Social News XYZ     

Dwayne Bravo’s Docu Feature Men Take Lead First Look Poster

The world-famous West Indies cricketer Dwayne Bravo has collaborated with renowned production company People Media Factory and ANT productions to make a social awareness film. People Media Factory has garnered abundant fame in less span of time with its extraordinary film making.
Entertainment is always been our priority, but also, we have believed in interesting films and genres. We always wanted to tell interesting stories like Wife of Ram, Goodachari, and Oh Baby. We continue to make movies with exceptional stories, the line up of movies which include the most awaited film in Telugu Venky Mama and International film Silence. As a part of our contribution to society, we bring this much-needed film of the hour "Men Take Lead".

Dwayne Bravo has released the poster of a short film where he plays a key role, posted in his FB account

Happy to reveal the poster of "Men Take Lead" my upcoming docu-feature. I always wanted to help the young girls and women in my country and elevate the quality of their lives. So excited that it is becoming a reality through this social awareness film. Dedicating this film to all the women around the world. New Beginnings!!! #Menstrualhygiene #womenshealth #periodpoverty
#itsnottattaboo#MHM #Champion #WakeUp #RunDWorld. #People Media Factory

 

As a part of corporate social responsibility(CSR), the People Media Factory has teamed up with West Indies cricketer Dwayne Bravo and producing this movie. Arthi Srivastava will be directing the film. The documentaries Land of Widows and White Knight, helmed by her bagged many awards at International Film Festivals. Now the film is being made to educate women on the matter of cleanliness.
Director Arti Srivastava said, ‘the film was shot in Tamil Nadu in July. The shooting in India has been completed. We will be shooting in Trinidad and Tobago in the West Indies in August.

Producer-TG Viswa Prasad, Co-Producer - Vivek Kuchibhotla, Executive Producer - Sri Nataraj, Project Design and Execution-ANT Productions

షూటింగ్ జరుపుకుంటున్న ప్రపంచ ప్రఖ్యాత వెస్ట్ ఇండీస్ క్రికెట్ ఆటగాడు
డ్వేన్ బ్రావో తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం

ప్రపంచ ప్రఖ్యాత వెస్ట్ ఇండీస్ క్రికెట్ ఆటగాడు డ్వేన్ బ్రావో తో ప్ర‌ముఖ నిర్మాణ‌ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోష‌ల్ అవేర్నేష్ ఫిల్మ్ ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. కేవ‌లం ఎంట‌ర్ టైన్మెంట్ మూవీస్ మాత్ర‌మే కాకుండా... అన్ని ర‌కాల జోన‌ర్స్ లో విభిన్న క‌థా చిత్రాల‌ను అందించాల‌నేదే పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఉద్దేశ్యం. అందులో భాగంగానే 'ఎం.ఎల్.ఎ, వైఫ్ ఆఫ్ రామ్, గూఢ‌చారి, ఓ..బేబి...ఇలా వైవిధ్య‌మైన, విజ‌య‌వంత‌మైన చిత్రాలు నిర్మించి అన‌తి కాలంలోనే అటు ఆడియ‌న్స్ లో, ఇటు ఇండ‌స్ట్రీలో అభిరుచి గ‌ల నిర్మాణ సంస్థ‌గా మంచి గుర్తింపు ఏర్పరుచుకుంది పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ. ప్ర‌స్తుతం విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య‌ల క్రేజీ కాంబినేష‌న్ లో భారీ మ‌ల్టీస్టార‌ర్ 'వెంకీ మామ' చిత్రాన్ని, అలాగే అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో 'నిశ్శ‌బ్దం' అనే ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీని కూడా నిర్మిస్తుంది.

అయితే... కేవలం వ్యాపార దృక్పథమే కాకుండా, సామాజిక స్పృహ కు సంబంధించిన విషయాలలో కూడా ప్రజలలో అవగాహన కల్పించాల‌నే స‌దుద్దేశ్యంతో సోష‌ల్ అవేర్నెస్ ఫిల్మ్స్ ను నిర్మిస్తున్నారు సంస్థ నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల. ఈ నిర్మాణ సంస్థ‌తో ఎ.ఎన్.టి ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ క‌లిసి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా సోష‌ల్ అవేర్న‌ష్ ఫిల్మ్ ను నిర్మిస్తోంది.

‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)’ లో భాగంగా వెస్ట్ ఇండీస్ క్రికెట‌ర్ డ్వేన్ బ్రావోతో క‌లిసి ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ మూవీకి ఆర్తి శ్రీవాత్స‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆమె ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ల్యాండ్ ఆఫ్ విడోస్ మరియు వైట్ నైట్ ఈ రెండు డాక్యుమెంట‌రీస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్ లో అవార్డులు గెలుచుకున్నాయి. ఇప్పుడు మ‌హిళల‌కు శుభ్ర‌త విష‌యంలో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు గాను ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

డ్వేన్ బ్రావో తన అధికారిక సోషల్ మీడియా ఖాతా అయినా పేస్ బుక్ లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.

ఈ చిత్ర విశేషాల‌ను ద‌ర్శ‌కురాలు ఆర్తి శ్రీవాత్స‌వ తెలియ‌చేస్తూ...డ్వేన్ బ్రావోతో క‌లిసి ఈ సినిమాని నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగాను, గ‌ర్వంగాను ఉంది. జులైలో త‌మిళ‌నాడులో షూటింగ్ జరిగింది. దీంతో ఇండియ‌లో షూటింగ్ పూర్త‌య్యింది. ఆగ‌ష్టులో వెస్ట్ ఇండీస్ లోని ట్రినిడాడ్, టోబాగో ల‌లో షూటింగ్ చేయ‌నున్నాం అని చెప్పారు.

ఈ మూవీకి నిర్మాత - టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, కో - ప్రొడ్యూస‌ర్ - వివేక్ కూచిభోట్ల‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - శ్రీ న‌ట‌రాజ్, ప్రాజెక్ట్ డిజైన్ & ఎగ్జిక్యూష‌న్ - ఎ.ఎన్.టి ప్రొడక్ష‌న్స్.

Facebook Comments
Dwayne Bravo's Docu Feature Men Take Lead First Look Poster

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz