Nani’s Gang Leader Movie Trailer Entertains

'నేనింకా థ్రిల్లర్‌ జోనర్‌లోనే ఉన్నాను..
సైకో కిల్లర్‌ జోనర్‌లోకి వెళ్లేలోపు మొదలెట్టేద్దాం..'
ట్రైలర్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్న 'నాని'స్‌ గ్యాంగ్‌ లీడర్‌' - సెప్టెంబర్‌ 13 విడుదల

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం 'నాని'స్‌ గ్యాంగ్‌ లీడర్‌'. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రివెంజ్‌ రైటర్‌ పెన్సిల్‌గా ఈ సినిమాలో నాని ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కి, పాటలకు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆడియన్స్‌లో క్యూరియాసిటీని క్రియేట్‌ చేసే డైలాగ్స్‌, ఎంటర్‌టైన్‌ చేసే సన్నివేశాలు, ఆకట్టుకునే సిట్యుయేషన్స్‌ ఈ ట్రైలర్‌లోని విశేషాలు. 'మా రైటర్స్‌ ప్రపంచం అంటే ఇంతే.. పుస్తకాలతో నిండిపోయి ఉంటుంది. ఆకలేస్తే అక్షరాలు తింటాం.. చలేస్తే పుస్తకాలు కప్పుకుంటాం..', 'యుద్ధానికి సిద్ధం కండి... సమరశంఖం నేనూత్తాను', 'నేనింకా థ్రిల్లర్‌ జోనర్‌లోనే ఉన్నాను.. అంటూ నాని చెప్పే డైలాగ్స్‌ చాలా బాగున్నాయి. ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్న కార్తికేయ లుక్‌ కూడా బాగుంది. నాని, కార్తికేయలతో చేసిన యాక్షన్‌ సీక్వెన్స్‌ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. లక్ష్మీ, శరణ్య, ప్రియాంక తదితరులతో కూడిన గ్యాంగ్‌తో నాని చేసిన సీన్స్‌ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయి.

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌, మాటలు: వెంకీ, రచనా సహకారం: ముకుంద్‌ పాండే, పొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, వి.ఎఫ్‌.ఎక్స్‌.: మకుట, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌, స్టిల్స్‌: జి.నారాయణరావు, కో-డైరెక్టర్‌: కె.సదాశివరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%