Social News XYZ     

Sai Pallavi’s psychological thriller ‘Athiran’ to release in Telugu

Sai Pallavi's psychological thriller 'Athiran' to release in Telugu

Sai Pallavi’s psychological thriller ‘Athiran’ to release in Telugu (Photo:SocialNews.XYZ)

As far as the Telugu audience are concerned, Sai Pallavi is a Telugu girl. That's what 'Fidaa' established in the minds of the audience. Not only did she learn Telugu right for her first Tollywood movie but also dubbed her voice. She has since become fluent in the language. While she has done very few movies in Telugu, she enjoys a vast fan following. To cater to them and the novelty-loving Telugu audience, her Malayalam-language thriller 'Athiran' is being dubbed. Well-known producer Annamreddy Krishna kumar is bringing the film to the Telugu audience.

The promising film stars Sai Pallavi, Fahadh Faasil, Prakash Raj and Atul Kulkarni in prominent roles. Directed by Vivek, the superhit film bagged a blockbuster at the box-office when it released in Malayalam recently. Jayanth Arts' AK Kumar and G Ravikumar are producing the Telugu version.

 

"The story is based on certain true incidents that happened in Kerala back in 1970. Both Prakash Raj and Atul Kulkarni are familiar to the Telugu audience. Ghibran, who is working on Prabhas' 'Saaho', has composed the background music. Dubbing works are currently going on. We are planning to release the movie in the last week of August. The Telugu trailer will be out soon," the producers say.

Renji Panicker, Leona Lishoy, Shanti Krishna and others are part of the cast.

PRO: Surendra Kumar Naidu-Phani Kandukuri. Dialogues: M Rajasekhar Reddy. Lyrics: Charan Arjun, Madhu Mamidi Kalva. Editing: Ayoob Khan. Cinematography: Anu Moothedath. Screenplay: PF Mathews. Executive Producer: Dakshin Srinivas. Background Score: Ghibran. Music: PS Jayahari. Direction: Vivek. Producers: AK Kumar, G Ravikumar.

తెలుగులోకి సాయిపల్లవి సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘అథిరన్‌’

మన ప్రేక్షకులకు సాయి పల్లవి తెలుగమ్మాయే. ‘ఫిదా’తో అంతలా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందామె. తొలి చిత్రానికి తెలుగు నేర్చుకోవడమే కాదు... తన పాత్రకు స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకుంది. తెలుగులో గలగలా మాట్లాడుతోంది. సాయి పల్లవి చేసిన తెలుగు సినిమాలు తక్కువే అయినప్పటికీ... ఆమెకున్న అభిమానులు ఎక్కువే. వాళ్ల కోసం, తెలుగు ప్రేక్షకుల కోసం సూపర్‌హిట్‌ మలయాళ చిత్రం ‘అథిరన్‌’ను ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్‌ తెలుగులోకి తీసుకొస్తున్నారు.

సాయి పల్లవి, ఫహాద్‌ ఫాజిల్‌, ప్రకాశ్‌రాజ్‌, అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్‌హిట్‌ మలయాళ సినిమా ‘అథిరన్‌’. వివేక్‌ దర్శకత్వం వహించారు. కొన్ని రోజుల క్రితం మలయాళంలో విడుదలైన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ భారీ విజయం సాధించింది. ఈ చిత్రాన్ని జయంత్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎ.కె. కుమార్‌, జి. రవికుమార్‌ తెలుగులో అనువదిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘కేరళలో 1970లలో జరిగిన వాస్తవంగా జరిగిన ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. సాయి పల్లవితో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ప్రకాశ్‌రాజ్‌, అలాగే అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రభాస్‌ ‘సాహో’కి నేపథ్య సంగీతం అందిస్తున్న జిబ్రాన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆగస్టు చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నాం. త్వరలో తెలుగు టైటిల్‌ ప్రకటిస్తాం’’ అని అన్నారు.

రెంజి పానికర్‌, లియోనా లిషోయ్‌, శాంతి కృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు - ఫణి కందుకూరి, మాటలు: ఎం. రాజశేఖర్‌రెడ్డి, పాటలు: చరణ్‌ అర్జున్‌, మధు పమిడి కాల్వ, ఎడిటింగ్‌: అయూబ్‌ ఖాన్‌, కెమెరా: అను మోతేదత్‌, స్ర్కీన్‌ప్లే: పి.ఎఫ్‌. మాథ్యూస్‌, ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్: దక్షిణ్ శ్రీన్వాస్, నేపథ్య సంగీతం: జిబ్రాన్‌, స్వరాలు: పి.ఎస్‌. జయహరి, దర్శకత్వం: వివేక్‌, నిర్మాతలు: ఎ.కె. కుమార్‌, జి. రవికుమార్‌

 

 

Facebook Comments