వారం క్రితం పవన్‌కళ్యాణ్ గారిని కలిసి ట్రైలర్ చూపించాను. చాలా బాగుంది హరీష్ అన్నారు. ఎల్లప్పుడు నా మంచి కోరుకునే పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి దొరకడం నా అదృష్టం. ఈసినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అన్నారు.
హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ - '' మా హరీష్ పవన్ కళ్యాణ్ గారితో 'గబ్బర్‌సింగ్', సాయితేజ్‌తో 'సుబ్రహ్మణ్యంఫర్‌సేల్,' బన్నీతో 'డిజె', ఇప్పుడు వరుణ్ 'వాల్మీకి'తో సూపర్ హిట్ కొడుతున్నారు. వెంకటేష్ గారు ఈ ఫంక్షన్‌కి బ్లెస్ చేయడానికి వచ్చారంటే 'ఎఫ్2'లా ఈ సినిమాకు తిరుగు లేదు. అలాగే 14 రీల్స్ ఇందాక హరీష్ చెప్పినట్టు ఫ్యాషనేట్‌గా సినిమాలు తీయాలనే ఫ్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్. ఈ సెప్టెంబర్ 20కి 'వాల్మీకి' అందరికీ పెద్ద హిట్ అవుతుంది'' అన్నారు.
విక్టరి వెంకటేష్ మాట్లాడుతూ - ''వరుణ్ 'ఎఫ్2'లో నా కోబ్రా.. ఈ సినిమాలో పూర్తిగా లుక్ మార్చేశాడు. ట్రైలర్ చూడగానే టెర్రిఫిక్ అనుకున్నాను. గద్దల కొండ గణేష్ రేపు థియేటర్స్‌లో రచ్చ రచ్చే. 'వాల్మీకి' ఒక దొంగ మంచిగా మారి రామాయణం రాశారు. మరి ఈ 'వాల్మీకి' ఏం రాశాడు అనేది రేపు థియేటర్స్‌కి వెళ్లి చూడాలి. నాకు నమ్మకం ఉంది మా వరుణ్ రెచ్చిపోయి తప్పకుండా ఒక సూపర్ బ్లాక్ బస్టర్ ఇస్తాడు. హరీష్ శంకర్ నా స్నేహితుడు పవన్‌కళ్యాణ్‌కి 'గబ్బర్‌సింగ్' లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. తప్పకుండా మా వరుణ్‌కి ఇంకో సూపర్ హిట్ ఇస్తాడు. 14 రీల్స్ ప్రొడ్యూసర్స్ రామ్, గోపి నాతో 'నమో వెంకటేశ' సినిమా చేశారు. వెరీ ఫ్యాషనేట్ అండ్ హుంబుల్ ప్రొడ్యూసర్స్. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మంచి కలెక్షన్ రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ - '' ముందుగా ఈ గద్దల కొండ గణేష్‌ని ఆశీర్వదించడానికి వచ్చిన మా సింగిల్ హ్యాండ్ గణేష్ విక్టరి వెంకటేష్ గారికి స్పెషల్ థాంక్స్. 'వాల్మీకి' నా తొమ్మిదో సినిమా... ఫస్ట్ మాస్ సినిమా. ఫస్ట్ టైమ్ ఒక మాస్ సినిమా చేస్తే ఆ కిక్కే వేరు. చిరంజీవి గారు ఎప్పుడూ చెప్తుండేవారు మేము మాస్ సినిమాలు ఎందుకు చేస్తామో నీకు అర్ధం కావడం లేదు మాస్‌లో ఒక పవర్ ఉంటుంది అని. ఇప్పుడు అర్ధం అయింది. ఈ సినిమా అవడానికి ముఖ్య కారణం హరీష్ శంకర్ గారు. కళ్యాణ్ బాబాయ్ ఫ్యాన్స్ అందరిలాగా చాలా సంవత్సరాలు సరైన హిట్ ఎవరిస్తారు? అనుకున్నాను. 'గబ్బర్‌సింగ్' చూశాక ఇది సినిమా అనిపించింది. మా బాబాయ్‌కి అంత పెద్ద హిట్ ఇచ్చిన ఆయన నాతో చేయడం నిజంగా నా అదృష్టం. సెట్లో కూడా సూపర్ ఎనర్జీతో ఉంటారు. ఆయన సపోర్ట్. గైడెన్స్ వల్లే ఈ క్యారెక్టర్ ఇంత మంచిగా చేయగలిగాను. మా ప్రొడ్యూసర్స్ రామ్ ఆచంట, గోపి ఆచంట నాతో రెండు సంవత్సరాలుగా ట్రావెల్ అవుతున్నారు. ఫుల్ సపోర్ట్ చేసారు. వారితో నా ప్రయాణం కొనసాగుతుంది. అలాగే ఐనాంక బోస్ విజువల్స్ చాలా బాగున్నాయి. 'ముకుంద' సినిమా తర్వాత పూజతో అమేజింగ్ సీక్వెన్స్ డైరెక్ట్ చేశారు. స్పెషల్‌గా 'ఎల్లువొచ్చి గోదారమ్మ' సాంగ్ రీమిక్స్ చేశాం. చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో మిక్కీ ఫస్ట్ టైమ్ మాస్ అదరగొట్టాడు. అలాగే ఈ సినిమాలో నటించిన ఆర్టిస్ట్‌లకు, సాంకేతిక నిపుణులకు థాంక్స్. ముఖ్యంగా మీ ఫ్యాన్స్ అందర్నీ చూస్తుంటే మా కుటుంబం ఇక్కడే ఉన్నట్లు ఉంటుంది. డెఫినెట్‌గా సెప్టెంబర్ 20న 'వాల్మీకి' మీ అందరికీ నచ్చుతుంది ''అన్నారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అధర్వ మురళి, పూజ హెగ్డే, మృణాళిని రవి, డింపుల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, సినిమాటోగ్రఫీ: ఐనాంక బోస్, ఎడిటింగ్: ఛోటా కె.ప్రసాద్, ఫైట్స్: వెంకట్, ఆర్ట్: అవినాష్ కొల్ల, స్క్రీన్ ప్లే: మధు శ్రీనివాస్, మిథున్ చైతన్య,
లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా,నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట,దర్శకత్వం: హరీష్ శంకర్.ఎస్
This website uses cookies.