చాలా మంచి మెసేజ్, ఎమోషన్స్‌తో తెరకెక్కించిన `కౌసల్యకృష్ణమూర్తి` సినిమా చాలా బావుంది - బాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ పి.వి.సింధు
`కౌసల్యకృష్ణమూర్తి` మంచి మెసేజ్‌తో తెరకెక్కిన సెన్సిటివ్ మూవీ - పుల్లెల గోపీచంద్
బాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ పి.వి.సింధు మాట్లాడుతూ - సినిమా చూశాను. చాలా బావుంది. అమ్మాయిలు బయటకొచ్చి వారేంటి? ఎలా నిరూపించుకున్నారు? అన్న అంశాలను ఈ సినిమాలో చూపించారు. మరో పక్క రైతు సమస్యలను ఎవరూ పెద్దగా పట్టించుకోరు? చిన్నగానే చూస్తారు. కానీ అలాంటి రైతుల సమస్యలను గుర్తించాలని ఈ సినిమాలో చూపించారు. మనం ఈరోజు తింటున్నామంటే కారణం రైతులే. అమ్మాయిలు నమ్మకంతో ముందుకొచ్చి క్రికెట్ ఆడటం అనే విషయంతో పాటు రైతుల విలువేంటి? అనే మెసేజ్‌ను ఈ చిత్రం ద్వారా ఇచ్చారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని నిజం చేయడానికి కౌసల్య ఎంత కష్టపడిందో ఈ సినిమాలో మనం చూడొచ్చు. చాలా మంచి మెసేజ్, ఎమోషన్స్ ఉన్న సినిమా. ఐశ్వర్యా రాజేష్ చాలా నేచురల్ నటించడమే కాదు.. చాలా హార్డ్‌వర్క్ చేసింది
అన్నారు.
పుల్లెలగోపీచంద్ మాట్లాడుతూ - ```కౌసల్య కృష్ణమూర్తి` సినిమా చాలా బాగా నచ్చింది. ఆడపిల్లల ఎదుగుదలకు తల్లిదండ్రుల సపోర్ట్ ఎంతో అవసరం. ఈ సినిమాలో కూడా దాన్ని చక్కగా చూపించారు. చాలా సెన్సిటివ్ మూవీ. సినిమాను చక్కగా చూపించారు. సినిమాను ఎంటర్‌టైనింగ్‌గా మంచి మెసేజ్‌తో, టీమ్‌తో చేశారు`` అన్నారు.
చిత్ర సమర్పకుడు కె.ఎస్.రామారావు మాట్లాడుతూ - భారతదేశం గర్వించదగ్గ క్రీడాకారిణి పి.వి.సింధు. ఆమె మా `కౌసల్యకృష్ణమూర్తి` సినిమాను చూడటం నిజంగా మాకు గర్వంగా ఉంది. ఇలాంటి సినిమాలను చూసి అభినందించినప్పుడు ఆడపిల్లల్ని తల్లిదండ్రులు ఎక్కువగా ప్రోత్సహిస్తారు
అన్నారు.
భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ - మా `కౌసల్యకృష్ణమూర్తి` స్పోర్ట్స్‌కు సంబంధించిన చిత్రం కావడంతో సినిమాను అందరూ చూసి అభినందిస్తున్నారు. పి.వి.సింధు, పుల్లెల గోపీచంద్, చాముండేశ్వరి నాథ్ వంటివారు మా సినిమాను చూడటం చాలా ఆనందంగా ఉంది. మంచి ఎమోషన్స్ ఉన్న ఇన్‌స్పిరేషనల్ చిత్రమిది. సినిమాను ఎంకరేజ్ చేస్తున్న అందరికీ థ్యాంక్స్
అన్నారు.