Starring Drushyam fame Esther Anil, Vangaveeti fame Naina Ganguly as female leads, prominent character Artist Eshwari Rao is said to be seen in a very important role.
As the team wrapped up the entire shoot and moving on to post-production works, makers decided to unveil a Pre-look today.
Featuring the lead characters on a stamp-like poster with a caption saying, "History is a set of lies agreed upon" movie team seems to portray that the entire story will revolve around 5 lives with 4 stories affected by 1 strong decision or a superior lie.
Speaking on the insights of the movie, director Teja Marni said, "I've worked in Director Ram Gopal Varma's direction team for 'Vangaveeti' & been part of the writer's team of 'Bahubali' fame Vijayendra Prasad garu. 'Johar' is my first movie as Director and it's going to be an emotionally twisted anthology driven story that runs mainly around 5 characters/lives set to be completely different and engaging throughout the film. Wrapping up the shooting schedule in Varanasi, Rajahmundry, Kakinada & Vizag, we're now speeding up the post-production works to release the movie soon.
Coming to my Johar's team, Bhairava Geeta director Siddharth has worked as an editor, Cinematography donned by Trisha's Nayaki & Bhairava Geeta fame Jagadeesh, Popular writer Chaitanya Prasad gave dialogues, while Rakshasudu, Jeorge Reddy's Art director Gandhi has headed Art Department for us."
Casting: Esther Anil, Rohini, Subhaleka sudhakar, Eshwari Rao, Naina Ganguly, Ankith Koyya, Chaitanya Krishna, CVL.
Technicians: Banner - Dharma Surya Pictures Producer - Bhanu Sandeep Marni Director - Teja Marni Dop - Jagadeesh cheekati Music - Priyadarshan Editor - Siddharth Thatholu Art - Gandhi Lyrics - Chaitanya prasad Poster - Anil Bhanu Executive producer - Anil Bikinna, Kalyan M, Raghavendra chowdary.
పొలిటికల్ సెటైర్ గా ‘జోహార్’
ధర్మ సూర్య పిక్చర్స్ పతాకంపై తేజ మార్ని దర్శకత్వంలో భాను సందీప్ మార్ని నిర్మాతగా రూపొందుతోన్న ఎమోషనల్ డ్రామా ’జోహార్`. ‘దశ్యం’ చిత్రంలో వెంకటేశ్ కూతురిగా నటించిన ఈస్తర్ అనిల్ ఇందులో హీరోయిన్‌గా నటించారు. ‘వంగవీటి’ ఫేమ్ నైనా గంగూలీ మెయిన్ హీరోయిన్‌గా నటించారు. తనదైన నటనతో ఎన్నో చిత్రాల్లో మెప్పించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈశ్వరీరావు ఈ చిత్రానికి బ్యాక్‌బోన్‌లాంటి పాత్రలో నటించారు. రోహిణి, శుభలేఖ సుధాకర్, చైతన్యకృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమా ప్రీ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా...
దర్శకుడు తేజ మార్ని మాట్లాడుతూ ‘‘నేను ప్రముఖ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మగారి వద్ద ‘వంగవీటి’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేశాను. అలాగే ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌గారి వద్ద రచనా విభాగంలో పనిచేశాను. డైరెక్టర్ గా నా తొలి చిత్రమిది. ‘జోహార్’ చిత్రం పొలిటికల్ సెటైర్‌గా రూపొందుతోన్న ఎమోషనల్ డ్రామా. షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమా ప్రధానంగా ఐదు పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఐదు పాత్రలు అద్భుతంగా ఆకట్టుకుంటాయి. డిఫరెంట్‌గా ఉంటాయి. వారణాసి, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరించాం. ‘భైరవగీత’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సిద్ధార్థ్ ఈ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేశారు. త్రిష ‘నాయకి’, ‘భైరవగీత’ చిత్రాలకు వర్క్ చేసిన జగదీశ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్యప్రసాద్ పాటలు రాశారు. ‘ రాక్షసుడు’, ‘జార్జిరెడ్డి’ చిత్రాలకు పనిచేసిన గాంధీ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు’’ అన్నారు.
నటీనటులు:
ఈస్తర్ అనిల్, రోహిణి, శుభలేఖ సుధాకర్, ఈశ్వరీ రావు, నైనా గంగూలీ, అంకిత్ కొయ్య, చైతన్య కృష్ణ, సి.వి.ఎల్
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: ధర్మ సూర్య పిక్చర్స్, నిర్మాత: భాను సందీప్ మార్ని, దర్శకత్వం: తేజ మార్ని, కెమెరా: జగదీశ్ చీకటి, మ్యూజిక్: ప్రియదర్శన్, ఎడిటింగ్: సిద్ధార్థ్ తాతోలు, ఆర్ట్: గాంధీ, పాటలు: చైతన్య ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అనిల్ బిక్కిన , కల్యాణ్.ఎం, రాఘవేంద్ర చౌదరి,