కొత్త కాన్సెప్ట్ సినిమాలను ఆదరిస్తారని `నేనులేను` విజయంతో మళ్ళీ రుజువైంది - హీరో హర్షిత్
ఓ.యస్.యం విజన్ - దివ్యాషిక క్రియేషన్స్ పతాకాలపై సుక్రి కుమార్ నిర్మించిన సైకలాజికల్ థ్రిల్లర్నేను లేను
... లాస్ట్ ఇన్ లవ్
అనేది ఉపశీర్షిక. హర్షిత్, వంశీకృష్ణ పాండ్య, శ్రీపద్మ, మాధవి, బిశ్వజిత్‌నాధ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రామ్ కుమార్ దర్శకత్వం వహించారు. జూలై 26న విడుదలై మంచి టాక్ తో విజయవంతం గా ప్రదర్శింబడుతోంది. ఈ సందర్భంగా హీరో హర్షిత్ ఇంటర్వ్యూ...
నేపథ్యం..
- నేను పుట్టింది కర్నూలు. పదవ తరగతి వరకు కర్నూలులోనే చదువుకున్నాను. ఇంటర్మీడియట్ నుండి హైదరాబాద్ వచ్చేశాం. చిన్నప్పటి నుండి నటన అంటే ఆసక్తి. స్కూల్ చదివే రోజుల్లో డ్యాన్స్ అంటే ఆసక్తి ఉండేది. స్కూల్ పోటీల్లో డ్యాన్సులు చేసేవాడిని. అలా నెమ్మదిగా నటన అంటే ఆసక్తి ఏర్పడింది. డ్యాన్స్, నటనలో శిక్షణ తీసుకున్నాను. నటుడిగా నాకు హీరో సూర్యగారంటే చాలా ఇష్టం.
సినిమా రంగంలోకి ఎంట్రీ...
- 8 సంత్సరాలుగా దర్శకుడు రామ్‌కుమార్‌గారితో అనుబంధం ఉంది. ఆయన దర్శకత్వంలో గణపతిపప్పా మోరియా
సినిమా చేశాను. ఆ సినిమా కమర్షియల్‌గా అంత వర్కవుట్ కాలేదు. దీంతో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చేద్దామని భావించాను. ఇప్పుడు ట్రెండ్‌ను అనుసరించి థ్రిల్లర్ మూవీ చేద్దామని అనుకున్నాం.
ఇన్‌స్పైర్ కాలేదు..
- నేను లేను
సినిమా కథను ఎక్కడి నుండి ఇన్‌స్పైర్ అయ్యి తీసుకోలేదు. కాపీ కొట్టలేదు. డైరెక్టర్ రామ్‌కుమార్‌గారు చాలా గ్రౌండ్ వర్క్ చేసి ఛాలెంజ్‌గా తీసుకుని రాసుకున్న ఓన్ కథ. ప్యాక్‌డ్ ఎమోషన్స్, కామెడీ.. రొమాన్స్ ఇలా అన్ని అంశాలను మిక్స్ చేసి అద్భుతమైన కథను రాసుకున్నారు. ఆయన ఎంతో కష్టపడి రాసుకున్న ఈ కథ కోసం మేం అందరం బాగా కష్టపడి చేశాం.
ఛాలెంజింగ్‌గా తీసుకున్నా...
- నా క్యారెక్టర్ వినగానే చాలా కొత్తగా అనిపించింది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కావడంతో ఛాలెంజింగ్ ఉందని భావించి సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాను. సినిమా విడుదల తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమాను చూసిన వారందరూ బావుందని అప్రిషియేట్ చేస్తున్నారు. డైరెక్టర్ గారితో ఉన్న పరిచయం కారణంగా మరొకరితో చేయాలనుకున్న కథను నాతో చేయాలనుకున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్‌లో 36 మందితో ఓ ఫైట్ ఉంటుంది. అది పెద్ద హీరో చేయాల్సిన ఫైట్ నాతో చేయించారు దానికి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది. అందరూ నన్ను ఫైట్ బాగా చేశావు అని మెచ్చుకుంటున్నారు.కొత్త కాన్సెప్ట్ సినిమాలను చూడాలనుకునేవారికి నేనులేను
తప్పకుండా నచ్చుతుంది. నేను అనుకున్న దానికంటే సినిమా ఎక్కువగా రీచ్ అయ్యింది.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్..?
- రెండు సినిమాలున్నాయి. ఇంకా ఏవీ కమిట్ కాలేదు. హీరోగానే కాదు.. నటుడిగా పేరు వచ్చే ఎలాంటి పాత్రనైనా చేయడానికి నేను సిద్ధం.