Social News XYZ     

Nani To Voice For Simba In The Telugu Version Of Disney’s The Lion King

After having conquered hearts with ‘The Jungle Book’ in 2016, Disney is all set to present its legendary franchise and the crown jewel - ‘The Lion King’ – with ground-breaking technology that re-imagines the greatest story ever told. Etched forever in pop culture, the animated version was known for its strong and emotional storytelling and memorable characters that won hearts of fans everywhere. The cute lion cub Simba who rises up to become a heroic son, avenging his family and taking his rightful place on the throne, has been a favorite character for generations.

Audiences have been eagerly waiting to watch the live action on the big screen, and especially for Telugu fans, here is some fantastic news! Disney India has roped in reigning heart-throb of the young brigade and millennial icon Nani to voice the iconic character of Simba in the Telugu version!
A ‘natural star’ as he is called by fans, Nani says, “I have been a huge fan of Disney movies since my childhood and I have fond memories of their iconic characters. Simba is one such character that is a family favorite from the movie The Lion King, and when the opportunity to voice him in Telugu came my way, I was excited and thrilled! The Lion King is a perfect all-in-one family entertainer and I hope my fans and movie lovers appreciate this new role of mine!”

Directed by ‘Iron Man’ and ‘The Jungle Book’ fame director, Jon Favreau, Disney’s The Lion King is one of the most-anticipated films of recent times. The heroic coming-of-age journey will make it to the large canvas with a pioneering and game-changing photo-real animation technology, using cutting-edge tools to make the musical drama come alive on the big screen.

 

"ల‌య‌న్ కింగ్" లో సింబా పాత్ర కి డ‌బ్బింగ్ చెప్పిన నేచుర‌ల్ స్టార్ నాని

అడ‌విలో జంతువులు మాట్లాడ‌టం, ప్రేమ‌ని చూపించ‌టం, స్నేహం చేయ‌టం లాంటి సీన్స్ చాలా థ్రీల్లింగ్ గా వుంటాయి. కాని నిజ‌జీవితం లో జ‌ర‌గ‌వు. కాని డిస్నీ లోకం లో మాత్రం అది సాధ్య‌మ‌వుతాయి..క్రూ ర మృగాలు మనషుల వలే మాట్లాడతాయి, మిగతా మృగాలతో స్నేహం చేస్తాయి, కలిసిమెలిసి జీవిస్తాయి. ఏదయినా జంతువు కనిపిస్తే వేటాడి తినేసే రారాజు సింహం తన రాజ్యం లో ఉన్న జంతువులను కాపాడుతూవుంటుంది. ఇది అంతా డిస్ని వాళ్లు తయారు చేసిన లయన్ కింగ్ అనే సినిమా కథ. డిస్నీ క‌థ‌ల‌కి పిల్ల‌ల్లో పెద్ద‌ల్లో చాలా క్రేజ్ వుంటుంది. ఈ క్రేజ్ అంతాడ‌బుల్‌, త్రిబుల్ చేయ‌టానికి ఈ పాత్ర‌ల‌కి సూప‌ర్‌స్టార్స్ చేత డ‌బ్బింగ్ చెప్పించి మరింత ఆక‌ట్ట‌కుంటున్నారు.

నేచుర‌ల్‌స్టార్ నాని డ‌బ్బింగ్ ల‌య‌న్‌కింగ్ చిత్రానికి హైలెట్‌

వ‌రుస చిత్రాల విజ‌యాల‌తో దూసుకుపోతూ నేచుర‌ల్ స్టార్ గా ఎదిగిన నాని ఇప్ప‌డు ల‌య‌న్ కింగ్ లోని సింబా పాత్ర‌కి డ‌బ్బింగ్ చెప్ప‌టం అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్ గా వైర‌ల్ అవుతుంది. నాని ఇటీవ‌లే జెర్సి లాంటి మైల్‌స్టొన్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ని సాధించిన త‌రువాత ప్ర‌స్తుతం గ్యాంగ్‌లీడ‌ర్ మ‌రియు వి లాంటి వినూత్న‌మైన కాన్సెప్ట్ చిత్రాలు చేస్తున్నారు. ఇంత బిజిగా వున్నాకూడా డిస్ని లాంటి ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత గాంచిన డిస్ని లాంటి సంస్థ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ల‌య‌న్‌కింగ్ లో హీరో పాత్ర సింబా కి డ‌బ్బింగ్ చెప్ప‌టం తెలుగు ప్రేక్ష‌కుల‌కి ల‌య‌న్‌కింగ్ మరింత ద‌గ్గ‌ర‌య్యింది.

ల‌య‌న్ కింగ్ లో సింబా నే హీరో ఈ పాత్ర చాలా ముఖ్య‌మైన‌ది కూడా ఈ పాత్ర‌కి హిందిలో షారుక్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ తో డ‌బ్బింగ్ చెప్పించారు. ఇప్ప‌డు తెలుగులో నేచుర‌ల్ స్టార్ నాని డబ్బింగ్ చెబుతున్నారు. అలాగే ముసాఫా పాత్ర కి షారుక్ ఖాన్ చెప్ప‌గా తెలుగు లో జ‌గ‌ప‌తిబాబు చెప్పారు. అలాగే పుంబా పాత్ర‌కి బ్ర‌హ్మ‌నందం, టీమోన్ పాత్ర‌కి ఆలీ డ‌బ్బింగ్ చెప్పారు. ముఫార్ పాత్ర‌కి పి.ర‌విశంక‌ర్ డబ్బింగ్ చెప్పారు. ల‌య‌న్‌కింగ్ ని డిస్ని సంస్థ చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ప్ర‌తి పాత్ర‌కి సూప‌ర్‌స్టార్స్ తో డ‌బ్బింగ్ చెప్పిస్తున్నారు.ఎంతో కేర్ తీసుకుని మ‌రీ చేస్తున్నారు..

డిస్నీ కామిక్ పుస్తకాల్లో పుట్టిన ఈ సింహం పేరు సింబ, సింబ నే లయన్ కింగ్ కథ కి హీరో, అలానే సింబ తో పాటు టిమోన్ అనే ముంగిస పుంబా అనే అడివి పంది లయన్ కింగ్ కథ లో ముఖ్య పత్రాలు. కార్టూన్ నెట్వర్క్ లో కామిక్ సీరియల్ గా మొదలైన లయన్ కింగ్ ని ఆ తరువాత డిస్నీ వారు 2డి ఆనిమేటెడ్ సినిమా గా 90లో విడుదల చేసారు. అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ని ఇప్పుడు 3డి ఆనిమేటెడ్ టెక్నాలజీ తో, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి లయన్ కింగ్ ఫాన్స్ కి, కామిక్ అభిమానులకి సరి కొత్త అనుభూతుని ఇచ్చేందుకు మరో మారు డిస్నీ వారు ప్రయత్నిస్తున్నారు. అందలో భాగం గానే లయన్ కింగ్ కొత్త హంగులతో 3డి ఆనిమేటెడ్ సినిమా గా జులై 19న విడుదల అవుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని ముఖ్య భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే, మార్వేల్ - డిస్నీ సంయుక్తంగా నిర్మించి విడుదల చేసిన అవెంజర్స్ ఎండ్ గేమ్ బ్లాక్బస్టర్ గా నిలిచింది. ఆ వెంటనే అల్లాద్దీన్ రూపం లో మరో మారు డిస్నీ వారు వరల్డ్ మూవీ లవర్స్ ని అలరించారు. ఇప్పుడు లయన్ కింగ్ రూపం లో మరో హిట్ తమ అకౌంట్ లో పడనుంది అని డిస్నీ ఇండియా బృందం ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగు లో కూడా లయన్ కింగ్ భారీ స్థాయిలో విడుదల కి రెడీ అవుతుంది.

Facebook Comments
Nani To Voice For Simba In The Telugu Version Of Disney's The Lion King

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz