దర్శకుడు కట్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... చేతిలోన చెయ్యేసి చెప్పుబావ. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాతల సహకారంతో ఆఖరి షెడ్యూల్ జరుగుతుంది. ఈ సంవత్సరం ఆఖరికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలుచేస్తున్నారు. డిఫరెంట్ కాన్పెప్ట్‌తో తెరకెక్కిన ఈ కథ కొన్ని చిత్రాలను టచ్ చేస్తుంది. ఇద్దరు ప్రేమికులు చనిపోయిన వాళ్ళ ప్రేమను ఎలా బ్రతికించుకుంటారు అన్న నేపధ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో ఐదు పాటలు, ఏడు ఫైట్లు ఉన్నాయి. పార్ధశారధిగారు చాలా అద్భుతమైన పాటలను అందించారు. ఈ చిత్రంలో హీరోగా అరుణ్‌రాహుల్, ఆదిత్య ఓం నటించారు. హీరోయిన్‌గా బాంబే నుంచి రోహిణి, అంజనా పరిచయమవుతున్నారు. పోసాని కృష్ణ మురళి మంచి పాత్రలో నటిస్తున్నారు.ఈ చిత్రంలో విలన్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. గతంలో పెద్ద హీరోలతో నటించిన ఈ యన ఇందులోని నాలుగు ప్రధాన పాత్రలు విలన్ చుట్టూనే తిరుగుతాయి. ఆయన పేరు చలపతిరాజు. మా ఎంటైర్ టీమ్ కి థ్యాంక్స్ అని అన్నారు.
విలన్ చలపతిరాజు మాట్లాడుతూ... నా పేరు చలపతి ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటించాను. ప్రొడ్యూసర్‌గారు నా దగ్గర ఒక కథ ఉంది మంచి డైరెక్టర్ ఉంటే చూడమన్నారు. నా బెస్ట్ ఫ్రెండ్ అయిన రాజేంద్రప్రసాద్‌ని పరిచయం చేశాను. కథ చాలా బావుంది త్వరగా రెడీ చేద్దామన్నారు. ఈ చిత్ర షూటింగ్ మొత్తం తూప్రాన్, హైదరాబాద్, ఎన్టీఆర్ ఘాట్ వద్ద షూటింగ్ జరిగింది. ఇలాంటి ప్రొడ్యూసర్లు దొరకడం మా అదృష్టం. ముందుగా వాళ్ళకు కృతజ్ఞతలు. ఈ చిత్రంలో నటీనటులందరూ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాతో మంచి నటనను చేయించిన మా డైరెక్టర్‌గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.
ప్రొడ్యూసర్ రాజేష్ మాట్లాడుతూ... ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులందరూ చాలా బాగా నటించారు. మా సినిమాని అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఆదిత్య ఓం మాట్లాడుతూ... చాలా కాలం తర్వాత ఓ మంచి చిత్రంతో మీ ముందుకు వస్తున్నా. ఇది ఒక మంచి ఎంటర్‌టైన్మెంట్ చిత్రం. నాకుఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ చిత్రంలో కామెడీ, హారర్, లవ్ అన్నీ ఉన్న కమర్షియల్ చిత్రమిది. ఇది చాలా మంచి సక్సెస్ సాధిస్తుందని నమ్ముతున్నాను. ఈ మూవీ ద్వారా విలన్ పాత్రలో నటించే చలపతిగారితో పరిచయం కావడం ఆనందంగా ఉంది. అందరూ మా సినిమాని చూసి ఎంకరేజ్ చెయ్యాలని కోరుకుంటున్నాను అన్నారు.
హీరో అరుణ్ రాహుల్ మాట్లాడుతూ... నందిని సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు నేను సుపరిచితుడినే. ఇప్పుడు ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాను. ఒకరోజు డైరెక్టర్‌గారు నాకు ఫోన్ చేసి ఈ చిత్రం గురించి చెప్పారు. తెలుగు ఇండస్ట్రీ చాలా ఫ్యామస్. చాలా మంచి ఎంటర్‌టైన్మెంట్ అందరూ చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.
హీరోయిన్ రోహిణి పూజ మాట్లాడుతూ... నా పేరు రోహిణి పూజ ముంబయి నుంచి వచ్చాను. ఇది చాలా మంచి ఎంటర్‌టైనింగ్ మూవీ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ చిత్రంలో ఫైట్స్, లవ్, రొమాన్స్ అన్నీ ఉన్న మూవీ ఇది అని అన్నారు.
ప్రొడ్యూసర్ దేవదాస్ మాట్లాడుతూ... నేనురాజేష్‌గారి బ్రదర్‌ని మాది ఇంజనీరింగ్ ఫ్యామిలీ. సినిమాల పైన ఆశక్తితో ఈ చిత్రాన్ని తియ్యడం జరుగుతుంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా అద్భుతంగా ఈ సినిమాని తీశాం. ఇందులో నటించిన నటీనటులందరూ చాలా కష్టపడ్డారు అందరికీ నా కృతజ్ఞతలు అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు.