Social News XYZ     

Kalyan Ram’s next titled Entha Manchi Vaadavu Raa

Kalyan Ram's next titled Entha Manchi Vaadavu Raa

Kalyan Ram’s next titled Entha Manchi Vaadavu Raa (Photo:SocialNews.XYZ)

Nandamuri Kalyan Ram celebrating his birthday today and as a gift to his fans, the title of his next movie in direction of Satish Vegesna is announced. A pure Telugu title is given for #NRK17 movie and also the title logo is presented with a video making things more adorable. Kalyan Ram and Satish Vegesna’s movie is titled as “Entha Manchivaadavuraa” and the title logo video is impressive that showcase the character of the hero from the flick.

National award-winning director Satish Vegesna is very particular about using only pure Telugu titles for his films and he repeated the same for his project with the Nandamuri hero also. For the first time, Mehreen Pirzada is paired opposite Kalyan Ram in this movie. The Nandamuri hero has recently scored a hit with “118” and even Mehreen has received success with “F2 – Fun & Frustration”, making the film more viable at the box office for its producers.

 

Gopi Sunder is composing music for Entha Manchivaadavuraa and Raj Thota is the DOP for the film. Popular music company Adithya Music is making their debut into production by producing this movie. Watch the Entha Manchivaadavuraa title logo teaser and check out the innovative thought that was put to let everyone know about the movie plot, hero characterization from the film. Post your thoughts on the logo teaser folks.

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ చిత్రం టైటిల్‌ ` ఎంత మంచివాడ‌వురా`

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న తాజా చిత్రం టైటిల్ ఎంత మంచివాడ‌వురాను ప్ర‌క‌టించారు. ఆదిత్య మ్యూజిక్ ఇండియా (ప్రైవేట్‌) లిమిటెడ్‌, శ్రీదేవి మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్ర‌మిది. ఉమేష్ గుప్త స‌మ‌ర్పిస్తున్నారు.  సుభాష్ గుప్త‌, శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మాత‌లు.  జాతీయ అవార్డ్ విన్న‌ర్ స‌తీశ్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

 నిర్మాత‌లు మాట్లాడుతూ హీరో క‌ల్యాణ్‌రామ్‌గారికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. ఆయ‌న పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని సినిమా టైటిల్‌ `ఎంత మంచివాడ‌వురా`ను ప్ర‌క‌టించ‌డం ఆనందంగా ఉంది. మా హీరో స్వ‌త‌హాగా మంచి మ‌నిషి. ఈ చిత్రంలో ఆయ‌న పాత్ర కూడా ఆ విష‌యాన్నే ప్ర‌తిబింబిస్తుంది. అచ్చ‌మైన తెలుగు టైటిళ్లు పెట్ట‌డంలో ఈ మ‌ధ్య కాలంలో ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న‌కు మంచి పేరు వ‌చ్చింది. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో క‌ల్యాణ్‌రామ్ హీరోగా చేస్తున్న సినిమాకు ఏం టైటిల్ పెట్ట‌బోతున్నామోన‌ని చాలా మంది ఆస‌క్తిగా ఎదురుచూశారు. టైటిల్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి శ్రేయోభిలాషులంద‌రూ చాలా బావుంద‌ని ఫోన్లు చేసి ప్ర‌శంసిస్తున్నారు. టైటిల్‌లో పాజిటివ్ వైబ్స్ క‌నిపిస్తున్నాయ‌ని చెబుతున్నారు. ఈ నెల  24 నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. నిర‌వ‌ధికంగా హైద‌రాబాద్‌, రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాలు, ఊటీ లో చిత్రీక‌ర‌ణ చేస్తాం. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌నూ మెప్పించే సినిమా అవుతుంది అని అన్నారు.

ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న మాట్లాడుతూ ముందుగా మా క‌థానాయ‌కుడికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. మా సినిమా క‌థ‌కు స‌రిపోయే టైటిల్ ఇది. టైటిల్‌ని బ‌ట్టి హీరో కేర‌క్ట‌రైజేష‌న్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. పైగా `ఎంత మంచివాడ‌వురా` అనే ప‌దాన్ని మ‌న నిత్య‌జీవితంలో త‌ర‌చూ వింటూ ఉంటాం. విన‌గానే క్యాచీగా ఉంద‌ని ఈ టైటిల్‌ని ఎంపిక చేసుకున్నాం అని అన్నారు.

న‌టీన‌టులు:
నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, మెహ‌రీన్‌, వి.కె.న‌రేశ్‌, సుహాసిని, త‌నికెళ్ల భ‌ర‌ణి, ప‌విత్రా లోకేశ్‌, రాజీవ్ క‌న‌కాల‌, వెన్నెల‌కిశోర్‌, ప్ర‌వీణ్‌, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు
క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: స‌తీశ్ వేగేశ్న‌
నిర్మాత‌: ఉమేశ్ గుప్తా
సినిమాటోగ్ర‌ఫీ:  రాజ్ తోట‌
సంగీతం:  గోపీ సుంద‌ర్‌
ఎడిటింగ్‌: త‌మ్మిరాజు
ఆర్ట్‌:  రామాంజ‌నేయులు
ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: ర‌షీద్ ఖాన్‌

Facebook Comments
Kalyan Ram's next titled Entha Manchi Vaadavu Raa

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz