- మాసివ్ యాక్షన్ థ్రిల్లర్ గా పారిజాత మూవీ క్రియెషన్స్ చియాన్ విక్రమ్ నటించిన "మిస్టర్ కెకె"
శివపుత్రుడు, అపరిచితుడు చిత్రాలతో తెలుగు లో స్టార్ ఇమేజ్ ని సోంతం చేసుకున్న చియాన్ విక్రమ్ కథానాయకుడిగా అక్షరహసన్, అభిహసన్ కీలక పాత్రల్లో రాజేష్ ఎం సెల్వ దర్శకత్వం లో తమిళం లో రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్‌నేషనల్ నిర్మాణం లో ట్రైడెంట్ ఆర్ట్స్ కె.రవిచంద్రన్ బ్యానర్ పై రూపోందిన కదరమ్ కొండన్ చిత్రాన్ని తెలుగు లో నిర్మాతలు టి.నరేష్ కుమార్, టి. శ్రీధర్ లు సంయుక్తంగా టి.అంజయ్య సమర్పణ లో ఉత్తమాభిరుచి గల నిర్మాణ సంస్థ పారిజాత మూవీ క్రియెషన్స్ బ్యానర్ పై విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ గా థ్రిల్ ని అందించే విధంగా దర్శకుడు తెరకెక్కించాడు. ఈ చిత్రానికి తెలుగు లో మిస్టర్ కెకె అనే టైటిల్ ని ఎనౌన్స్ చేయగానే సోషల్ మీడియా నుండి సామాన్య ప్రేక్షకుడి వరకూ హ్యూజ్ రెస్పాన్స్ రావటం తో ట్రేడ్ లో ఈ సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి. అయితే ఈ రోజు మిస్టర్ కెకె ట్రైలర్ ని విడుదల చేశారు. లోకనాయకుడు పద్మభూషణ్ శ్రీ కమల్‌హసన్ గారు తమిళ ట్రైలర్ ని విడుదల చేయగా, అక్షర హసన్ తెలుగు వెర్షన్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జులై లో విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు..
నిర్మాతలు టి.నరేష్ కుమార్ అండ్ టి శ్రీధర్ లు మాట్లాడుతూ.. మా బ్యానర్ పారిజాత మూవీ క్రియెషన్స్ లో మంచి చిత్రాలు చేయాలనే మా ప్రయత్నానికి తెలుగు ప్రేక్షకుల ఆశీశ్శులు బలంగా వున్నాయి. ఇటీవలే కిల్లర్ చిత్రం మంచి కమర్షియల్ విజయాన్ని సాధించింది. ఇప్పడు మా బ్యానర్ లో తమిళం లో నిర్మిణమైన కదరమ్ కొండన్ చిత్రాన్ని తెలుగు లో మిస్టర్ కెకె అనే పేరుతో విడదుల చేస్తున్నాము. చియాన్ విక్రమ్ గారు నటించిన ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేశాము. ట్రైలర్ లో విక్రమ్ గెటప్ గాని ఆయన లుక్ చింపేసిందని అందరూ ఒకే మాట చెబుతున్నారు. అలాగే విజువల్ గ్రాండియర్ గా కనిపించిన ఈ చిత్రం గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే రిలీజ్ చేసిన ట్రైలర్ లోనే కనిపించటం విశేషం. అలాగే అక్షర హసన్ కూడా పెర్‌ఫార్మెన్స్ స్కోప్ వున్న పాత్రలో కనిపించింది. రెబల్‌స్టార్ ప్రభాస్ సాహో లాంటి చిత్రం తరువాత జిబ్రాన్ మిస్టర్ కెకె కి మ్యూజిక్ ని ఇవ్వటం ఈ సినిమా రేంజ్ ని డబుల్ చేసింది. ట్రైలర్ లో విక్రమ్ చెప్పిన నువ్వు ఆడుతున్నది నాతో కాదు యముడితో అనే డైలాగ్ కి మాసివ్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్‌తో అంచనాలూ మొదలయ్యాయి. సమర్దుడైన కమాండర్ గా విక్రమ్ యాక్షన్ ప్రేక్షకుల్ని విపరీతం గా ఆకట్టకొనుంది. ట్రైలర్ లో యాక్షన్ ఎక్కువ చూపించినా థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ చాలా వున్నాయి. అవన్ని చూడాలంటే దియెటర్స్ లోనే చూడాలి.. అతి త్వరలో డేట్ ఎనౌన్స్ చేస్తాము.. అని అన్నారు
నటీనటులు.. విక్రమ్, అక్షర హసన్, అభి హసన్ తదితరులు
పారిజాత మూవీ క్రియెషన్స్ మ్యూజిక్.. జిబ్రాన్ పి ఆర ఓ.. ఏలూరు శ్రీను సమర్సణ.. టి.అంజయ్య నిర్మాతలు... టి.నరేష్ కుమార్ అండ్ టి. శ్రీధర్ రచన, దర్శకత్వం .. రాజేష్ ఎం సెల్వ