ఆగష్ట్ లో విడుదలకు సిద్ధమవుతోన్న "మా ఊరి ప్రేమకథ"
యంగ్ తరంగ్ మంజునాథ్ హీరోగా 'శరణం గచ్ఛామి' ఫేం తనిష్క తివారి హీరోయిన్ గా శ్రీ మల్లికార్జునస్వామి క్రియేషన్స్ పతాకంపై మంజునాథ్ దర్శకత్వంలో లక్ష్మీ దేవి, మహేంద్రనాథ్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం "మా ఊరి ప్రేమకథ". విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే లవ్ అండ్ యాక్షన్ ఎంటెర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం డి ఐ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్బంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలిపారు.
నిర్మాతలు లక్ష్మీదేవి, మహేంద్రనాథ్ మాట్లాడుతూ.. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని నిర్మించాం. కథ,కథనాలు ఆకట్టుకుంటాయి. మంజునాథ్ హీరోగా నటిస్తూ .. అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సెంటిమెంట్, యాక్షన్, ఎంటర్ టైన్మెంట్ అన్నీ ప్రేక్షకులకు నచ్చుతాయి. ఈ చిత్రంలో మొత్తం ఐదు పాటలు వున్నాయి. జయసూర్య ఆణిముత్యాల్లాంటి పాటలను అందించారు. షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యింది. త్వరలో సెన్సార్ పూర్తిచేసి ఆగష్ట్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు.
హీరో, దర్శకుడు మంజునాథ్ మాట్లాడుతూ.. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ క్యారెక్టర్లో నటించాను. నీళ్లు పట్టుకోవడానికి వచ్చిన ఒక అమ్మాయిని చూసి అతను లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి ఆ డ్రైవర్ లవ్ ని యాక్సెప్ట్ చేసిందా? లేదా అనేది చిత్ర కథాంశం. రియలిస్టిక్ అంశాలతో గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. జయసూర్య ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. గోపి ఐదుపాటలకి నృత్య దర్శకత్వం వహించారు. అలాగే ఈ చిత్రంలో రెండు అద్భుతమైన ఫైట్స్ ఉంటాయి. సతీష్ ఒక ఫైట్, దేవరాజ్ మరో ఫైట్ ని వండర్ పుల్ గా కంపోజ్ చేసారు. 'మా ఊరి ప్రేమకథ' చిత్రం హీరోగా దర్శకుడిగా నాకు మంచి పేరు తెస్తుందని కాన్ఫిడెన్స్ తో వున్నాను.. అన్నారు.
మంజునాథ్, తనిష్క తివారి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం; జయసూర్య, కెమెరా; కళ్యాణ్ సమి, ఎడిటింగ్; ఆవుల వెంకటేష్, యాక్షన్; సతీష్, దేవరాజ్, కొరియోగ్రఫీ; గోపి, పి.ఆర్ .ఓ; జిల్లా సురేష్, మేకప్; బాబురావు, ప్రొడక్షన్ మేనేజర్; వెంకటేష్. కథ-మాటలు-స్క్రీన్ ప్లై-దర్శకత్వం- మంజునాథ్, నిర్మాతలు; లక్ష్మీదేవి, మహేంద్రనాథ్.
This website uses cookies.