Social News XYZ     

Burning Star Sampoornesh Babu’s Kobbari Matta Trailer Gets Excellent Response

బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు "కొబ్బ‌రి మ‌ట్ట" ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్

 

హృద‌య‌కాలేయం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో, కాలేయం లో త‌న స్థానాన్ని టెంట్ వేసుకుని ప‌డుకున్న బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభిన‌యంలో హృద‌య‌కాలేయం సృష్టిక‌ర్త స్టీవెన్ శంక‌ర్ అందించిన క‌థ‌, క‌థ‌నం, మాట‌లతో కొబ్బ‌రిమ‌ట్ట అనే చిత్రాన్ని తీయాల‌న్న ఆలోచ‌న‌తో ముందుకు వ‌చ్చిన రూప‌క్ రొనాల్డ్ స‌న్ ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ.. సున్నిత‌మైన క‌థ‌ల‌తో చిత్రాలు నిర్మించి ప్రేక్ష‌కులకి గిల్లిక‌జ్జాలు పెట్టే సాయి రాజేష్ నిర్మాత‌గా దాదాపు 3 సంవ‌త్స‌రాల‌కు పైగా అత్యాధునికమైన సాంకేతిక నిపుణుల‌తో నిపుణుల పర్య‌వేక్ష‌ణ‌లో భారీ వ్యయం తో ఎక్కాడా కాంప్ర‌మైజ్ కాకుండా ఎండ‌న‌కా, వాన‌న‌కా, చ‌లిని సైతం త‌ట్టుకుని ప్రేక్ష‌కుడికి వినోదాన్ని అందించాల‌నే నిరంత‌ర కృషితో క‌సి తో చేసిన చిత్రం కొబ్బ‌రి మ‌ట్ట‌. ఇక ఈ చిత్రం ట్రైలర్ రికార్డులు సృష్టిస్తోంది. ఈ నాన్ స్టాప్ ట్రైలర్ పై వస్తున్న కామెంట్స్, స్పందన అద్భుతంగా ఉందని చిత్రం యూనిట్ చెబుతోంది.

 

ఈ చిత్రంలో బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మూడు పాత్ర‌లు వేయ‌ట‌మే కాకుండా అత్యంత భారీ డైలాగ్‌లు చెప్పి లిమ్కా బుక్ ఆప్ వ‌ర‌ల్డ్ రికార్డు ని నెల‌కొల్పాడు.. ఈ చిత్రం లో పాపారాయుడు, పెద‌రాయుడు, ఆండ్రాయుడు లాంటి అత్య‌ద్బుత‌మైన‌ పాత్ర‌లు చేసి మెప్పించ‌బోతున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం లో తెలుగు సినిమా లో వున్న న‌టీన‌టులంద‌రూ న‌టించారు. ఈ సినిమా కి సంబంధించి ఇటీవ‌ల విడుద‌ల చేసిన అఆ.. ఇఈ అనే సాంగ్ యూట్యూబ్ లో రెండు మిలియ‌న్స్ వ్యూస్ 24 గంట‌ల్లో రావ‌టం ఈ చిత్రం పై సినిమా ల‌వ‌ర్స్ కి వున్న క్రేజ్ ని తెలియ‌జేస్తుంది. ఈ భారీ చిత్రాన్ని అగ‌ష్టు 10 న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌టానికి నిర్మాత భారీ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.. ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్‌టైన్ చేయ‌టంలో ఎక్క‌డా బారీయ‌ర్స్ లేని ఇంత‌టి క్రేజి చిత్రాన్ని నైజాం, ఓవ‌ర్‌సీస్ హ‌క్కుల‌ని నొబారియ‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ వారు సొంతం చేసుకున్నారు. 120 నిమిషాల ఈ చిత్రం లో యాక్ష‌న్‌, కామెడి, సెంటిమెంట్‌, రొమాన్స్‌, సందేశం, ఎమెష‌న్‌, ల‌వ్ లాంటి అన్ని జోనర్స్ క‌ల‌యికే ఈ కొబ్బ‌రిమ‌ట్ట‌..

సంపూర్ణేష్ చెప్పిన నాన్ స్టాప్ డైలాగ్ ఇదే -
ఏరా పెదరాయుడు... త్రికాలాత్రక...
ఓరి ఓరోరి ఆపరా నీ ఉన్మత్త గార్దభరవాలు...
ఎంత మరువ యత్నించినను మరపునకు రాక హృదయ శల్యాభిమానములైన నీ మదోన్మాదాపరాధము నా మనోవితలమును వ్రయ్యలు చేయుచున్నవే...

అహో క్షీరావారాసిజనతరాకాసుధాకర కొణెదెల నందమూరి అక్కినేని ఘట్టమనేని మంచు దగ్గుబాటి వంశసముత్పన్నమహొత్తమ మహా నట పరిపాలిత చిత్ర సామ్రాజ్యమున నూతన వారసుడనై,
నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశభువన శూరవరేణ్యులగు భ్రాతసమానులైన చతుష్టిపితృలకు అనుజుడనై,
సింహపురి తీరమున జన్మించి, భారత ఖండమున సకల జనులచే పరమపావనిగా కీర్తింపబడుతున్న మహోత్తమ మహిళ
ఈ పతివ్రత 'పండు'నకు పుత్రుడనై,
మానధనుడనై మనుగడ సాగించు నన్ను చూసి ఈ విశ్వమంతయు ప్రశుడట ప్రచుహత అని పగలబడి నవ్వుటయా...
అనాధా అని అవహేళన చేయుటయా...

అహో తన సతులతో తుల్యుడగు నన్ను పుత్రుడుగా సంభవింపక సన్మానింపక పితృధర్మ పరిత్యక్తుడై లజ్జావిముక్తుడై ఈ కపట పెదరాయుడు నన్నేల వివాసుని సేయవలె.
అవునులే అశుద్ధ స్వరూపుడగు రాయునకు యెగ్గేమి? సిగ్గేమి?
వంతువంతున ఆలికి ముందు ఆలిని పరిభోగించిన పర్యంతమూ రెచ్చిన కడుపిచ్చితో పచ్చి పచ్చి వైభవమున కేళించు వీడు
తన ఇంట ముగ్ధదాసి సాంగత్యమున నన్ను కని త్యజించినంత మాత్రమున
హా హ హా హ నేనేల కటకటపడవలె,
ఊరకుక్క ఉచితానుచిత జ్ఞ్యానముతో సంభోగించిన సరిపెట్టుకుందునా?
ఈ లోకమున మొయ్య మూకుడుండునా?
అయిననూ.... దుర్వ్యాజమున సాగించు అవివేక న్యాయవిచారణ అని తెలిసి తెలిసి...
హహ్హా... మేమేల రావాలె? వచ్చితిమిపో విచక్షణాపేతమై సవత్రా కామకలాపాలు సాగించు ఈ శునకము ఇచట ధర్మ విధేయతగా ఏల ఉండవలె…
ఉండినాడు పో, వృక్షమునకు వస్త్రము కట్టినా విధూత్యాపేక్ష కలిగి
తన పర భేదములని మర్చి విచక్షణారాహిత్యముతో అద్రసంభోగమునకు పాల్పడు ఈ త్రాపి ఉన్నచోట మా మాతృమూర్తి ఏల ఉండవలె?
ఉండినది పో, సజీవ భువచర మేష గోప సారూప్య మానవ సంచారికవితానమునకు ఆలవాలమగు ఈ గ్రామమున మేమేల కాలుమోపవలె?
మోపితిమిపో , సకల రాజనుకోటీరకోటిసంక్షిప్త రత్నప్రభా నీరాజితంబగు మాపాదపద్మమేల అపభ్రమనం చెందవలె...
ప్రతీకారేఛ్చతో గ్రామమున పాదం మోపిన మమ్ములను ఈ గ్రామసింహముతో సమరూపిణి అని అవమానించి...

అసలితని జన్మ రహస్యమేమన్న జుగుప్సాభావంతో ఈ జనుల కళ్లేల చూడవలె? నోరేల వాగవలె? చెవులేల వినవలె?
హ విధి హతవిధి ఆజన్మ శత్రువుయే అనుమానించుచునే అరుదెంచిన మమ్ము అవమాన బడబాన జ్వాలలతో దగ్ధమొనర్చుచున్నవమ్మా...
విముఖునిసుముఖునిజేసి మమ్మితకు విజయముసేయించిన నీ విజ్ఞాన విశేష విభావాదిత్యము ఏమైనది తల్లీ...

రాయుడు కృతావమాన మానసుడనై, మానాభిమానవర్జితుడనై మర్యాదాపూర్వకముగా మనుటయా? లేక
ఈ నా జన్మకారకుడైన ఈ నిరక్షరకుక్షుని క్షమించి వదిలేయుటయా?
ఇస్చీ... కామాంధముదృని పై పగసాధించలేమన్న మహోపేక్ష మాపైన వేరొకటియా?
ఏదీ కర్తవ్యం? మనుటయా ? వీదంతు చూసుటయ?
హహా హ్హాహ్హహ్హ...
రాయుడూ... నీకు క్షమాభిక్ష పెట్టుటకు మా అంతఃకరణము అంగీకరించుటలేదే...
ఈనాయందు ప్రవహించు రుధిరము నీదే కదా?
నీది అని విర్రవీగుతున్న ఈ జనం ధనం భోగం యోగం నీ నుంచి అపక్రమించి నిను వివస్త్రుడను గావించి
మార్గపద మధ్యమున సంసర్గముగ్ధుడ గావించెదను...

పెదరాయుడు Time is over…
Android Time starts now…

Facebook Comments
Burning Star Sampoornesh Babu's Kobbari Matta Trailer Gets Excellent Response

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz