Receiving a positive response for the earlier released concept poster of Tholubommalata, it is expected to be a completely entertaining family drama scripted around the concept "Life is like a Puppet Show" by Vishwanath Maganti.
Produced by Durga Prasad Maganti, the movie portrays comedy, love, and emotions with a perfectly twisted story and performances by Dr. Rajendra Prasad, Viswant, Harshitha, Vennela Kishore and others.
Coming to the story, a happy living old-man Somaraju known as Soldalaraju for his fondness in Goli Soda’s. As the movie progresses, he tries to resolve the issues and complexities rising in and around his family as a loving father and beloved grandfather. Was he able to solve them? What happened to him in this process? Why is it titled as “Tholubommalata”? will be answered on-screen.
Releasing First Look on the occasion of Dr. Rajendra Prasad’s Birthday, Tholubommalata movie team finished the shoot schedules in Hyderabad and Amalapuram recently and even started speeding up the post production works of the movie.
Story & Direction: Vishwanath Maganti
Cast: Dr. Rajendra Prasad, Viswant, Harshitha, Vennela Kishore, Devi Prasad, Dhanraj, Thagubothu Ramesh.
Music Director: Suresh Bobbili
Lyricist: Chaitanya Prasad
Producers: Durga Prasad Maganti
Production House: Suma Durga Creations
Editor: Kotagiri Venkateshwara Rao
Cinematographer: Satish Mutyala
Executive Producer: Ramesh Nukavalli
PRO: Pulagam Chinnarayana
Art Director: Mohan Kumar
డా.రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో
సుమ దుర్గా క్రియేషన్స్ నిర్మిస్తున్న
`తోలుబొమ్మలాట` ఫస్ట్ లుక్ విడుదల
నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్, విశ్వంత్, వెన్నెల కిషోర్, హర్షిత కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం తోలుబొమ్మలాట
. సుమ దుర్గా క్రియేషన్స్ పతాకంపై దుర్గా ప్రసాద్ మాగంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వనాథ్ మాగంటి దర్శకునిగా పరిచయమవుతున్నారు. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని తోలుబొమ్మలాట
ఫస్ట్ లుక్ ని శుక్రవారం (జూలై 19) విడుదల చేశారు.
నిర్మాత దుర్గా ప్రసాద్ మాగంటి మాట్లాడుతూ జీవితమంటేనే ఒక తోలుబొమ్మలాట. ఎవరి ఆటను వాళ్లు ఆడి తీరాల్సిందే. కాకపోతే కొన్నిసార్లు ఆ ఆటలో చిక్కుముడులుంటాయి. వాటిని ఎంత అందంగా విప్పగలిగాం? మనవారిని వాటి నుంచి ఎంత గొప్పగా విడిపించగలిగాం అనేది ఆసక్తికరంగా ఉంటుంది. అలాంటి అద్భుతమైన కథతో విశ్వనాథ్ మాగంటి ఈ సినిమా చేశారు. అనుకున్నదానికన్నా చక్కగా తెరకెక్కించారు. ఇదొక విభిన్న కుటుంబ కథా చిత్రం. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మా నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశాం. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, మంచి విలువలు... ఇలా అన్నీ కలగలిసి ఉంటాయి. మంచి సినిమా చేశామన్న ఆనందం ఉంది. సకుటుంబంగా చూసేలా ఉంటుంది. హైదరాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీ, అమలాపురం దగ్గరలోని కేశనపల్లి గ్రామం పరిసరాల్లోని అందమైన లొకేషన్లలో షూటింగ్ చేశాం
అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ మా చిత్రంలో ప్రధాన పాత్ర పేరు సోమరాజు. డా.రాజేంద్రప్రసాద్‌గారు ఆ పాత్రలో నటించారు. నటించారనడం కన్నా జీవించారనడం కరెక్ట్ గా ఉంటుంది.మా చిత్రంలో సోమరాజుకు గోలీ సోడాలంటే ఇష్టం. కాబట్టి అందరూ ఆయన్ని సోడాల్రాజు అని పిలుస్తుంటారు. ఆయన కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి. తండ్రిగా ఆయన వాటిని ఓ కొలిక్కి ఎలా తెచ్చారు? తన అనుభవంతో ఎలా పరిష్కరించారన్నది ఆసక్తికరం
అని అన్నారు.
నటీనటులు:
డా. రాజేంద్రప్రసాద్, విశ్వంత్, వెన్నెల కిషోర్, హర్షిత, దేవీ ప్రసాద్, నర్రా శ్రీనివాస్, నారాయణ రావు, సంగీత, కల్పన, శిరీష, చలపతి రావు, ప్రసాద్ బాబు, ధనరాజ్, పూజా రామచంద్రన్, తాగుబోతు రమేష్, జబర్దస్త్ రాజు, దొరబాబు, లక్ష్మణ్ మీసాల తదితరులు
టెక్నీషియన్స్ లిస్ట్:
నిర్మాత: దుర్గా ప్రసాద్ మాగంటి
రచన, దర్శకత్వం: విశ్వనాథ్ మాగంటి
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: సురేష్ బొబ్బిలి
పాటలు: చైతన్య ప్రసాద్
కెమెరా: సతీష్ ముత్యాల
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేష్ నూకవల్లి
ఆర్ట్: మోహన్ కుమార్
About Gopi
Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.
He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.
When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.
He can be reached at gopi@socialnews.xyz