Social News XYZ     

Thanks to producer Koneru Satyanarayana for giving success with Rakshasudu: Bellamkonda Sai Sreenivas

`రాక్షసుడు` వంటి హిట్ మూవీ ఇచ్చిన కొనేరు సత్యనారాయణగారికి థ్యాంక్స్ - బెల్లంకొండ శ్రీనివాస్

Thanks to producer Koneru Satyanarayana for giving success with Rakshasudu: Bellamkonda Sai Sreenivas

Thanks to producer Koneru Satyanarayana for giving success with Rakshasudu: Bellamkonda Sai Sreenivas (Photo:SocialNews.XYZ)Bellamkonda-Sai-Sreenivas-and-Anupama-Parameswaran-s-Rakshasudu-Movie-success-celebrations-Gallery-66.jpg

యంగ్‌ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా రైడ్‌, వీర చిత్రాల ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ పెన్మ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో ఏ స్టూడియోస్‌, ఎ హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై కొనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా రూపొందిన చిత్రం రాక్షసుడు. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగాఆగ‌స్ట్ 2న విడుద‌ల చేశారు. సినిమా సూపర్ హిట్ టాక్‌తో సక్సెస్‌పుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...

 

దర్శకుడు రమేశ్ వర్మ మాట్లాడుతూ - కొనేరు సత్యనారాయణగారు ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకుని నాతో డైరెక్ట్ చేయాలనుకోగానే, చాలా మంది అతను డిజాస్టర్ తీసే రెండేళ్లు అవుతుంది. అతనితో ఎందుకీ సినిమా అని కూడా అన్నారు. సరే.. సార్ నిర్ణయం కోసం వెయిట్ చేశాను. ఆయనేమో `రమేష్ నేను నువ్వు డైరెక్ట్ చేసిన రైడ్ సినిమా చూశాను. ఆ టెంపో నాకు ఎంతో నచ్చింది. నువ్వే ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేస్తున్నావ్. ఇది కూడా మంచి టెంపోలో ఉన్న సినిమా. దీన్ని మంచి టెంపోలో నువ్వు డైరెక్ట్ చేస్తావని నాకు తెలుసు. ఏమీ చేంజ్ చేయకుండా అలాగే తీస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పారు. ఆయన అంత కాన్ఫిడెన్స్ ఇచ్చి ఉండకపోతే నేను చేసి ఉండేవాడిని కాదేమో. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన వాళ్లలో ఫస్ట్ సాయిశ్రీనివాసే కారణం. ఇంతకు ముందు సాయి నటించిన సినిమాల్లో ఫుల్ డ్యాన్సులు, ఫైట్స్ ఉండేవి. కానీ ఈ సినిమాలో అలాంటివేమీ ఉండవు. కానీ సాయి నమ్మకంతో ఎంతో ఇన్వాల్‌మెంట్‌తో సినిమా చేశాడు. నాపై నమ్మకంతో సినిమా చేసిన కొనేరు సత్యనారాయణగారికి, సాయిశ్రీనివాస్‌గారికి రుణపడి ఉంటాను. అలాగే బెల్లంకొండ సురేశ్‌గారికి కూడా పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే ఆయన నాకు పెద్ద బడ్జెట్ సినిమా చేయమని అన్నారు. కానీ నేను ఈ సినిమాను సెలక్ట్ చేసుకున్నాను. అప్పుడు సత్యనారాయణగారు వచ్చి `ఎంత ఖర్చు అయినా పర్లేదు. బాగా చెయ్` అని స్వేచ్ఛనిచ్చారు. నేను భయపడిందంతా ఒకే విషయానికి.. ఈ సినిమా తమిళంలో చాలా పెద్ద హిట్. తెలుగులో దాన్ని చక్కగా చేస్తే చాలు అని అనుకున్నాను. సినిమా చూసిన వాళ్లందరూ బాగా చేశారని చెబితే చాలు అని అనుకున్నాను. మూడు రోజులుగా ఫుల్ టెన్షన్ పడ్డాను. సినిమా చూసిన తర్వాత నా శ్రీమతి ఫోన్ చేసి `మీరు బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు` అని చెప్పింది. అలాగే బెల్లంకొండ సురేశ్‌గారు ఫోన్ చేసి `మా అబ్బాయికి బ్లాక్‌బస్టర్ ఇచ్చావని అప్రిషియేట్ చేశారు. నా సక్సెస్‌లో భాగమైన అందరికీ థ్యాంక్స్ అన్నారు.

సినిమాటోగ్రాఫర్ వెంకట్ మాట్లాడుతూ - మంచి రివ్యూస్ ఇచ్చారు. సినిమా చూసిన వాళ్లందరూ సినిమా బావుందని అప్రిషయేట్ చేశారు. డైరెక్టర్ వర్మగారికి థ్యాంక్స్. ఈ క్రెడిట్ అంతా రమేశ్ వర్మగారికి, నిర్మాత కొనేరు సత్యనారాయణగారికే దక్కుతుంది. అందరికీ థ్యాంక్స్ అన్నారు.

మల్టీ డైమన్షన్ వాసు మాట్లాడుతూ - టైమ్ ఫర్ సెలబ్రేషన్స్. ఓ నమ్మకంతో పనిచేస్తే.. ఎంత మంచి రిజల్ట్ వస్తుందో ఈ సినిమా రుజువు చేసింది. తమిళంలో బ్లాక్ బస్టర్ సినిమా `రాక్షసన్`ను తెలుగులో రీమేక్ చేయడం పర్ఫెక్ట్‌గా ప్లాన్ ప్రకారం ముందుకువెళ్లారు. అందరూ రాత్రి పగలు కష్టపడ్డాం. అన్నీ డిపార్ట్‌మెంట్స్ ఎంతో హార్డ్ వర్క్ చేశారు. మా కష్టానికి తగ్గ ఫలితాన్ని ప్రేక్షకులు ఇవ్వడంతో హ్యాపీగా ఉన్నాం. ముందు సాయిని అభినందించాలి. తను కమర్షియల్ హీరో. తన ఇమేజ్‌ను పక్కన పెట్టి కంటెంట్ బేస్ సినిమా చేయడానికి అంగీకరించినప్పుడే సక్సెస్ డిసైడయ్యింది. లుక్ నుండి ప్రతి విషయంలో ఎంతో కేర్ తీసుకుని చేశారు. డైరెక్టర్ రమేశ్‌వర్మగారు తమిళ్ కంటే బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వాలని ఎంతగానో ప్రయత్నించాడు. బెస్ట్ మూవీనిచ్చాడు. అభిషేక్ పిక్చర్స్ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు అన్నారు.

అభిషేక్ నామా మాట్లాడుతూ - రమేశ్ వర్మ దర్శకత్వంలో సాయితో ఓ బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ ప్లాన్ చేశాం. ఆ సమయంలో రాక్షసన్ సినిమా హక్కులు కొన్నారని తెలిసింది. ఆయనతో రెండు, మూడు నెలలు పాటు ట్రావెల్ చేశాం. రమేశ్ వర్మపై ఆయన నమ్మకంతో ఈ సినిమాను ఇచ్చారు. ఓ కసితో ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. అలాగే సాయికూడా ఈ సినిమాతో హిట్ కొట్టాలని వెయిట్ చేశాడు. మామూలు వర్షమే కాదు.. కలెక్షన్స్ వర్షం కూడా పడుతుంది. ఓవర్‌సీస్‌లో 120 స్క్రీన్స్‌లో ఈ సినిమాను రిలీజ్ చేశాం. ఇది ఓవర్‌సీస్‌లో తనకు బిగ్గెస్ట్ రిలీజ్. కొనేరు సత్యనారాయణ పట్టుదలగా మమ్మల్ని నడిపించారు. సాయికి ఇలాగే హిట్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈ ఏడాది ఈ సినిమానే బిగ్గెస్ట్ థ్రిల్లర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ - ఈరోజు నాకు చాలా మెమొరబుల్ డే. మార్నింగ్ నిద్ర లేవగానే ఓవర్‌సీస్ నుండి మా కజిన్స్ ఫోన్ చేశారు. అందరూ సినిమా గురించి పాజిటివ్‌గా చెప్పారు. ఆ పాజిటివ్ వైబ్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఈ రోజు కోసం రెండేళ్లుగా వెయిట్ చేస్తున్నాను. ఇంత మంచి హిట్ ఇచ్చిన సత్యనారాయణగారికి జన్మంతా రుణపడి ఉంటాను. ఈ సినిమా రైట్స్ కోసం పెద్ద పెద్ద నిర్మాతలు పోటీ పడ్డారు. సత్యనారాయణగారు ఖర్చుకు వెనకాడకుండా రైట్స్‌ను కొని మాపై నమ్మకంతో మాకు ఇవ్వడమే బిగ్గెస్ట్ సక్సెస్ అని భావిస్తున్నాను. సత్యనారాయణగారి బ్యానర్‌లో తొలి సినిమా చాలా పెద్ద హిట్ కొట్టారు. వేల మందికి ఆయన విద్యాదానం చేశారు. ఇప్పుడు మా ఇండస్ట్రీలో ఫ్రొఫెషనల్ పరంగా అక్యూపెషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆయనతో పనిచేసినందుక హ్యాపీ. మళ్లీ మళ్లీ ఆయనతోనే పనిచేయాలని కోరుకుంటున్నాను. సత్యనారాయణగారు ప్రేమించి సినిమాను తీశారు. ఎంటైర్ టీమ్ ఎంతో కష్టపడింది. ఈసినిమాలో పార్ట్ అయినందుకు హ్యాపీగా ఉంది. అనుపమ, రాజీవ్‌గారికి, జిబ్రాన్ సహా అందరికీ థ్యాంక్స్. కమర్షియల్ హిట్టే కాదు.. క్రిటిక్స్ దగ్గర నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అభిషేక్ గారితో ఎప్పటి నుండో మంచి అనుబంధం ఉంది. ఆయన ఇక్కడే కాదు.. ఓవర్‌సీస్‌లోనూ బిగ్గెస్ట్ రిలీజ్ చేశారు. ఆయనకు థ్యాంక్స్ అన్నారు.

 

Facebook Comments