Agent Sai Srinivasa Athreya movie success meet held

Agent Sai Srinivasa Athreya movie success meet held (Photo:SocialNews.XYZ)

స్వధర్మ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. స్వరూప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రాహుల్ యాదవ్ నక్కా నిర్మాత. ఈ జూన్ 21న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం జ‌రిగిన స‌క్సెస్ మీట్‌లో చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా న‌టీనటులు, సాంకేతిక నిపుణుల‌కు షీల్డుల‌ను అందించారు.....

సుహాస్ మాట్లాడుతూ - న‌వీన్ పొలిశెట్టి, డైరెక్ట‌ర్ స్వ‌రూప్‌గారికి థాంక్స్‌. చాలా మంచి బ్రేక్ వ‌చ్చింద‌ని అనుకుంటున్నాను. ఏజెంట్ బాబీ పాత్ర‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది అన్నారు.

విశ్వ‌నాథ్ మాట్లాడుతూ - సినిమాలో హీరోను ఇబ్బంది పెట్టే పాత్ర‌లో న‌టించిన పోలీస్ ఆఫీసర్‌గా న‌టించాను. న‌వీన్‌, స్వరూప్‌గారికి థాంక్స్‌. ప్రేక్ష‌కుల స‌పోర్ట్ మ‌రింత రావాలి అన్నారు.

ప్ర‌శాంత్ మాట్లాడుతూ - మంచి రోల్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు స్వరూప్‌, న‌వీన్‌కి థాంక్స్‌ అన్నారు.

విశ్వేశ్వ‌ర్ రావు మాట్లాడుతూ - గుంటూరులో సినిమా చూడ‌టానికి రెండో రోజు నేను బ్లాక్‌లో టికెట్ కొనుక్కుని వెళ్లాను. దాదాపు కొత్త‌వాళ్లంద‌రూ క‌లిసి చాలా మంచి సినిమా చేశారు. న‌వీన్ త‌న పెర్ఫామెన్స్‌తో ఎంటైర్ ఆడియెన్స్ త‌న‌వైపుకు తిప్పుకున్నారు. స్క్రీన్‌ప్లే, మార్క్ అందించించిన ఆర్‌.ఆర్ సినిమాను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లారు. ఎంటైర్ యూనిట్‌కు థాంక్స్‌ అన్నారు.

రాహుల్ యాద‌వ్ న‌క్కా మాట్లాడుతూ - నేను ఐపీయ‌స్ ఆఫీస‌ర్‌ని కావాలనుకున్నాను. కానీ కుద‌ర‌లేదు. ఓ సంద‌ర్భంలో గౌత‌మ్‌ను క‌లిసిన త‌ర్వాత ప్రొడ్యూస‌ర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేశాను. అలా నా జ‌ర్నీ మొద‌లైంది. సినిమా మంచి విజ‌యాన్ని సాధించ‌డం ఆనందంగా ఉంది. సినిమాపై చాలా మందికి చాలా అప‌న‌మ్మ‌కాలుండేవి. వాట‌న్నింటినీ దాటుకుని ఈరోజు స‌క్సెస్‌ను సాధించాం. ఈ సినిమాను నేను నిర్మించ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా టాలెంట్ ఉన్న న‌వీన్‌ని నేను హీరోగా ప‌రిచ‌యం చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. ఏడాదిన్న‌ర జ‌ర్నీ ఇది. థియేట‌ర్స్‌ను అడిగిన‌ప్పుడు ఫ‌స్ట్‌షోకి తీసేసే సినిమాకు థియేట‌ర్స్ ఎందుకు? అని కూడా ప్ర‌శ్నించిన‌వారున్నారు. సినిమా మూడో వారం స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. సినిమాను చేయ‌డం కంటే రిలీజ్ చేయ‌డం ఇంకా క‌ష్టం. రేపు రిలీజ్ అన్నా టెన్ష‌న్ ప‌డ్డాం. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌ అన్నారు.

సినిమాటోగ్రాఫ‌ర్ సన్ని మాట్లాడుతూ - ``అవ‌కాశం ఇచ్చిన న‌వీన్‌, స్వ‌రూప్, నిర్మాత రాహుల్‌గారికి థాంక్స్‌.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ మార్క్ కె.రాబిన్ మాట్లాడుతూ - న‌వీన్‌తో నాకు అస్స‌లు ప‌డేది కాదు. ఫ‌స్టాఫ్ ఆర్‌.ఆర్ చూసి త‌న‌కి బాగా న‌చ్చింది. అక్క‌డి నుండి త‌నేం మాట్లాడ‌లేదు. నాపై న‌మ్మ‌కం ఉంచినందుకు డైరెక్ట‌ర్ స్వ‌రూప్‌కి థాంక్స్‌. నిర్మాత రాహుల్ చాలా మంచి వ్య‌క్తి అన్నారు.

డైరెక్ట‌ర్ స్వ‌రూప్ రాజ్ మాట్లాడుతూ -నా డైరెక్ష‌న్‌టీమ్‌లో చాలా మంది నాకు బ‌ల‌మైన స‌పోర్ట్ ఇచ్చారు. వారు లేక‌పోతే ఈ సినిమాను ఇంత బాగా చేసుండేవాడిని కానేమో. డిజిట‌ల్ మాధ్య‌మం పెరిగిన త‌ర్వాత కూడా మా సినిమా మూడో వారం ర‌న్ అవుతుండ‌టం ఆనందంగా ఉంది. రిలీజ్ ముందు నేను, రాహుల్ ఎంత క‌ష్ట‌ప‌డ్డామో మాకు తెలుసు. న‌వీన్‌తోనే సినిమా చేయాల‌ని నేను నిర్ణ‌యించుకునే క‌థ‌ను రాసుకున్నాను. ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయకు పార్ట్ 2 ఎప్పుడో అని చాలా మంది అడిగారు. కానీ నేను ఇప్పుడు చెబుతున్నాను. ఈ మేం ఉన్నంత కాలం ఈ సినిమాకు ఫ్రాంచైజీ వ‌స్తూనే ఉంటుంది అన్నారు.

న‌వీన్ పొలిశెట్టి మాట్లాడుతూ - ఈ సినిమా మా రెండున్న‌రేళ్ల క‌ష్టం. ఒక అమ్మాయికి పెళ్లి చేసిన తండ్రి అత్తారింటికి పంపేట‌ప్పుడు ఎంత బాధ‌ప‌డ‌తాడో.. మేం కూడా అంతే బాధ‌తో ప్రేక్ష‌కుల ద‌గ్గ‌ర‌కు పంపాం. కానీ తెలుగు ప్రేక్ష‌కులు చాలా ప్రేమ‌, గౌర‌వంతో మా అమ్మాయిని ఆహ్వానించారు. ప్ర‌పంచంలో ఎన్నో ఫిలిం ఇండ‌స్ట్రీస్ ఉన్నాయి. ఎంతో మంది ఆడియెన్స్ సినిమా చూస్తారు. కానీ తెలుగు ప్రేక్ష‌కులు సినిమాను ప్రేమించేలా మ‌రెవ‌రూ ప్రేమించ‌లేర‌ని మా అంద‌రికీ తెలుసు. ఇది మాకు దొరికి వ‌రం. సినిమా రిలీజ్ వ‌ర‌కు మాకు టెన్ష‌న్‌ ప‌డ్డాం. యు.ఎస్ నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింద‌ని తెలిసింది. మాకు అమెరికాలోని తెలుగు ఆడియెన్స్ మాకు స్ఫూర్తినిచ్చారు. అదే రెస్పాన్స్ ఇక్క‌డి ప్రేక్ష‌కుల నుండి కూడా వ‌చ్చింది. అస‌లు రెండు మూడు థియేటర్స్ అయినా దొరుకుతాయో లేదోనని సందేహం ఉండేది. కానీ.. 60-70 థియేట‌ర్స్‌లో షో ప‌డింది. ఇప్పుడు విజ‌య‌వంతంగా మూడో వారంలోకి సినిమా ఎంట్రీ ఇచ్చింది. ఇండ‌స్ట్రీ నుండి కూడా చాలా మంచి రెస్సాన్స్ వ‌చ్చింది. విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాకు ముందు నుండి స‌పోర్ట్ చేస్తూ వ‌స్తున్నాడు. రాఘ‌వేంద్రరావుగారు కూడా అభినందించారు. బ‌న్నీగారు ట్వీట్ చేయ‌డంతో పాటు మ‌మ్మ‌ల్ని పిలిచి అర‌గంట మాట్లాడారు. నేను ఈరోజు ఇక్క‌డ నిల‌బ‌డి ఉండ‌టానికి కార‌ణం స్వ‌రూప్‌, నిర్మాత రాహుల్‌గారి న‌మ్మ‌క‌మే. నేను హీరోగా సినిమా చేయాల‌నే కోరిక ఈరో్జు తీరింది. కొత్త ప్ర‌యాణం స్టార్ట్ అయ్యింది. ఇంకా ఎక్కువగా క‌ష్ట‌ప‌డ‌తాను అన్నారు.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%