Social News XYZ     

Marshal Movie Audio Released

అట్టహాసంగా మార్షల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ

Marshal Movie Audio Released

Marshal Movie Audio Released (Photo:SocialNews.XYZ)

అభయ్, మేఘా చౌదరి జంటగా నటించిన చిత్రం ‘మార్షల్’. హీరో శ్రీకాంత్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని హీరో అభయ్ తన సొంత బ్యానర్ లోనే నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జై రాజాసింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబరు 19 న విడుదలవుతోంది. ఈ చిత్రం ఆడియో, టీజర్ అవిష్కరణ ఇటీవలే గుంటూరులో జరిగింది.

 

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అంబటి రాంబాబు హాజరై... ఆడియోను ఆవిష్కరించారు. ఆయనతో పాటు షేక్ మహమ్మద్ ముస్తఫా, మద్దాలి గిరి, వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అప్పిరెడ్డి, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం, ముస్తఫా మరియు మద్దాల గిరి, బోనబోయిన శ్రీనివాసయాదవ్, నిమ్మకాయల రాజా నారాయణ, చిత్ర లోని హీరోయిన్ మేఘన చౌదరి, డైరెక్ట్ జై రాజాసింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆడియో సీడీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ ‘హీరో అభయ్ కథానాయకుడిగా.. నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించి... తన జన్మస్థలమైన గుంటూరులోనే ఆడియో ఆవిష్కరణ వేడుక జరుపుకోవడం ఎంతో సంతోషకరం. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు.

"కె జి ఎఫ్" మ్యూజిక్ ఫేమ్ రవిబసురి తెలుగు సినిమా మార్షల్ సినిమా కంటెంట్ ప్రత్యేకంగా నచ్చి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ఈ సినిమాలో రీ రికార్డింగ్ తో పాటు 2 పాటలను సమకూర్చాడు

నిర్మాత, హీరో అభయ్ అడకా మాట్లాడుతూ ‘నేను పుట్టి పెరిగిన గుంటూరులో నా తొలిచిత్రం ఆడియో ఫంక్షన్ ను ఇంత మంది పెద్దల సమక్షంలో చేయడం ఆనందంగా వుందన్నారు. ఇదో వైవిద్యభరితమైన చిత్రం. మార్షల్ తో ఓ మంచి మెసేజ్ ఇవ్వబోతున్నాం. ప్రతి ఒక్కరికీ నచ్చుతుంద’ని తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ ’సినిమా అన్ని తరహాలవారికి నచ్చేలా ఉంటుందని. నిర్మాత మరియు హీరో అభయ్ అడకా పాత్ర ఎంతో హుందాగా, నూతనంగా ఉంటుందని వివరించారు. సినీ హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో ఒక మరచిపోలేని పాత్రకు ప్రాణం పోశారని చెప్పారు.
ఆర్.యం.స్వామి సినిమాటోగ్రఫీ , సంగీతం, యాదగిరి వరికుప్పల, ఫైట్స్ , నాభ మరియు సుబ్బు , ఎసెట్స్ గా నిలుస్థాయి. నిర్మాత ఈ సినిమా ప్రారంభం నుంచి మాకు ఎంతో సపొర్ట్ చెస్తూ వచ్చారని’ తెలిపారు.

ఈ కార్యక్రమంలోని నటీనటులు కల్పవల్లి జబర్దస్త్ టీం అప్పారావు, నవీన్, ప్రొడ్యూసర్ వెంకటేశ్వర రావు, శ్రీనివాస రావు, సంగీత దర్శకులు యాదగిరి, గణేష్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు

అభయ్ , శ్రీకాంత్, మేఘా చౌదరి, రష్మి సమాంగ్, సుమన్, వినోద్ కుమార్, శ రణ్య,  పృద్విరాజ్, రవి ప్రకాష్, ప్రియ దర్శిని రామ్, ప్రగతి, కల్ప వల్లి,
సుదర్శన్, తదితరులు నటించిన

ఈ చిత్రానికి సంగీతం: యాదగిరి వరికుప్పల
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : కె.జీ.ఎఫ్ ఫేమ్ రవి బసురి
ఛాయాగ్రాహకుడు : స్వామి ఆర్ యమ్,
మాటలు : ప్రవీణ్ కుమార్ బొట్ల ,
ఫైట్స్ : నాభ మరియు సుబ్బు
ఎడిటర్ : చోట కె ప్రసాద్,
పాటలు : యాదగిరి వరికుప్పల,
కళా దర్శకుడు : రఘు కులకర్ణి,
డాన్స్ మాస్టర్ : గణేష్
ప్రోడక్షన్ కంట్రోలర్ : చిన్న రావు ధవళ
నిర్మాత : అభయ్ అడకా

Facebook Comments