Social News XYZ     

Naga Shaurya joins Ira Creations movie shoot after the accident

Naga Shaurya joins Ira Creations movie shoot after the accident

Naga Shaurya joins Ira Creations movie shoot after the accident (Photo:SocialNews.XYZ)

ఐరాక్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రోడ‌క్ష‌న్ నెం 3 గా తెర‌కెక్కిస్తున్న చిత్రం షూటింగ్ వైజాగ్ లో జ‌రుగుతుండ‌గా హీరో నాగ‌శౌర్య కాలికి గాయం అయిన విష‌యం తెలిసిందే.. ఆ త‌రువాత హైద‌రాబాద్ చేరుకుని రెస్ట్ తీసుకున్నారు. డాక్ట‌ర్ ల స‌లహ మేర‌కు చిన్న స‌ర్జ‌రి జ‌రిగింది. ఇటీవ‌ల త‌ను న‌టించిన ఓబేబి ఫంక్ష‌న్ కి హ‌జ‌ర‌య్యారు. యాక్సిడెంట్ అయిన త‌రువాత మెద‌టిసారిగా ఓబేబి ఫంక్ష‌న్ కి మాత్ర‌మే వ‌చ్చారు. కాలు జాయింట్ ద‌గ్గ‌ర న‌రాలు చిట్ల‌డం తో దాదాపు నెల రొజుల పాటు విశ్రాంతి తీసుకొవాల‌ని డాక్ట‌ర్లు చెప్పారు. కాని త‌ను న‌టించిన చిత్రం కావ‌టం హ‌జ‌రు కావ‌టం త‌న ధ‌ర్మం అని భావించిన నాగ‌శౌర్య ఓబేబి ఫంక్ష‌కి కి హ‌జ‌రు కావ‌టం జ‌రిగింది. ఇప్ప‌డు కూడా ఆర్టిస్టులు డేట్స్ ఎడ్జ‌స్ట్మెంట్ స‌మ‌స్య కాకూడ‌దు అని భావించి షూటింగ్ కి హ‌జ‌ర‌య్యారు. ఈరోజు నుండి హైద‌రాబాద్ లోని మ‌ల‌క్‌పేట ప్రాంత్రంలో షూటింగ్ కార్య‌క్ర‌మాలు మెద‌లు పెట్టారు. మెద‌టి షాట్ కూడా హీరో నాగ‌శౌర్య మీదనే చిత్రీక‌రించారు.

ఛ‌లో లాంటి చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో వ‌స్తున్న ఈ చిత్రంతో రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చిత్ర స‌మ‌ర్ప‌కుడు శంక‌ర్ ప్ర‌సాద్ , లైన్‌ ప్రోడ్యూస‌ర్ బుజ్జి లు చిత్ర యూనిట్ ని ఫ్యామిలి మెంబ‌ర్స్ లా చూసుకుంటున్నారు.. దానికి నిద‌ర్మ‌న‌మే నాగ‌శౌర్య కి యాక్సిడెంట్ జ‌రిగింద‌ని తెలుసుకున్న‌యూనిట్ స‌బ్యులు హీరో ని ప‌ర్స‌న‌ల్ గా క‌లిసి త్వ‌ర‌గా కొలుకొవాల‌ని కొరుకున్నారు. నిర్మాత ఉషాముల్పూరి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ తేజ విజ‌న్ త‌గ్గ‌ట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఐరా క్రియేష‌న్స్ హ స్పిటాలికి కేరాఫ్ అడ్రాస్ గా టాలీవుడ్ లో పేరుంది దానికి త‌గ్గ‌ట్టుగానే వారి ప్రేమానురాగాలు యూనిట్ మెత్తం మీద చూపిస్తారు. ఈ చిత్రంలో నాగ‌శౌర్య కి జంట‌గా మెహరీన్ నటిస్తుంది.

 

నిర్మాత‌లు మాట్లాడుతూ.. మా చిత్ర షూటింగ్ వైజాగ్ లో జరుగుతున్న స‌మ‌యం లో మా చిత్ర హీరో నాగ‌శౌర్య కి యాక్సిడెంట్ జ‌ర‌గ‌టం మమ్మ‌ల్ని ఎంత‌లా క‌ల‌చి వేసిందో.. ఆయ‌న అంతే త్వ‌ర‌గా కొలుకుని మా చిత్ర షూటింగ్ లో ఈ రోజు పాల్గోవ‌టం ఆనందాన్ని క‌లిగించింది. అలాగే ఈ షెడ్యూల్ హైద‌రాబాద్ లోని మ‌ల‌క్ పేట లో స్టార్ట్ చేశాము. అయితే ఈ నెల 20 వ‌ర‌కూ ఈ షెడ్యూల్ కొన‌సాగుతుంది. కొన్ని కీల‌క స‌న్నివేశాలు ఈ షెడ్యూల్ లో చిత్రీక‌రిస్తాము.. అని అన్నారు

పోసానికృష్ణ‌ముర‌ళీ, స‌త్య‌, ప్రొయ‌ర‌మ‌ణ‌, వి.జ‌య‌ప్రకాష్‌, కిషోర్‌, ఎం.ఎస్‌. భాస్క‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ఃశ్రీ‌చ‌ర‌ణ్‌, కెమెరాఃమ‌నోజ్‌రెడ్డి, ఎడిట‌ర్‌గారీబిహెచ్‌, ఆర్ట్‌డైరెక్ట‌ర్ఃకిర‌ణ్‌కుమార్ మ‌న్నే, కొరియోగ్రాఫర్ః ర‌ఘుమాస్ట‌ర్‌, స్టోరీః నాగ‌శౌర్య‌, స్ర్కీన్‌ప్లేఃర‌మ‌ణతేజ‌, ఫ‌ణీంద్ర‌బిక్కిన‌, డైరెక్ష‌న్ఃర‌మ‌ణ్‌తేజ‌, ప్రొడ్యూస‌ర్ఃఉషాముల్పూరి, పిఆర్ ఓః ఏలూరుశ్రీ‌ను.

Facebook Comments